Mahalakshmi free bus scheme: మహాలక్ష్మితో మెట్రోకు మసక
ప్రజల కోస మైనా పరిమితికి మించి ఉచితాలు అనుచితం కాదని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. ఉచిత బస్సు ప్రయాణo పథకాన్ని అమలు చేసేవారు మెట్రో వ్యవస్థ గురించి మర్చిపోయారా అని ప్రశ్నించారు
ఉచిత బస్సు (free bus )ప్రయాణం పథకంతో మెట్రో సగానికి సగం ఖాళీ
మహిళల కోసం పెట్టిందైనా ట్రాఫిక్ కు, పర్యావరణానికీ ముప్పు
ఎన్నికల కోసం ఖజానాను ఖాళీ చేసే హక్కు ఎవరికీ ఉండబోదు
రంజాన్ మాసంలో యుద్ధం ఆపా లని ఇజ్రాయెల్‌కు విన్నవించినా
సంధర్బంగా తప్ప ముస్లింల అం శంలో విమర్శలొస్తున్నాయని ఇ లాంటివి చెప్పు కోవాల్సిన అవసరం లేదు
కాంగ్రెస్, ఎస్పీ లకు అవకాశమిస్తే అయోధ్య రామాలయంపైకి బుల్డో జరే
ఉత్తర ప్రదేశ్, హిమాచల్, మహారా ష్ట్ర ప్రచార సభల్లో ప్రధాని మోదీ
ప్రజా దీవెన,న్యూఢిల్లీ: ప్రజల కోస మైనా పరిమితికి మించి ఉచితాలు అనుచితం కాదని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. ఉచిత బస్సు ప్రయాణo పథకాన్ని అమలు చేసేవారు మెట్రో వ్యవస్థ గురించి మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మెట్రోను ఖాళీ చేశారని, మరిప్పు డు మెట్రో ఎలా నడుస్తుంది, దేశం ఎలా ముందుకు సాగుతుందoటూ ప్రధాని మోదీ కర్ణాటక, తెలంగాణ లో అమలవుతున్న ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకంపై పరోక్ష విమర్శలు గుప్పించారు. మహిళల కోసం ప్రవేశపెట్టినా ఈ పథకం వల్ల ట్రాఫిక్‌కు, పర్యావరణా నికీ తీవ్ర ఇబ్బందులు కలుగుతాయ ని వ్యాఖ్యానించారు. తోచిన ఉచిత పథకాల అమలుకు ఎన్నికల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసే హక్కు ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు.
రేవంత్ సర్కారు మహాలక్ష్మి(Mahalakshmi )పేరిట ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల హైదరా బాద్ మెట్రోకు(metro) నష్టాలు వస్తున్నం దున 2026 తర్వాత మెట్రోను విక్ర యించే యోచన ఉందని ఎల్ అండ్ టీ ప్రెసిడెంట్ శంకర్ రామన్ ఇటీవ ల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయం విధితమే. ‘ఇండియా టుడే’ ప్రతినిధి ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించగా ఒక నగరం లో మెట్రో రైళ్లు అందుబాటులోకి తెస్తారు. అంతలోనే ఎన్నికల్లో గెల వడం కోసం మహిళలకు ఉచిత బస్సు పథకం హామీ ఇస్తారoటే మెట్రో ప్రయాణికుల్లో సగానికి సగం 50 శాతాన్ని తగ్గించేసినట్టేనని మోదీ విచారం వ్యక్తం చేశారు. మోడీ తన ప్రసంగంలో మెట్రో(metro) అంశంతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం వ్యతిరేనoటూ విపక్షాలు తనపై చేస్తున్న వ్యాఖ్యలకు దీటైన సమా ధానం ఇచ్చారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం లో గాజాపై వైమానిక దాడులు ఆపాలని కోరుతూ తాను ఇజ్రాయె ల్‌కు రాయబారిని పంపానని మోదీ చెప్పారు. తన మాటను మన్నించి న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు యుద్ధాన్ని తాత్కాలి కంగా ఆపేందుకు ఎంతో ప్రయత్నిం చారని గుర్తు చేశారు. కానీ, చివరికి రెండు, మూడు రోజులు యుద్ధం జరిగిందని తెలిపారు.
