Praja Deveena
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 4:14 pm Posted by : praja deveena

KTR fires on Revanth government : బిగ్ బ్రేకింగ్, రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్, రూ.200 కోట్ల భూ మి కేవలం రూ.7 కోట్లకే ఎలా ? 

KTR fires on Revanth government : ప్రజా దీవెన, హై దరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ బాంబ్ విసిరాడు. సీఎం సో దరుడి చుట్టూ భూకుంభకోణాల సెగ తగులుకుంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాం గ్రెస్ ప్రభుత్వం మరో భారీ భూ కుంభకోణానికి తెరలే పిందం టూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీఆర్ సంచలన ఆరోప ణలు చే శారు. తెలంగాణ భవన్‌లో ఏ ర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సొంత లబ్ధికోసం ప్రభుత్వ ఆస్తు లను కడిగిపారేసే రీతిలో నీరుగా రుస్తున్నా రంటూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు.

నకిలీ కంపెనీకి కోట్ల విలువైన భూమి

కేవలం రూ.7 కోట్లకే ఏకంగా రూ. 200 కోట్ల విలువైన విలు వైన భూమిని ‘టెసరాక్ట్’ (Tesseract) అనే నకిలీ (షెల్) కం పెనీకి క ట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఆ సదరు కంపె నీలో కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేరు. మార్చి 31, 2025న తమ కంపెనీలో ఉ ద్యోగులెవరూ లేరని ఆ సంస్థ స్వయంగా ప్రకటించుకోవడం గమ నార్హమన్నారు. కంపెనీ అధికారి కం గా ఇచ్చిన ఫోన్ నంబర్ 123 456789. “ఇలాంటి ఫోన్ నం బర్లు కూడా ఉంటాయని తమకు ఇప్పటివరకు తెలియదని కేటీ ఆ ర్ ఎద్దేవా చేశారు.

     సీఎం సోదరుడి ప్రమేయం

ఈ కంపెనీకి చైర్మన్‌గా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సోదరు డు కొండల్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, ఆవిషయాన్ని ఆయ నే స్వ యంగా తన లింక్డ్‌ఇన్ (Linke dIn) ప్రొఫైల్‌లో బహి రంగంగా పే ర్కొన్నారని ఆధారాలు బయటపె ట్టారన్నారు. ఈ వ్యవహారంతో సీ ఎం సోదరుడికి ఎలాంటి సంబంధం లే దని సమర్థించుకుంటున్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బా బు వైఖరిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అసలు మీ శాఖలో ఏం జరుగు తుందో మీకు తెలుసా శ్రీధర్ బా బు గారూ?.. స్వయంగా కొండల్ రెడ్డి తన ప్రొఫైల్‌లోనే చైర్మన్ అని పెట్టుకుంటే, మీకు సంబంధం లేదని ఎలా బుకా యిస్తారని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ అధికారం లోకి వ చ్చాక జరుగు తున్న ఈ దందాలపై సమగ్ర విచారణ జరి పించాలని, బాధ్యులపై కఠిన చ ర్యలు తీసుకోవాలని బీఆ ర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డిమాండ్ చేశారు.