Medigadda: మేడిగడ్డ రక్షణ పనులు ప్రారంభం
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో బరాజ్ వద్ద చేప ట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఎల్ అండ్ టీ పనులను ప్రారంభిం చింది.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు చర్యలు
ప్రజా దీవెన, మేడిగడ్డ: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు మేడిగడ్డ ప్రాజెక్టు(Medigadda protection ) రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో బరాజ్ వద్ద చేప ట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఎల్ అండ్ టీ పనులను ప్రారంభిం చింది. వరద ప్రవాహాలకు అడ్డం కులు లేకుండా చూడాలని, గేట్లను తెరిచి ఉంచాలని, ప్రవాహానికి ఆటంకం కలిగించే ఇసుకమేటలు, రాళ్లను తొలగించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచిం చింది.
డ్యామ్ సేఫ్టీ అథారిటీ(Dam Safety Authority) సూచనల మేరకు వెంటనే పనుల ను చేపట్టాలని ఎల్అండ్ టీ సంస్థ కు ఇరిగేషన్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మేడిగడ్డ(Medigadda ) బ్లాక్-7లోని 8 గేట్లను ఎత్తివేసేందు కు పనులు ప్రారంభమయ్యాయి. 8 గేట్లలో ఒక గేటును ఇప్పటికే ఎత్తి పెట్టారు. 2 గేట్లు మినహా మిగిలిన గేట్లను సాంకేతిక ఇబ్బందులు లే కుండానే ఎత్తే అవకాశం ఉందని ఎల్అండ్‌టీ అధికారులు తెలిపారు. పగుళ్లు ఏర్పడిన 20వ పిల్లర్, దాని పక్కన ఉన్న పిల్లర్ గేట్లను ఎత్తడం లోనే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంద ని అభిప్రాయపడుతున్నారు.
Madigadda barrage protection work started