Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahububabad incident: ఘోర రోడ్డుప్రమాదం

--ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం --మృత్యువుతో పోరాడుతోన్న మరో ముగ్గురు --మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న దుర్ఘటన

ఘోర రోడ్డుప్రమాదం

–ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
–మృత్యువుతో పోరాడుతోన్న మరో ముగ్గురు
–మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న దుర్ఘటన

ప్రజా దీవెన/ మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. దైవదర్శనానికి వెళ్ళిన ఓ కుటుం బం తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్క డికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు మృత్యువుతో పోరాడుతున్నారు.

ఆటోను ఢీకొట్టిన కారులోని ప్రయాణికులు కూడా తీవ్ర గాయాలతో  ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి శివారులో ఈ దుర్ఘటన జరిగింది. కారు, ఆటో ఎదురెదు రుగా ఢీ కొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

మృతదేహాలను మార్చురీకి, క్షతగాత్రులను మహబూబాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ప్రాంగణమంతా కుటుంబ సభ్యుల రోధనలతో మిన్నంటి పోయాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన నలుగురు ఓకే కుటుంబానికి చెందిన వారు కాగా వారిలో తల్లి, కొడుకు, మనుమడు, మనవరాలు ఉన్నారు. వీరంతా గూడూ రు మండలం చిన్నఎల్లాపూర్ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.

మృతులు ఇస్లావత్ శ్రీను, అతని తల్లి, పాప అతని కొడుకు బాలు డు రిత్విక్, కూతురు రిత్వికగా గుర్తించారు. నాగార్జున సాగర్ సమీ పంలోని బుడియా బాపు దేవుడిని సందర్శించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

గుంజేడులోని ముస లమ్మ దేవతను సందర్శించు కుని మహబూబా బాద్‎కు వస్తున్న కారు వీరంతా ప్రయాణిస్తున్న ఆటోను ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. సమయానికి కారులోని ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవడంతో కారులో ఉన్నవారు గాయాలతో  బయటపడ్డారు. ఈ మేర కు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.