Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Medak family : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

--మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

–మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు

ప్రజా దీవెన/మెదక్: మనోహరాబాద్ లో గుర్తులేని వాహనం ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. స్కూటీపై ప్రయాణం చేస్తున్న తల్లి కూతురు కుమారుడు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలకల్ వద్ద చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురు ఒకేసారి చనిపోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. స్కూటీపై తల్లి కూతురు కుమారుడు మేడ్చల్ నుంచి తూప్రాన్ వైపు వెళ్తున్న క్రమంలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు మనోహరాబాద్ పోలీసులు తెలిపారు. స్కూటీ ఢీ కొట్టిన వాహనాన్ని గుర్తించేందుకు ఇప్పటికే రంగంలోకి దిగినట్టు చెప్పారు.