Male contraceptive injection: గర్భనిరోధానికి పురుషునికి సూది మందు
-- క్లినికల్ ట్రయల్స్‌లో సక్సెస్ అయిందన్న ఐసీఎంఆర్ --ప్రపంచంలోనే తొలిసారిగా పురుషుల సంతాన నిరోధక ఇంజెక్షన్
గర్భనిరోధానికి పురుషునికి సూది మందు
— క్లినికల్ ట్రయల్స్‌లో సక్సెస్ అయిందన్న ఐసీఎంఆర్
—ప్రపంచంలోనే తొలిసారిగా పురుషుల సంతాన నిరోధక ఇంజెక్షన్
ప్రజా దీవెన/న్యూ ఢిల్లీ: ప్రపంచంలోనే ప్రప్రదమంగా పురుషునిలో సంతాన నిరోధక సూది మందు ను ఆవిష్కరించారు. ఈ మేరకు ప్రపంచంలోనే తొలిసారిగా పురుషుల కోసం తయారుచేసిన సంతాన నిరోధక ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్‌లో మెరుగైన పనితీరు (World’s first male contraceptive injection shows better performance in clinical trials) కనబరిచినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకటించింది. ప్రపంచంలోనే తొలిసారి పురుషుల కోసం ఈ కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్‌ను డెవలప్ చేసినట్లు తెలిపింది.
దీనితో ఎలాంటి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ లేవని వెల్లడించింది. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ లో 25 నుంచి 40 ఏండ్ల మధ్య ఉన్న 303 మందిపై ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించామని పేర్కొంది. ఈ స్టడీ వివరాలను అంతర్జాతీయ ఆండ్రాలజీ జర్నల్‌లో ఇటీవల ప్రచురించినట్లు (Details of this study were recently published in the International Journal of Andrology) ఐసీఎంఆర్ తెలిపింది.
సాధారణంగా మహిళలు గర్భం దాల్చకుండా ఉండేందుకు పురుషులు వాసెక్టమీ చేయించుకోవడం లేదా కండోమ్స్ వాడటం వంటివి పాటిస్తుంటారు. అయితే పురుషులకు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా స్త్రీలు గర్భం దాల్చకుండా ఉండేలా ఐసీఎంఆర్ ఈ ఇంజెక్షన్ ( ICMR says this injection is meant to prevent women from getting pregnant by giving the injection to men) ను తయారు చేసింది.
రివర్సిబుల్ ఇన్‌హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్ అనే ఈ ఇంజెక్షన్‌ను పురుషులకు 60 మిల్లీగ్రాముల మేరకు ఇస్తే వీర్యంలో శుక్రకణాలు 97.3% వరకూ తగ్గిపోతాయని (If the injection is given to men at the rate of 60 milligrams, the number of sperm in the semen will decrease by 97.3%), దీంతో స్త్రీలు ఆ పురుషుల ద్వారా గర్భం దాల్చే అవకాశం 99.02 శాతం తగ్గిపోతుందని ఐసీఎంఆర్ సైంటిస్టులు పేర్కొన్నారు.
ప్రస్తుతం పురుషులు, స్త్రీలు వినియోగిస్తున్న గర్భనిరోధక పద్ధతుల కంటే ఈ విధానం చాలా సురక్షితమైందని పేర్కొoటున్నారు.