Mahashivratri: ప్రజా దీవెన, దేవరకొండ: శివనామ స్మర ణంతో భక్తులు తరించేందుకు శివరాత్రి పర్వదినం రానే వ చ్చింది. దేశవ్యాప్తంగా శివరాత్రి సందర్భం గా సర్వత్రా శివాల యాలు ముస్తాబుకావడం ఆనవాయితీ ఆచారంగా వస్తోన్న క్రమంలో ఆదివారం శివరాత్రి పర్వదినం ఘనంగా నిర్వ హిం చేందుకు సకల ఏర్పాట్లకు సంబంధించి సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాం తాల్లోని కొంగుబంగారంగా నిలుస్తోన్న నల్లగొండ జిల్లా చం దంపేట మండలం లో కొలువుదీరిన మునిస్వామి శి వాల యం ప్రత్యేక ఆకర్షణగా నిలు స్తోంది. నల్లమల అటవీ ప్రాం తంలో నల్లగొండ జిల్లా చందంపేట మండలం దేవరచర్ల స మీపంలోని ప్రకృతి అందాల నడుమ ఎత్తైనగుట్టపై కొ లువు దీరిన మునిస్వామి శివాల యం భక్తులను విశేషంగా ఆక ట్టుకుంటుంది. క్రీస్తుశకం 13వ శతా బ్దంలో రేచర్ల వంశ పద్మ నాయక రాజు ఈ ఆలయాన్ని అటవీ ప్రాంతంలో నిర్మించా రని చరిత్ర పుటల్లో ఆ నవాళ్ళు తెలియబరుస్తున్నాయి.
దక్షిణ కాశీగా పేరొందిన ఈ శివాల యంలో పూజలు నిర్వ హి. స్తే కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. కాశీకి పోలేని వారు ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహిస్తే కా శీ శివాలయంలో పూజలు చేసినట్లే నని భక్తులు భావిస్తారు. అందుకే ఈ ఆలయo దక్షిణ కాశీగా పేరు గాంచిందని నా నుడి. క్రీస్తుశకం 13 వ శతాబ్దంలో రేచర్ల పద్మనాయ కుల స్వాహాసస్తాలతో నిర్మితమైన నల్లమల్ల అభయారణ్యంలో సహా య సిద్ధమైన ప్రకృతి అందాలతో పార్వతీపరమేశ్వ రు ల దర్శనానికి 15 ఆదివారం మాహాశివరాత్రి పర్వదిన వేడు కలకు మండలంలోని యలమలమంద గ్రామ పంచాయ తీ దేవరచర్ల తండాలో శ్రీ ముని శివలయం ముస్తాబయ్యింది.
వేడుకల ఏర్పాట్ల కోసం శ్రీ ముని దేవుని హేమా సౌకార్ చా రిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేతవత్ హేమ్లాల్ నా యక్, వైస్ చైర్మ న్ లక్ష్మన్ నాయక్, సభ్యులు ప్రతాప్ సింగ్, భాధర్ సిం గ్ బావోజి లక్ష్మణ్ నాయక్, దగ్గరుం డి పర్యవేక్షించారు ఈ కా ర్యక్రమం లో భక్తులకు అన్ని సౌకర్యాలు త్రాగు నీళ్లు అన్న దాన కార్యక్రమాలు విధిగా నిర్వహించబడునని మాహా శివ రాత్రి పర్వదినాన భక్తులు భా రీ గా తరలిరానున్నారని తెలి యజేశారు.
తొలి ఏకాదశి పర్వదినాన్ని పు ర స్కరించుకొని మండలం నుంచే కా కుండా ఇతర ప్రాంతాల నుంచి స్వా మివారి దర్శ నానికి భక్తులు భారీగా హాజరుకానున్న నైపథ్యంలో ఏలాం టి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ట్రస్టు సభ్యులు తెలిపా రు. ఆలయానికి వచ్చే భక్తులకు పూజా సామాగ్రి గుట్టపై శివాల యంలో లభిస్తుందని చెప్పారు.ఉదయం 6 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకు పూజ కార్యక్ర మాలు ఉంటాయని వివరించారు.

ప్రస్తుతం ఎత్తైన గుట్ట పైకి సగం దూరం వరకు వాహనాలు వెల్లగలుగుతున్నాయని, దాదాపు మూ డు కిలోమీటర్ల మేర ఎత్తైన గుట్ట ను ఎక్కితేనే ఆలయదర్శన భాగ్యం కలుగు తుందని చెబుతున్నారు.చుట్టూ ఎత్తైన గుట్టలు, పచ్చని చె ట్ల మధ్య సాగే ప్రయాణం భక్తుల ను విశేషంగా ఆకట్టుకుం టుందని, ఆలయం పక్కనే ఎత్తయిన గుట్టపై నుంచి కిందికి దూకే జలపాతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటా య ని విస్తారంగా వర్షాలు కురిసిన ప్పుడు కొన్ని నెలల పాటు ఈ జల పాతం నుంచి నీళ్లు కిందికి దూకు తూ విశేషంగా ఆకట్టుకున్నాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ సందర్శనకు వచ్చి న భక్తులు తప్పకుండా ఈ వాటర్ ఫాల్స్ కింద స్నానం చే యడం అనవాయితీగా వస్తోందని, ఎత్తైన గుట్టల మీదుగా వివిధ చెట్ల వేర్లను తాకు తూ కిందికి దూకే ఈ నీటిలో స్నా నం చేస్తే ఆ దేవుడి మహిమతో స ర్వ రోగాలు పోతాయని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
