Praja Deveena
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 4:04 am Posted by : praja deveena

Metpally wonder delivery : బిగ్ బ్రేకింగ్, మెట్‌పల్లిలో అపురూపం, ఒకేకాన్పులో ముగ్గురికి జన్మనిచ్చిన రాజలక్ష్మి

 

Metpally wonder delivery :  ప్రజా దీవెన, మెట్‌పల్లి: ఒ కేసారి ముగ్గురు చిన్నారి దేవతలు ఇం ట అడుగుపెడితే ఆ ఇల్లు ఇచ్చే ఆనందమే వేరు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మం డలం రాజేశ్వర్ రా వుపేట గ్రామంలో సరిగ్గా అలాంటి అ ద్భుతమే జరిగింది. ఊహిం చని ఈ వార్తతో ఆ కుటుంబం లోనే కాదు, గ్రామంలోనూ పండుగ వాతావరణం నెలకొంది. ఆస్పత్రి లో హడావుడి… ఆపై ముగిసిన ఉత్కంఠ. రాజేశ్వర్ రావుపేటకు చెందిన జంగిటి రాజలక్ష్మి – నరేందర్ దంపతు లు సోమవారం ఉదయం కాన్పు కోసం మెట్‌పల్లి పట్ట ణం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. వైద్యుల బృందం పర్య వేక్షణలో ప్రసవం ప్రారంభమైంది. అయితే, అందరినీ ఆశ్చ ర్యపరుస్తూ రాజలక్ష్మి ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మ నిచ్చారు.

   చిరునవ్వుల ముగ్గురు మొగ్గలు

పుట్టిన వారిలో ఒకరు మగబిడ్డ కాగా, ఇద్దరు ఆడపిల్లలు. మగబి డ్డ బరువు: 1.8 కేజీలు, ఇద్దరు ఆడపిల్లల బరువు: ఒక్కొక్కరు 1.5 కేజీలు కాగా పిల్లల బరువు కొద్దిగా తక్కువ గా ఉన్నప్పటికీ, తల్లితో పాటు ముగ్గురు బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో సురక్షితం గా ఉన్నారని వైద్యులు వెల్లడిం చా రు.

“ఒకేసారి ముగ్గురు బిడ్డలు మా ఇంట్లో జన్మించడం దేవుడు ఇచ్చి న గొప్ప వరంగా భావిస్తున్నామని ఆనంద బాష్పాల తో కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ప్రస్తు తం తల్లి, ముగ్గురు బిడ్డలు ఆస్ప త్రి వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఒకే కాన్పు లో ముగ్గురు పుట్టారన్న వా ర్త తెలియడంతో రాజేశ్వర్ రావుపేట గ్రామస్తులు ఆ దంప తులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.