
KTR Urges Cadre Defend Kaleshwaram Project : ప్రజా దీవెన, మహదే వ్‌పూర్ (కన్నెపల్లి): రాజకీయ కక్ష లు, పోలీసుల ఆంక్షలు, అడుగడుగునా సృష్టించిన అడ్డం కులు… వీటన్నింటినీ ఛేది స్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం కన్నెపల్లి పంప్ హౌస్‌కు చేరుకుంది. హైద రాబాద్ నుంచి కన్నెపల్లి రావడానికి సాధారణంగా 4 గంట లు పడితే పెంబర్తి, జనగామ, ఘన్‌పూర్, పరకాల, భూపాల పల్లి, కాటారం, మహదే వ్ పూర్ వద్ద పోలీసులు నిర్బంధా లు విధించడంతో ఈ ప్రయాణం ఒక పోరాటంగా మారింది. “ప్రభుత్వ పెద్దల ఆదేశాలంటూ మమ్మల్ని అడ్డుకున్నారు. కా నీ మేము రాజకీయ కక్షల కోసం రాలేదు, రైతుల కన్నీళ్లు తు డవడానికి వచ్చాం” అని కన్నెపల్లి మీడియా సమావేశంలో కేటీఆర్ ధ్వజమెత్తారు. ద శాబ్దాలుగా తెలంగాణ నీళ్లు, నిధు లు, నియామకాల కోసం కొట్లాడిందని కేటీఆర్ గుర్తుచేశారు. “తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులు పారుతున్నా, భూములు పైనుండి, నీళ్లు కింద ఉన్నాయి. కింద ఉన్న నీటి ని లిఫ్ట్ చేస్తేనే ఈ నేల పచ్చ బడుతుంది. ఈ భౌగోళిక సవా లును అధిగమించి, దిగువ నుండి ఎగువకు నీటిని మళ్లించి న అపరభగీరథుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
గతంలో తుమ్మిడిహట్టి వద్ద ప్రాజె క్టు కట్టాలని చూస్తే, ఎత్తు పెంచితే తమ ప్రాంతం మునుగుతుందని అప్పటి మహారా ష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అభ్యంతరం తెలిపారని, అలాగే ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కు మార్‌రెడ్డికి మహారాష్ట్ర కాంగ్రెస్ సీ ఎం పృథ్వీరాజ్ చౌహన్ లేఖ రాశా రని కేటీఆర్ గుర్తుచేశా రు. ఐదు ద శాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలే ని స్థితి ఉంటే, బీఆర్ ఎస్ ప్రభుత్వం కేవలం మూడున్న రేళ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రపంచం లోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రా జె క్ట్ అయిన కాళేశ్వరాన్ని నిర్మించిం దని స్పష్టం చేశారు. కాళేశ్వరం నిర్మాణ సమయం కేవలం 3.5 ఏళ్లు అని, ప్రాజె క్టు స్వరూపం 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంపు హౌస్‌లు, సబ్‌స్టేషన్లు కాగా 1531 కి.మీ. కాల్వలతో స్థిరీకరిం చిన ఆయకట్టు 40 లక్షల ఎకరాలుగా ఉందని వివరించారు.
పంజాబ్‌ను తలదన్ని వరి ధాన్యంలో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపిందని,”కాళేశ్వరం నిర్మాణా నికి రూ. 94 వేల కో ట్లు ఖర్చు అ యితే… లక్ష కోట్ల అవినీతి ఎలా జ రుగుతుం ది? సీఎం రేవంత్‌కు సోయి లేదు, మంత్రి ఉత్తమ్‌కు స్పృ హ లేదు” అంటూ కేటీఆర్ నిప్పు లు చెరిగారు. మేడిగడ్డ బ్యారే జీలో కేవలం రెండు పిల్లర్లు కుంగితే, ప్రజలపై పైసా భారం ప డకుండా ఉచితంగా మరమ్మతులు చేయడానికి ఎల్ అండ్ టీ సంస్థ ముందుకు వ చ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోలే ద ని ఆరోపించారు. కేవలం రూ. 4 00 కోట్లతో అయ్యే పనని, కానీ కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టును పడావు బెట్టి ‘కాళేశ్వరం కూ లేశ్వరం’ అంటూ పనికిమాలిన మాటలు మా ట్లాడుతున్నా రని మండిపడ్డారు.
ఈ చేతకానితనం వల్లే నేడు హైదరాబాద్‌లో తాగునీటి కొ రత ఏర్ప డి, వాటర్ ట్యాంకర్ల సంఖ్య 15 వే లకు పెరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో సుంకిశాల గోడ కూలి నా, వట్టెం పంపుహౌస్ కొట్టుకుపోయినా పట్టించుకోలేద ని, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది చనిపోతే కనీసం మృతదే హాలు కూడా తీయలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభు త్వం ఉందన్నారు.
కేసీఆర్‌కు వారంరోజులు అప్పగించి చూడు !
ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితుల వల్ల 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, కన్నెపల్లి వద్ద నీరున్నా మోటార్లు ఆన్ చేయడం లేద ని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “నీళ్లి స్తే రైతులకు యూరియా ఇ వ్వాలి, ఉచిత కరెంటు ఇవ్వాలి, పంట పండితే మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే భ యంతో నే కాంగ్రెస్ మోటార్లు ఆన్ చేయడం లేదు. రేవంత్ రెడ్డికి సవాల్ వి సురుతున్నా వారం రోజులు కాళే శ్వరాన్ని కేసీఆర్ కి అప్పగించు, తెలంగాణ అంతటా నీళ్లు పారించి చూపుతామని సవాల్ విసిరారు.
తక్షణమే స్పందించి కన్నెపల్లి పం పుల ద్వారా నీటిని ఎత్తి పోయక పోతే 50 వేల మందితో కన్నెపల్లి పంప్ హౌస్‌ను ముట్టడించి తామే స్వయంగా పంపులను ఆన్ చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.బీఆర్ఎస్ హయాంలో రైతుల కో సం రూ. 5 లక్షల కోట్లు ఖర్చు చేశామని, అందులో 24 గం టల కరెం టుకు, ప్రాజెక్టులకు, రైతుబంధు, రైతుబీమాలకు భారీగా నిధులు ఇ చ్చామని గుర్తుచేశారు. తరలివచ్చి న గులాబీ దళం ఈ పర్యటనలో కేటీఆర్ వెంట శాసనమం డ లి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగ దీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈ శ్వర్, ఎంపీ వద్దిరాజు ర విచంద్ర సహా ఎమ్మెల్యేలు పల్లా రా జేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, మాజీ ఎం పీలు వినోద్ కుమార్, కవి త మరియు పదుల సంఖ్యలో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొని కన్నెపల్లి ప ర్యటనను విజయవంతం చేశారు.







