IndiaOpinionజాతీయంతెలంగాణనల్గొండహైదరాబాద్

MG University Higher education chairman : ఉన్నత విద్యా మండలి చైర్మన్ బా లకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్య, సంస్కర ణలతో సవాళ్లకు పరిష్కారాలు 

MG University Higher education chairman : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్స వా ల్లో భాగంగా నేడు ఎంజీయూలో సి లబస్ సంస్కరణలు పై డిగ్రీ అధ్యా పకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తె లం గాణ ఉన్నత విద్యా మండలి చై ర్మన్ ఆచార్య బాలకృష్ణారె డ్డి మాట్లాడుతూ ప్రపంచం ప్రస్తుతం మార్పుల దశలో విద్యా రంగం సైతం ప రివర్తనకు మినహాయింపు కాదని ఈ మా రుతున్న కాలంలో భారతదే శానికి ఉన్న నిజమైన సంపద యువత అని రాబోయే రెండు,మూడు దశాబ్దాలు అపార మైన మానవ వ నరులతో భారతదేశానికి స్వర్ణయు గాన్ని అందించే గొప్ప అవకాశమ ని, సంస్కరణలతోనే సవాళ్లకు పరి ష్కారాలు సాధ్యమని తెలంగాణ ఉన్నత విద్యా మండ లి ఛైర్మన్ పేర్కొన్నారు.

విద్యా నాణ్యతను మరింత మెరు గుపరచాలంటే అన్ని భా గస్వామ్య వర్గాలను కలుపుకొని ముందుకె ళ్లాల్సిన అవస రం ఉందని ఆయన స్పష్టం చేశారు.ఉన్నత విద్యలో సాంకే తికత వినియోగం అత్యంత కీలకమని పేర్కొన్న ప్రొఫెసర్ బాల కృష్ణారెడ్డి, డిగ్రీ స్థాయిలో బోధనలో కనీసం 15 శాతం నుంచి 20% వరకు టెక్నాలజీని సమన్వయం చేయాలని సూచించారు.

 

విద్యను ఆధునీకరించడంతో పా టు, విద్యార్థులను భవిష్య త్ అవ సరాలకు సిద్ధం చేయాలంటే కొత్త పద్ధతులు, డిజిట ల్ సాధనాలు, ఆ న్‌లైన్ వనరుల వినియోగం పెరగాల్సి ఉం దన్నారు.భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో ప్రగతి సా ధించినప్పుడే ప్రపంచ శక్తిగా ఎదుగుతుందని ఆయన అ న్నారు. విమానయానం, రక్షణ, వ్యవసాయం, మార్కెటింగ్, విపత్తు నిర్వహణ, సముద్ర పరిశోధన, సముద్ర గర్భ పరిశో ధనలు వంటి అనేక కొత్తరంగాల్లో అవకాశాలు వేగంగా విస్త రిస్తున్నాయని వివరించారు.

విద్యార్థులు ఈ కొత్త అవకాశాలను గుర్తించి, వాటికి అను గుణంగా త మ నైపుణ్యాలను అభివృద్ధి చేసు కోవాలని ఆ యన పిలుపునిచ్చారు. భవిష్యత్ అవసరాలను దృ ష్టిలో ఉంచుకొని రూపొందిస్తున్న కొత్త సిలబస్‌లో సాంకేతికత, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్,చట్టం-విధానం-ప్రభుత్వం, పరిశోధన అనే నాలుగు ముఖ్య భాగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆ యన తెలిపారు. ఈ సిలబస్ విద్యార్థులను కేవలం పాఠ్యాం శాలకే పరిమితం చేయకుండా, ఇం టర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు, ఫీల్డ్ స్టడీ లు, కేస్ స్టడీల ద్వారా ప్రాక్టికల్ అ నుభవాన్ని అం దించేలా రూపుదిద్దుకుంటుందన్నారు.

అలాగే, కృత్రిమ మేధస్సు మరి యు విద్యారంగంలో వస్తు న్న కొత్త మార్పులను నిరంతరం అధ్యయనం చేసి, అభివృ ద్ధి చెందుతున్న సాంకేతికతను అన్వేషించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొ న్నారు. విద్యారంగం భవిష్యత్ స వా ళ్లను ఎదుర్కొని అవకాశాలను సృష్టించే దిశగా ముందుకు సాగాల ని ఆయన ఆకాంక్షించారు.ప్రపంచ పోటీని ఎదుర్కొ ని భారత విద్యా ర్థులను గ్లోబల్ లీడర్స్‌గా తీర్చిదిద్ద డంలో అధ్యాపకుల పాత్ర అత్యం త కీలకమని ప్రొఫెసర్ బాలకృష్ణా రెడ్డి అభిప్రాయపడ్డారు.

 

విద్యారంగంలో నాణ్యత, నైపు ణ్యం, పరిశోధన, సాంకేతిక తల సమన్వయం ద్వారా మాత్రమే సమాజాభివృద్ధి సాధ్య మవుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపకు లపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఆ చార్య కొప్పుల అంజిరెడ్డి అధ్యా ప కులు, సిబ్బంది పాల్గొన్నారు.

టీజీ ఐసెట్ 2026 ప్రశ్నాపత్రం కోడ్ విడుదల

టీజీ ఐసెట్ 2026 ప్రశ్నా పత్రం కో డ్ ను ఉన్నత విద్యా మం డలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు. టీజీ ఐసెట్ చైర్మన్ మ రియు ఎంజీయూ ఉపకులపతి ఆ చార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, క న్వీనర్ ఆచార్య అల్వాల రవి, ఉ న్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఇటికాల పురుషో త్తం, సె క్రటరీ ఆచార్య శ్రీరామ్ వెంకటేష్, ఎంజియు రిజి స్ట్రా ర్ ఆచార్య కొ ప్పుల అంజిరెడ్డి, ఐ సెట్ కన్వీనర్ అల్వాల రవిలు లాటరీ పద్ధతిలో ప్రశ్నాపత్రం “బీ” సెట్ ను విడుదల చేశారు. ఇదిలా ఉండగా బుధవారం జరిగిన ఐ సెట్ పరీక్షకు మొదటి సెషన్ టిజి ఐసెట్ 2026 90 శా తం మంది విద్యా ర్థులు హాజరయ్యారు.

Related Articles

Back to top button