Minister Jupally Krishna Rao : మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్య, బౌద్ధ వారసత్వానికి పూ ర్వవైభవం తీసుకొస్తాం 

Minister Jupally Krishna Rao : ప్రజా దీవెన, నాగార్జున సాగర్ : ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ వారసత్వ క్షేత్రం నాగార్జున సాగర్‌లోని ‘బుద్ధ వనం’ ఆధ్యాత్మిక శోభను సంత రించు కుంది. బుద్ధపూర్ణిమ పర్వ దినాన్ని పురస్కరించుకుని శుక్ర వారం సాయంత్రం ఇక్కడ నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బుద్ధ వనం చేరుకున్న వీరు ముందుగా బుద్ధచరిత వనంలోని బుద్ధుడి పాదాల వద్ద ప్రా ర్థనలు చేశారు. అనంతరం వందన సమర్పణతో...