Mexico mass firing : ప్రజా దీవెన, మెక్సికో సిటీ: మెక్సికో లో మరోసారి తుపాకుల మోత మోగింది. ప్యూబ్లా రాష్ట్రం లోని తె హుయిట్టింగో (Tehuitzingo) నగ రంలో ఒక గు ర్తుతెలియని దుండ గుడు సృష్టించిన బీభత్సం పది మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. మృతుల్లో ఒక చి న్నారి కూడా ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోం ది.
సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి..సాధారణంగా సాగిపో తున్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తుపాకీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దుండగుడు విసక్షణారహితం గా జరిపిన కాల్పులకు అక్కడి వాతావరణం క్షణాల్లో రక్తసిక్తం గా మా రింది. ప్యూబ్లా ప్రావిన్స్‌లోని తెహుయిట్టింగో నగరం లో జరిగిన ఒక చి న్నారితో సహా మొత్తం 10 మంది అక్క డికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపిన అనం తరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరు ముఠా తగాదాలే దీనికి కారణ మా లేక మరేదైనా వ్యూహాత్మక దా డి జరిగిందా అనే కోణంలో స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. నిం దితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో తెహుయిట్టింగో ప్రాంతంలో భయాందోళనలు వ్యక్తమవుతు న్నాయి.
