Mepma problems: మెప్మా ఆర్పీల సమస్యల పరిష్కారానికి కృషి, ఎమ్మెల్యే
కోదాడ పురపాలక సంఘంలో పనిచేస్తున్న మెప్మా ఆర్పీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి అన్నారు.
ఐ .ఎన్. టి .యు. సి లో చేరిన మెప్మా ఆర్పీలు…
ప్రజా దీవెన, కోదాడ: కోదాడ పురపాలక సంఘంలో పనిచేస్తున్న మెప్మా ఆర్పీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి(Kodad MLA Padmavathi Reddy ) అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐ ఎన్ టి యు సి లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి (MLA Padmavathi Reddy )మాట్లాడుతూ మెప్మా ఆర్పీల సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ఐ ఎన్ టి యు సిసంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ పార సీతయ్య,వార్డు కౌన్సిలర్ గంధం యాదగిరి, స్వామి నాయక్ ,సైదా నాయక్ ,సంఘ అధ్యక్షురాలు షేక్ పర్వీన్, ఉపాధ్యక్షురాలు పొక్కుల నాగమణి ,కార్యదర్శి ఎగ్గడి మాధవి ,సహాయ కార్యదర్శి షేక్ హసీన నూరి,కోశాధికారి తేజవత్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
Mepma problems solved