Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahardhasa to Nalgonda: నల్లగొండకు మహర్ధశ

--మౌలిక వసతుల పనులకు రూ. 87కోట్ల నిధులు మంజూరు --48వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీల, వాటర్ వర్క్స్ కోసం కేటాయింపు

నల్లగొండకు మహర్ధశ

–మౌలిక వసతుల పనులకు రూ. 87కోట్ల నిధులు మంజూరు
–48వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీల, వాటర్ వర్క్స్ కోసం కేటాయింపు

ప్రజా దీవెన/నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రమైన నల్లగొండ మున్సిపాలిటీ మహార్దశ దక్కింది. నల్లగొండ పట్టణంలోని వివిధ అభివృద్ధి పనుల కోసం GO NO 747 ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ రూ. 87 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అడిగిన వెంటనే అభివృద్ధి నిధులను మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న నలగొండ నియోజకవర్గం పై అభిమానం చాటుకున్నారని అందుకు స్థానిక శాసనసభ్యునిగా కృతజ్ఞుడనై ఉంటానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా నిధుల విడుదలకు తోడ్పాటు అందించిన పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

నల్లగొండ పట్టణంలోని 48వార్డులలో వివిధ అభివృద్ధి పనులకు సీసీ రోడ్లు, మురికి కాలువలు, పార్కు ల అభివృద్ధితో పాటు వాటర్ వర్క్స్ తదితర పనులకు కోసం రూ. 55 కోట్లు, డీఈఓ ఆఫీస్ నుండి కేశరాజుపల్లి వరకు సెంట్రల్ లైటింగ్ తో పాటు చెట్ల పెంపకం కోసం అదనంగా రూ. 18 కోట్ల రూపాయలు, వివేకానంద విగ్రహం నుండి పెద్ద బండ వరకు మధ్య తరహా సెంట్రల్ లైటింగ్, ఫుట్ పాత్ ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం కోసం అదనంగా రూ. 14 కోట్లు మొత్తంగా రూ. 87 కోట్ల అభివృద్ధి నిధుల కోసం ప్రభుత్వం ఇతరులు జారీ చేయడం శుభ పరిణామం అన్నారు.

నల్లగొండ అభివృద్ధికి అడిగిందే తడువుగా వందలాది కోట్ల నిధులు కేటాయిస్తూ నల్లగొండను నందనవనంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. టిఆర్ఎస్ లో చేరిన వెంటనే తనకు నల్లగొండ టికెట్ కేటాయించి గెలిపించడమే కాకుండా నల్లగొండ సమగ్రాభివృద్ధిలో భాగస్వామిని చేసినందుకు కెసిఆర్ కు సర్వదా కృతజ్ఞుడనై ఉంటానని ప్రకటించారు.