Praja Deveena
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 4:50 pm Posted by : praja deveena

Minister Jupally Krishna Rao : మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్య, బౌద్ధ వారసత్వానికి పూ ర్వవైభవం తీసుకొస్తాం 

Minister Jupally Krishna Rao : ప్రజా దీవెన, నాగార్జున సాగర్ : ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ వారసత్వ క్షేత్రం నాగార్జున సాగర్‌లోని ‘బుద్ధ వనం’ ఆధ్యాత్మిక శోభను సంత రించు కుంది. బుద్ధపూర్ణిమ పర్వ దినాన్ని పురస్కరించుకుని శుక్ర వారం సాయంత్రం ఇక్కడ నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బుద్ధ వనం చేరుకున్న వీరు ముందుగా బుద్ధచరిత వనంలోని బుద్ధుడి పాదాల వద్ద ప్రా ర్థనలు చేశారు. అనంతరం వందన సమర్పణతో పుష్పాం జలి ఘటించారు. మహస్తూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో బౌద్ధ సంప్రదా యబద్ధంగా ప్రార్థనలు నిర్వహిం చి ధ్యానం చేశారు. బుద్ధవనం విశేషా లను తెలియజేశారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృ ష్ణారావు మాట్లాడుతూ గౌతమబు ద్ధుని బోధనలు ఎప్పటికీ ఆచరణీయమని కొని యాడారు. ప్రపంచానికి శాంతి, అహింసల మార్గాన్ని చూపి న మహనీయుడు బుద్ధుడు. ద్వేషం ఉన్న చోట ప్రేమను, అశాంతి ఉన్న చోట ప్రశాంతతను నెలకొల్పడమే బౌద్ధ ధర్మం యొక్క ప్రధా న ఉద్దేశ్యం అని చెప్పారు. తెలం గాణ గడ్డపై బౌద్ధ వారసత్వ సంప ద పుష్కలంగా ఉందని, నాగార్జు న సాగర్‌లోని బుద్ధవనాన్ని అంత ర్జాతీయ స్థాయి బౌద్ధ పర్యా టక కేంద్రంగా మరింత తీర్చిదిద్దు తామని,ఇక్కడికి వచ్చే ప ర్యాటకుల కోసం మౌలిక సదుపాయాలను మెరుగు పరచడ మే కాకుండా, బుద్ధుని జీవి త విశేషాలను భావితరాలకు తెలియజేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూ పొందిస్తాం అని మంత్రి స్పష్టం చేశారు.

బౌద్ధమత ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేలా నిర్వహించిన సాం స్కృతిక ప్రద ర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రాంగణ మంతా దీపాలతో అలంకరించడంతో బుద్ధవనం దేదీప్యమానంగా వె లిగిపోయింది.ఈ వేడుకల్లో నాగా ర్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ (TGT DC) చైర్మన్ పటేల్ ర మేష్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శా ఖ స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్, టీజీటీడీసీ ఎండీ గౌతమి, డైరె క్టర్ ఆఫ్ టూరిజం లక్ష్మణ్ రంజిత్ నా యక్, బుద్ధవనం స్పె షల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, ఇతర అధికా రులు,బౌద్ధ భిక్షువులు పాల్గొన్నా రు.