OpinionPoliticsSportsతెలంగాణనల్గొండ

komatireddyprateekreddyfoundation : ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలరించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

–నల్లగొండ కోలాహలంగా బిఎస్ఆ ర్ 11, జిఎంఆర్ 11 మ్యాచ్

–ఉత్కంఠ పోరులో జిఎంఆర్ 11 జట్టు విజయం

komatireddyprateekreddyfoundation : ప్రజా దీవె న, నల్లగొండ టౌన్: నల్ల గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌం డేషన్ ఆధ్వర్యంలో జ రుగుతున్న NPL-6 క్రికెట్ టోర్నమెంట్ కొన సాగుతోంది. ఉత్సా హ భరితంగా సాగుతున్న ఈ టోర్నమెంట్ లో భాగంగా బుధవారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి (GMR 11- BS R11)రెండు జట్ల మధ్య ఫ్రెండ్లీ క్రికె ట్ మ్యాచ్ నిర్వహిం చారు.

ఈ టోర్నమెంట్ ను తిలకించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, క్రీడాభి మానులు పెద్ద సంఖ్యలో NG కళాశాలకు తరలివచ్చారు. రెండు టీంల మధ్య టోర్నమెంట్ జరుగుతున్నంత సేపు ఈలలు, కేకలతో క్రీడాభిమానులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు.GMR11 కెప్టెన్ గుమ్ముల మోహన్ రెడ్డి, BSR11 కెప్టెన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు బ్యా టింగ్ వెళ్ళినప్పుడు, బౌ లింగ్ చేసినప్పుడు GMR, BSR అంటూ నినాదాలతో ఎన్జీ కళాశాల ప్రాంగణమంతా మార్మోగింది.

రెండు టీంల క్యాప్టెన్లు, క్రీడాకారులు అక్కడికి వచ్చిన వారినంత త మ ఆటతో ఎంతో ఉత్సాహపరిచా రు. ఉత్కంఠ భరితంగా ఈ మ్యా చ్లో GMR11 జట్టు BSR11 జట్టుపై ఆరు రన్స్ తేడాతో గెలుపొం దింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన GMR 11 టీం 10 ఓవర్లలో 97/2 రన్స్ చేయగా ఆ తర్వాత 98 రన్స్ టార్గె ట్ తో బ్యాటింగ్ చేసిన BSR11 టీం 91/2 రన్స్ చేసింది.అనంతరం గె లుపొందిన BSR 11 టీం, రన్నర్ గా నిలిచిన BSR 11 టీంకు నల్గొండ మార్కెట్ క మిటీ చైర్మన్ జూకూరి ర మేష్, మాజీ జెడ్పిటిసి వంగూరిలక్ష్మయ్య, డిసిసిబి డైరెక్టర్ పాశం సం పత్ రెడ్డిలు షీల్డ్, నగదు బహుమ తు లు అందజేశారు. స్పాన్సర్స్ అం దజేసిన నగదు బహుమతిని రెం డు టీంల కెప్టెన్లు NPL-6 ఆర్గనైజర్స్ కు అందజేశారు.

ఈ సందర్భంగా నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ లు మాట్లాడు తూ ప్రతి సంవత్సరం కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వ హించే NPL క్రికెట్ టోర్నమెంట్ కు విశేష స్పందన లభిస్తుందని తెలిపా రు. క్రీడాభిమానులలో మ రింత ఉత్సాహం నింపేందుకే BSR11 & GMR 11 టీంల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఉభయ టీంలలో ఆటగాళ్లు మంచిగా ఆడారన్నారు.

ఈ సందర్భంగా స్పాన్సర్స్ భాగ్య శ్రీను,సయ్యద్ సమద్, జూలకంటి శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్య క్ర మంలో ఆర్గనైజర్స్ ప్రదీప్ నాయక్, శ్యాంసుందర్, కేసాని వేణు గోపాల్ రెడ్డి, బోనగిరి ప్రభాకర్, ఆలకుంట్ల మోహన్ బాబు,మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, సయ్యద్ సమద్, ఇబ్రహీం, కరుణాకర్ రెడ్డి, బషీర్, బొజ్జ శంకర్, సమీ, పాల కూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button