Praja Deveena
Newspaper Banner
Date of Publish : 03 October 2025, 3:09 am Posted by : praja deveena

madhyapradeshBreakingnews : బిగ్ బ్రేకింగ్, దుర్గామాత నిమజ్జనంలో అపశృతి, చెరువులోమునిగి పదిమంది జలసమాధి

 

madhyapradeshBreakingnews :  ప్రజా దీవెన, మధ్య ప్రదేశ్: దసరా పండుగ ఆ కుటుంబాల్లో తీవ్ర విషా దాన్ని నింపింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘోర దుర్ఘటనలో పదిమంది జలస మాధి అయ్యారు.మధ్య ప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో మధ్యాహ్నం దుర్గామాత విగ్రాహాన్ని నిమజ్జన కార్యక్రమం వారి జీవితాలను ఒక్క సారిగా చిదిమేసింది. దుర్గామాతను ( durgamatha)  భక్తి శ్రద్ధ లతో పూజించి నిమజ్జనం చేయాలని ముందుకు క దిలిన వారి పట్ల విధి వక్రీక రిం చి కళ్ళ ముందే జలసమాధి కావడం తీవ్ర విషా దా న్ని నింపింది. దు ర్గామాతను నిమజ్జనం చేసేందుకు బయలు దేరి న ట్రాక్టర్‌ బోల్తా కొట్టడంతో పదిమంది భక్తులు మృత్యువాత పడ్డా రు.

సదరు దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి…మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా (khandwa)  జిల్లాలోని పంధానాలోని అర్దాలా గ్రామం లో ప్రతి ఏటా విజ యదశమి ఘనంగా నిర్వహించడం ఆనవాయి తీ. అయితే మొత్తా నికి నవరాత్రులు పూజలందుకున్న అమ్మవారి ని నిమజ్జనం చేసేందుకు ట్రాక్టర్‌పై యాత్ర ముందుకు కదిలింది. ఈ క్రమంలోనే ఆకస్మాత్తుగా విగ్రహాన్ని తీసుకెళ్లిన ట్రాక్టర్‌ అదుపుత ప్పి చెరువులో పడి పోయింది. దీంతో ట్రాక్టర్‌లో ఉన్న దుర్గమ్మ భక్తులు నీటిలో మునిగి పోయారు.

బాధితులు కేకలు వేయడంతో ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే జేసీబీల ( JCB) సహాయంతో వా రిని రక్షించేందుకు ప్రయ త్నించారు. ట్రాక్టర్‌తో పాటు 11 మందిని బయ టకు తీయగా మరో 10 మంది నీట మునిగి చనిపోయినట్టు స్థానిక అధికారులు వెల్ల డించారు. ప్రజలు అందించిన సమాచారం మేరకు పోలీసులు వెం టనే ఘటనా స్థలా నికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొ ని విచారణ ప్రారంభించారు. గల్లంతైన మరికొందరి కోసం నదిలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగించారు.

ఘటనపై స్థానిక పోలీసులు మాట్లాడుతూ ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 20-25 మంది భక్తులు ఉన్న ట్టు, వారిలో 11 మందిని రక్షించిగా మరో 10 మంది మరణించారని మిగతావారి ఆచూకీ కోసం గాలింపు చ ర్యలు చేపట్టిన్నట్టు తెలిపారు. అయితే మృతు ల్లో ఎక్కువశాతం యువకులే ఉండడం గమనార్హం.

నిమజ్జనంలో అపశృతి ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహ న్ యాదవ్ ( cm MohanYadav) స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. మృతుల కు టుంబాల కు ప్రగాఢ సానుభూతి తెలి యజేశారు. మృతుల కుటుం బాలకు ప్రతి ఒక్కరికి రూ. 4 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.