Manollu made up his mind: మనోళ్లు మనస్సు పెట్టారు
-- వంద పతకాలు పట్టుకొస్తున్నారు -- ఆసియా క్రీడల్లో భారత్ ప్రతిభ అమోగం
మనోళ్లు మనస్సు పెట్టారు
— వంద పతకాలు పట్టుకొస్తున్నారు
— ఆసియా క్రీడల్లో భారత్ ప్రతిభ అమోగం
ప్రజా దీవెన /చైనా: భారత క్రీడాకారులు మనస్సు పెట్టారు. ఏమిటని అనుకుంటున్నారా అదేనండి వంద అంటే వంద పతకాలు సాధించాలన్న సంకల్పం సక్సెస్ (100 means determination to win 100 medals is success) అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాకపోతే భారత అథ్లెట్లకు పతకం సాధించేందుకు ఈరోజే చివరి అవకాశం.
100 పతకాలను సాధించాలన్న నినాదంతో ఆసియా క్రీడలకు వెళ్లిన భారత అథ్లెట్లు ఈసారి తమ కలను నిజం చేశారoటే సామాన్యమైన విషయం కాదు. తాజాగా 13వ రోజు భారత్ మొత్తం 95 పతకాలు సాధించగా, మరో 6 పతకాలు కూడా ఖాయమయ్యాయి (India won a total of 95 medals and 6 more medals were also secured). ఈ స్థితిలో భారత్ 100 పతకాల సంఖ్యను అధిగమించిందని గంటాపదంగా చెప్పవచ్చు.
జ్యోతి సురేఖ ఆర్చరీలో 149-145 తేడాతో కొరియాకు చెందిన చెవాన్‌సోను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. 2023 ఆసియా క్రీడల్లో జ్యోతి సురేఖకు ఇది మూడో బంగారు పతకం. జ్యోతి సురేఖ స్వర్ణ పతకంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 97కి చేరుకుంది. భారత్‌కు ఇది 23వ బంగారు పతకం ( India’s total number of medals reached 97, This is India’s 23rd gold medal) కావడం విశేషం.
పురుషుల క్రికెట్ ఈవెంట్‌లో భారత్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుండగా మహిళల జట్టులాగే స్వర్ణ పతకం సాధించే గొప్ప అవకాశం టీమ్ ఇండియాకు ఉంది. ఆయితే ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లను సెమీఫైనల్‌లో భారత్ ఓడించింది.
అదితి స్వామి ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో ఇండోనేషియాకు చెందిన రాతిహ్ జిలిజాతిపై చివరి 5 తర్వాత 146-140 స్కోరుతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం తర్వాత హాంగ్‌జౌలో అదితికి ఇది రెండో పతకం. భారత్‌కు ఈ క్రీడలో ఓవరాల్‌గా ఆరో పతకం. ప్రస్తుతం భారత్ మొత్తం 96 పతకాలతో జోరు కొనసాగిస్తుంది.