ముస్లింల అంశంలో ప్రజలు తనపై విమర్శలు చేస్తున్నప్పటికీ ఇలాంటి విషయాలు ప్రచారం చేసుకోవడం తనకు నచ్చ దని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పేర్కొన్నారు. బాంబు దాడులు ఆపాలని తనతో పాటు ఇతర దేశాల నేతలు కూడా ఇజ్రాయెల్‌ను కోరారని, వారి ప్రయ త్నాలు ఫలించి ఉంటాయని చెప్పా రు. ఇక, ఇజ్రాయెల్‌కు వెళితే పాల స్తీనాకు కూడా వెళ్లాల్సిందే అనే సంప్రదాయాన్ని పక్కనపెట్టి ఆయా దేశాల్లో తాను వేర్వేరుగా పర్యటిం చానని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వాల పాలకులు ఇజ్రాయెల్‌కు వెళితే మొక్కుబడిగా పాలస్తీనాకు వెళ్లేవారని తెలిపారు. ‘‘ఒకసారి జోర్డాన్ గగనతలం మీదు గా పాలస్తీనా వెళుతున్నా. ఆ విష యం తెలుసుకున్న జోర్డాన్ అధ్యక్షు డు నాకు ఫోన్ చేశారు.
మోదీజీ మీరు అలా ఎలా వెళ్లిపోతారని, మీరు మా అతిథి,మా ఆతిథ్యం స్వీకరించాల్సిందే అని ఇంటికి ఆహ్వానించారని, నేను వారి ఇంటికి వెళ్లి రాత్రి భోజనం చేశానని, అనంతరం జోర్డాన్ అధ్యక్షుడి హెలికాప్టర్‌లో పాలస్తీనా బయలు దేరానని, ఈ ప్రయాణంలో ఫ్లైట్ అటెండెంట్లుగా ఇజ్రాయెల్ వాళ్లు పని చేశారు. ఇలా ఆ మూడు ప్రాంతాలూ నా కోసం ఆకాశంలో ఒక్కటయ్యాయి అని మోదీ పేర్కొ న్నారు. వారైతే రామాలయంపైకి బుల్డోజర్ పంపుతారు… కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలకు అధికారం ఇస్తే అయోధ్యలో నిర్మించిన రామాల యంపైకి బుల్డోజర్‌ను పంపు తాయని ప్రధాని మోదీ అన్నారు.
బుల్డోజర్లను ఎక్కడ నడపాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వద్ద ట్యూషన్ చెప్పించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ మ్యాని ఫెస్టోపై ముస్లింలీగ్ ముద్ర ఉందని గతంలో విమర్శించిన ప్రధాని తాజా గా దాన్ని మావోయిస్టు డాక్యుమెం ట్‌గా అభివర్ణించారు. ఆలయాల్లోని బంగారంపైన, మహిళల మంగళ సూత్రాలోని పుత్తడిపైన కన్నేసిన ఆ మ్యానిఫెస్టో అమలైతే దేశ ఆర్థికాభి వృద్ధికి దెబ్బ అని, దేశం దివాలా తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశా రు. శుక్రవారం ఆయన ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ముంబైలో జరిగి న పలు ప్రచార సభల్లో ప్రసంగించా రు. దేశంలో అస్థిరత సృష్టించడానికే ‘ఇండీ’ కూటమి ఎన్నికల బరిలో నిలిచిందన్నారు. పోలింగ్ నడిచే కొద్దీ కూటమి పేకమేడలా కూలిపో తోందని, బీజేపీ కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని స్పష్టం చేశారు.
శ్రీరామనవమి రోజు ఎస్పీ సీనియర్ నేత ఒకరు రామాలయం పనికిమా లినదని అన్నారని, రామాలయానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మార్పించేందుకు కాంగ్రెస్ సన్నద్ధంగా ఉందని మోదీ ఆరోపిం చారు. ఈ రెండు పార్టీలకు తమ ఓటుబ్యాంకు కంటే మించింది లేదని, వాటి బండారాన్ని నేను బయటపెడుతుండడంతో మోదీ హిందూ, ముస్లిం విభజన తెస్తున్నా రని రచ్చచేస్తున్నారు. బీజేపీ తెచ్చి న ట్రిపుల్ తలాక్ చట్టంతో మన తల్లులు, సోదరీమణులంతా సంతో షంగా ఉన్నారని, బీజేపీని ఆశీర్వది స్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రధా ని పదవిపై కాంగ్రెస్ పగటి కలలు కంటోందని మోదీ ధ్వజమెత్తారు. మత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధ మని, కానీ ఇండీ కూటమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను లాక్కుని తమ ఓటుబ్యాంకుకు కట్టబెట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
Metro loss with Mahalakshmi free bus scheme