Praja Deveena
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 1:50 pm Posted by : praja deveena

lucknow massive fire accident : బిగ్ బ్రేకింగ్, లక్నోలో భారీఅగ్నిప్రమాదo, విషాద ఘటనలో 14మంది విద్యార్థులు మృత్యువాత

 

lucknow massive fire accident :  ప్రజా దీవెన, లక్నో: సాధారణ రోజులాగే మొదలైన ఆ ఉదయం.. కాసేపట్లోనే ఒక పెను విషాదానికి వేదికవుతుందని అక్కడున్న వారె వ్వ రూ ఊహించలేదు. లక్నోలోని పూర్ని యా ప్రాంతంలో ఉన్న ఒక కో చింగ్ సెంటర్‌లో ఒక్కసారిగా చెలరే గిన మంటలు, వి ద్యార్థుల బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేశాయి. క్షణా ల వ్యవధిలోనే రెండు అంతస్తుల భవ నాన్ని చుట్టేసిన మం టలు, అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు నరకాన్ని చూపించాయి.

     మృత్యుకుహరంగా భవనo

ప్రమాదం జరిగిన సమయంలో భ వనంలో 30 మందికి పై గా విద్యార్థులు ఉన్నారు. మంటలు వేగంగా వ్యాపించడం తో, ప్రాణభయంతో అల్లాడిపోయిన విద్యార్థులకు ఏం చే యాలో పాలుపోలేదు. దట్టమైన పొగ, సెగలు కమ్ముకోవడం తో ఊపిరాడక కొందరు.. ప్రాణాలు దక్కించుకోవడానికి వేరే దారి లేక భవ నం పైనుంచి కిందకు దూకేశారు. కాగా ప్రస్తు తానికి మృదుల సంఖ్య 14 గా అధికారులు నిర్ధారించారు.
ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాల పాలైన పలువురు విద్యార్థు లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ప్రమాద తీవ్రతకు రెండు అంతస్తు ల భవనం పూర్తిగాకాలి బూడిదైంది. క్షతగా త్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇం కా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ ప్రమాదం కేవలం ఒక ‘యాక్సి డెంట్’ మాత్రమేనా? లేక భద్రతా ప్రమాణాలను విస్మరించడం వల్ల జరిగిన ముమ్మాటి కీ ‘మానవ తప్పిదమా’? ఇలాంటి ఇరుకైన భవనాల్లో నడు స్తున్న కోచింగ్ సెంటర్లలో సరైన ఎమర్జెన్సీ ఎగ్జిట్ (అత్యవ స ర ద్వారాలు) ఎందుకు ఉండటం లేదు, ఫైర్ సేఫ్టీ నిబంధన లను తనిఖీ చేయాల్సిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వ హిస్తున్నారు? ఈ ఘోర కలికి బాధ్యులెవరు అనేది విచార ణలో తేలాల్సి ఉంది. కా నీ, ఇలాంటి ఘటనలు పునరావృ తం కాకుండా ఉండాలంటే.. ఇప్ప టికైనా విద్యాసంస్థల్లో భద్రతా ప్ర మాణాలపై కఠినమైన నిబంధనలు అమలు చే యాల్సిన అవసరం ఎం తైనా ఉంది. లేదంటే, రేపటి తరం భవిష్యత్తు ఇలాంటి మంటల్లో కాలిపోతూనే ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.