Love marriage : ప్రేమపెళ్లితో తోడై దారిదోపిడి లు
--దోపిడీలు చేస్తున్న భార్యాభర్తలు అరెస్టు --ఒంటరిగా కారులో లిఫ్ట్ ఇవ్వడమే అవకాశంగాని --నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి నిలువు దోపిడీనిం --నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ పోలీసులువి --మీడియా సమావేశంలో వెల్లడించిన డీఎస్పీ శివ రాంరెడ్డి
ప్రేమపెళ్లితో తోడై దారిదోపిడిలు
–దోపిడీలు చేస్తున్న భార్యాభర్తలు అరెస్టు
–ఒంటరిగా కారులో లిఫ్ట్ ఇవ్వడమే అవకాశంగాని
–నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి నిలువు దోపిడీనిం
–నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ పోలీసులువి
–మీడియా సమావేశంలో వెల్లడించిన డీఎస్పీ శివ రాంరెడ్డి
ప్రజాదీవెన/ నల్లగొండ బ్యూరో: వివాహేతర సంబంధం కొనసాగించి న అనంతరం, ప్రేమ పెళ్లిచేసుకుని చోరీలకు పాల్పడుతున్న భార్య భర్తలను నల్లగొండ (nalgonda) రూరల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి రూరల్ పో లీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిందితుల వివ రాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన చిమట గోపికృష్ణ వృత్తిరీత్య కారుడ్రైవర్ గా పని చేస్తున్నాడు.
తన మొదటి భార్యతో గొడవపెట్టుకుని ఒంటరిగా ఉం టున్నాడు. సత్తెనపల్లి పట్టణానికి చెందిన చింతల మహేశ్వరి భర్త చనిపోవడం తో తన పిల్లలతో జీవిస్తోంది. ఈ క్రమంలోనే మహేశ్వ రికి, గోపికృష్ణ కు ఏడాదిక్రితం పరిచయం ఏర్పడి తిరుపతిలో వివా హం చేసుకుని జీవిస్తున్నారు. మహేశ్వరి కూలిపనికి, గోపికృష్ణ కారు డ్రైవర్ గా చే స్తున్నా, వారికి వచ్చే ఆదాయం వారి వ్యక్తిగత జల్సాలకు సరిపోకపో వడంతో నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇద్దరు కలిసి ఒంటరిగా ప్రయాణించే వారిని కారులో ఎక్కించుకుని మార్గమధ్యలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, బంగారం నగదు దోచుకోవాలని పథకం వేశారు. అందులో భాగంగానే ఈ నెల 10న రాత్రి సత్తెనపల్లి మండలం బ్రూగుపడు గ్రామానికి చెందిన దుగ్గి కృష్ణ హైదరాబాద్ వెళ్లేందుకు పిడుగులరాళ్ల టౌన్ లో బస్సుకోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో గోపికృష్ణ, మహేశ్వరి ఇద్దరు కిరా యికి తెచ్చుకున్న కారులో దుగ్గి కృష్ణను ఎక్కించుకున్నారు.
నల్లగొండ అద్దంకి బై-పాస్ నుంచి కాకుండా నల్గొండ పట్ణణంలోని దేవరకొండ రోడ్ లో వెళుతూ కొత్తపల్లి గ్రామ శివారులో గల గంగమ్మ గుడి వద్ద కారు అపారు. వారి వద్ద కారులో అప్పటికే పెట్టుకుని ఉన్న రెండు కూరగాయలు కోసే కత్తులను చూపుతూ, భాధితుడిని భయ పెట్టి తన మెడలో ఉన్న బంగారం ఇవ్వకపోతే చంపుతామని భయ పెట్టారు. దీంతో చేసేదేంలేక తన మెడలో ఉన్న సుమారు 15గ్రాముల బంగారు చైన్ ను ఇచ్చాడు.
బాధితుడు కృష్ణను అక్కడే వదిలేసి నిందితులు ఇద్దరూ పారిపో యారు. బాధితుడు నేరుగా స్వగ్రామనాకి వెళ్లి, 12న ఉదయం రూర ల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మాడ్గులపల్లి టోల్ గేట్ వద్ద కారు నెంబరును తెలుసుకుని, దానిద్వారా నిందితుల వివరాలను తెలుసుకున్నారు.
13వ తేదీ సాయంత్రం మర్రిగూడ బై-పాస్ వద్ద వెహికిల్ చెకింగ్ చేస్తుండగా ఏపీ 05 DT-2123 నెంబర్ గల కారు కనిపించడంతో, అందులో ఉన్న మహిళ, డ్రైవరును అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు నిజాలు ఒప్పుకున్నారు. ఈ కేసును ఛేదించిన హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ తిరుమలేష్, ఇతర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
నిర్మానుష్య ప్రాంతాలు.. వెలుగులోకి రాని నేరాలు నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంతం, జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇ లాంటి ఘటనలు నిత్యం చోటుచేసుకుంటాన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువ కులు రాత్రి 9 అయ్యిందంటే చాలు బైకులపై వెళ్లే వారిని బెధిరిస్తూ భౌతికదాడులకు కూడా పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
జిల్లా కేంద్రాని కి శివారుల ప్రాంతాల్లో ఆకతాయిలనుంచి ఇలాంటి ఘటనలు ఎదు ర్కుంటున్నారని తెలుస్తోంది. మునుగోడు రోడ్డు, ముషంపల్లి రోడ్డు, దేవరకొండ రోడ్డు, మునుగోడు రోడ్డు నుంచి హైదరాబాద్ కు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన రోడ్డు, చందనపల్లి నుంచి వస్తుండగా పానగల్ మధ్యలో, పానగల్ నుంచి కట్టంగూరు మధ్యలో ఆకతాయిలు, నేరస్తుల నుంచి ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది. పోలీసులు నిఘా పెంచి, నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.