Praja Deveena
Newspaper Banner
Date of Publish : 26 October 2025, 7:12 am Posted by : praja deveena

Loss of rice crop : బిగ్ బ్రేకింగ్, తుంగతుర్తిలో భారీవర్షాలకు నేలకొరిగిన వరిచేలు

 

Loss of rice crop : ప్రజా దీవెన, తుంగతుర్తి: ఒకపక్క భారీ వర్షాలు మరోపక్క ధాన్యం కొ నుగోలు సెంటర్లలో పేరుకుపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసే దిక్కులేక యావత్ రైతాంగం తీవ్రఆందోళ నలో మునిగి తేలుతున్నా రు. గత నెల రోజులుగా వరికోతలు ప్రా రంభించిన రైతన్న కోసిన వరి ధాన్యాన్ని ధా న్యం కొనుగోలు కేంద్రా ల్లో పోశారు. అదేసమయంలో కోయకుండా పొలాల్లోనే మిగిలిన వ రిచేలు భారీ వర్షాలకు అడ్డంపడి తీవ్రనష్టం వాటిల్లుతోంది.

జిల్లాలో అంతటా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రభు త్వం తుంగతుర్తి మండలంలో ఇప్ప టివరకు ధాన్యం కొనుగోలు ప్రా రంభించకపోవడం రైతులను ఆందోళ న గురిచేసే అంశoగా వ్యక్త మవుతోంది. తాము ధాన్యం పోసి సు మా రు పక్షం రోజులు దాటు తోందని ఇప్పటివరకు ధాన్యం కాంటాలు ప్రారంభం కాలేదని రైతులు అంటున్నా రు.

వరి ధాన్యం తేమ శాతం కోసం ఆర బోయడం సాయంత్రానికల్లా భారీ వర్షాలు రావడంతో ఆరబోసిన ధా న్యాన్ని కుప్పలుగా చేయ డం భారంగా మారిందని రైతులు అంటున్నా రు. ఏక్షణాన భారీ వ ర్షం వస్తుందో ఎ ప్పుడు ఎండ వస్తుందో తెలియని ప రిస్థితి నెలకొ న్నాయని ఇలాంటి పరి స్థితులు ఉన్న దృష్ట్యా అధికారులు తక్షణమే కాంటాలు ప్రారంభించాల ని రైతుల కోరుతున్నారు.

ఖరీఫ్ ఆరంభ కాలంలో వర్షాలు లేక ఇబ్బందులు పడ్డ రైతాంగానికి పం ట చేతికి వచ్చే సమయానికి వర్షా లు శాపంగా మారాయని రై తులు అంటున్నారు .ఇప్పటికే పత్తి చేను వర్షార్పణం కాగా వరి చే లు కూడా భారీ వర్షాలకు నేల వాలాయి. అడ్డంపడిన వరిచేలపై నుండి నీటి ప్రవాహం వెళ్లడంతో వరిచేలన్నీ నీట తడిసిన ముద్ద య్యాయి. దాదాపు నెల రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కు రుస్తుండడంతో అన్నదా తలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితు లు నెలకొన్నాయి.

కనీసం తడిసిన ధాన్యాన్ని ఆరబెట్ట డానికి కూడా వర్షాలు కురుస్తు న్నాయి. ప్రభుత్వం తక్షణమే వర్షాల వ ల్ల నష్టపోయిన పత్తి చేలకు వరిచేల కు నష్టపరిహారం అందించే దిశగా స్పందించాలని యావత్ రైతాంగం కోరుతోంది. గతంలో ప్రకృతి బీభత్సం ఏర్పడినప్పుడు అ ప్పటికి అ ప్పుడే పంట నష్టం అంచనా వేసి కనీసం రైతులకు ఎం తో కొంత ఆర్థిక సహాయం అందించే వారిని ప్రస్తు తం మాత్రం ఇప్ప టివరకు పంట నష్టం అంచనాగు అధికారులు ప్రయత్నించకపోవ డం విచారకరమని రైతులు అంటున్నారు.ఇప్పటికైనా ధాన్యం కొ నుగోలు సెంటర్లలో ధాన్యం తూకాలు ప్రారంభిం చాలని వర్షం వల్ల నష్టపోయిన రై తాంగానికి నష్టపరిహారం అందించే దిశగా అధికా రులు ముందుకు రావాలని రైతుల కోరుతున్నారు.