Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komatireddy venkatreddy : వంద రోజుల్లోనే ఉచిత విద్యుత్

--మేనేజ్మెంట్ కోటా ఎమ్మెల్యే కరెంట్ బిల్లులు కట్టొద్దనడం అర్థరహితం --కమిషన్ ల వల్లే యాదాద్రి పవర్ ప్లాంట్ లో అంత అవినీతి --త్వరలోనే బిఆర్ఎస్ ప్రభుత్వం బండారం బయటపెడతాo -- నల్లగొండ మీడియా సమావేశంలో ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

వంద రోజుల్లోనే ఉచిత విద్యుత్

–మేనేజ్మెంట్ కోటా ఎమ్మెల్యే కరెంట్ బిల్లులు కట్టొద్దనడం అర్థరహితం
–కమిషన్ ల వల్లే యాదాద్రి పవర్ ప్లాంట్ లో అంత అవినీతి
–త్వరలోనే బిఆర్ఎస్ ప్రభుత్వం బండారం బయటపెడతాo
— నల్లగొండ మీడియా సమావేశంలో ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ప్రజా దీవెన/ నల్లగొండ: రాష్ట్రంలో రాబోయే వంద రోజుల్లో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయబోతున్నామని ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మేనేజ్మెంట్ కోట కింద ఎమ్మెల్యే అయిన ఒకాయన కరెంటు బిల్లులు కట్టవద్దని వ్యాఖ్యానించడం అర్ధహితమన్నారు.నల్లగొండ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

కమిషన్ల కక్కుర్తి వల్లే యాదాద్రి పవర్ ప్లాంట్ లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ధ్వజమెత్తారు. త్వరలోనే బి ఆర్ ఎస్ ప్రభుత్వం బండారం బయటపెడతామని పునరుద్ఘాటించారు. ధరణితో వేలాది ఎకరాల భూమిని లాక్కున్నారని దుయ్యబట్టారు.

కళ్యాణ లక్ష్మి కావాలంటే గతంలో ఎమ్మెల్యే సంతకం తప్పనిసరి కావాల్సి వచ్చేదని, నేడు ఎమ్మెల్యే సంతకం కూడా అవకాశం లేకుండా అధికారుల చేతుల్లోనే పెట్టేటట్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కోట్లాది రూపాయలు కాలేశ్వరం పేరు మీద కాంట్రాక్టర్ల పాలు చేశారని ఆరోపించారు.

ప్రజావాణిలో ప్రజల నుండి అందిన వినతులు అధికారులు సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు పరిష్కరించి దరఖాస్తుదారులకు రిప్లై పంపాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ప్రజల గుండె చప్పుడు వినే కార్యక్రమం ప్రజా వాణి కార్య క్రమం అని ఆయన తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికాంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ లో సామాన్యుల సమస్యలు వినేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు వినతులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఒక కోటి 50లక్షలు దరఖాస్తులు స్వీకరించి నట్లు ఆయన తెలిపారు.

ప్రజల సమస్యలు పరిష్కారం చూపే ప్రజావాణి లో కలెక్టర్ తో కలిసి పాల్గొనడం జరిగిందని, ఈ కార్యక్రమం ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారంటీ లు అమలు చేయటానికి కట్టుబడి వుందని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను గాడి లో పెడు తున్నట్లు,200 యూనిట్ ల ఉచితకరెంట్, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రూ. 500లకు గ్యాస్ సిలిండర్, పెన్షన్లు అమలు చేస్తామని తెలిపారు.

రూ. 20 కోట్లతో I TI వద్ద నిరుద్యోగ యువతకు శిక్షణ నందించెలా స్కిల్ డెవలపమెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు, ఈ నెల 26 న శంఖు స్థాపన వేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో సాగు నీటి పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తామని తెలిపారు.జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ కి కలెక్టరేట్ వద్ద 10 ఎకరాలు స్థలం లో లే అవుట్,రోడ్లు పూర్తి చేసి జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని అన్నారు.

ఏ.యం.అర్.పి.ప్రాజెక్ట్ 510 కోట్ల రూ.లతో లైనింగ్ పనులు చేప ట్టడం జరుగుతుందని,350 కోట్ల రూ. లతో డిస్ట్రి బ్యూటరి లు కూడా రిపేర్ లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్.ఎల్.బి.సి. కెనాల్ పనులు వ్యయం పెరిగినందున ప్రభుత్వ ఆమోదం తో పనులు చేపడతామని అన్నారు. ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఇంఛార్జి మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.