MG University : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవాపథకం యూనివర్సి టీ కా లేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బిజి నెస్ మేనేజ్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆ దివారం మహనీయుల జయంతి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మహా త్మా గాంధీ విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచా ర్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ వి ద్యార్థులను ఉద్దేశించి మాట్లాడు తూ విద్యార్థులు మహనీయులను ఆదర్శంగా తీసుకొని వారి అ డుగు జాడల్లో నడుస్తూ బాధ్యతయుతంగా మెలగాలని సూచించారు.
వ్యక్తులు వ్యక్తిగతంగా తాము అభి వృద్ధి చేసుకున్నప్పుడే సమాజం అ భివృద్ధి సాధిస్తుందన్నారు. బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల ఆశాదీపం విశిష్టమైన పార్లమెంటీ రియను, మహా మేధావి, వెయ్యి మందిలో ఉన్న తన ప్రత్యేకతను నిరూపించుకున్న వ్యక్తిగా కొనియాడారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాల య రిజిస్ట్రా ర్ ఆచార్య అంజిరెడ్డి మాట్లాడుతూ బాబు జగ్జీ వన్ రామ్ దేశం ఆ హార సంక్షోభం ఎదుర్కొంటున్నప్పు డు వ్యవసాయ శాఖ మంత్రిగా హ రిత విప్లవం లాంటి సంస్కర ణలు తీసుకొచ్చిన క్రాంతిదర్శి. అంటరా నితనం అవమా నా లను లెక్కచే యకుండా దేశ ఉపప్రధానిగా ఎదిగిన మహో న్నత నాయకుడిగా కొనియాడారు. ఈ కార్యక్రమానికి జా తీయ సేవా పథకం విశ్వవిద్యా ల య సమన్వయకర్త డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి సభ అధ్యక్షత వహించారు.
అలాగే ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విశ్వవిద్యాల య ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ ప్రేమ్ సాగర్ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆ ఫీసర్ డాక్టర్ మహమ్మద్ షరీఫ్, డాక్టర్ మ్యాథరి ఆనంద్, డాక్టర్ క ట్ట కిరణ్మయి, సబవత్ రమేష్ నా యక్, అనిల్ కుమార్ మరియు వి ద్యార్థులు పాల్గొని డాక్టర్.బాబు జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకున్నారు.