Opinionజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Minister Komati Reddy Venkata Reddy: బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, రూ.9. 40 కోట్లతో హై లెవెల్ బ్రిడ్జి, రోడ్డు పనులకు శ్రీకారం

Minister Komati Reddy Venkata Reddy: ప్రజా దీవె న, నల్లగొండ: నల్గొండ నగర అభివృద్ధిలో మరో కీలక అ డు గు పడింది. నగరంలోని 3వ డివిజన్‌ పరిధిలోని ఎస్టీ కాలనీ నుంచి శేషమ్మ గూడెం మీదుగా అద్దంకి రోడ్డు వరకు రూ.9 .40 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిం చనున్న హై లెవెల్ బ్రి డ్జి, రోడ్డు పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ తెలంగాణలో నల్గొం డ మున్సిపల్ కార్పొరేషన్‌ను నం బర్‌వన్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నల్గొండ శివారు గ్రామాల న్నింటినీ కలుపుకొని నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తా మని తెలిపారు.

    రూ.500 కోట్లతో రహదారుల అభివృద్ధి

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే సుమా రు రూ. 500 కోట్లతో రహదారులు, సీసీ రోడ్ల అభివృద్ధి పను లు చేపట్టామని మంత్రి తెలిపారు. పలు ప్రాంతాల్లో పనులు కొనసాగుతు న్నాయని, నగరానికి మరింత మెరుగైన రవా ణా సౌకర్యాలు క ల్పించడమే లక్ష్యమన్నారు. శేషమ్మ గూ డెం ప్రజలకు అవసర మై న మౌలిక వసతుల కల్పనపై కూ డా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. గుడి నిర్మాణం తో పాటు సీసీ రోడ్లు, వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశామని చెప్పారు.

24 గంటల తాగునీరు.. త్వరలోనే అందుబాటులోకి

నల్గొండ పట్టణ ప్రజలకు 24 గం టల తాగునీటి సరఫరా అందించేందుకు రూ.83 కోట్లతో చేపట్టి న వాటర్ ప్లాంట్ ద్వారా నెల రోజుల్లో తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.లెప్రసీ కాల నీలో రూ.3 కోట్లతో సబ్‌స్టేషన్ మంజూరు చేశామని, పనులు పు రోగతిలో ఉన్నాయని తెలిపా రు. స్మశాన వాటిక పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు.

     

     పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

ఇండ్లు లేని నిరుపేదల కోసం శేష మ్మ గూడెంలో 50 ఇంది రమ్మ ఇ ళ్లు మంజూరు చేశామని, అవస రమైతే మరో 50 ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. అ ర్హులైన ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు.
ప్రజలు అడిగిన తర్వాతే అభివృ ద్ధి చేయడం కాదు.. ప్రజ లు అడ గకముందే వారి అవసరాలను గుర్తించి పనులు చేపడతామని మంత్రి అన్నారు.

వారం రోజుల్లో బ్రిడ్జి పనులు ప్రారంభం

ఇప్పుడే శంకుస్థాపన చేసిన హై లెవెల్ బ్రిడ్జి, రోడ్డు పనులను వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీంతో ఎస్టీ కాలనీ–శేషమ్మగూడెం– అద్దంకి రోడ్డు మార్గంలో రాకపోకలు మరింత సులభతరం కానున్నా యన్నారు. ఇదే సమయంలో న ల్గొండ పట్టణంలోని పానగల్ సా వర్కర్ రహదారి నుంచి భాస్కర్ థియేటర్ వరకు రూ.15 కోట్ల వ్య యంతో చేపట్టనున్న రోడ్డు పను లను కూడా ప్రారంభిస్తు న్నట్లు మంత్రి తెలిపారు.

మొత్తంగా చూస్తే.. రహదారులు, వంతెనలు, తాగునీరు, విద్యుత్, గృహ నిర్మాణం వంటి మౌలిక వసతులపై వరుస గా ప్రాజెక్టులు పట్టాలెక్కుతుండటంతోనల్గొండ నగర రూ పురేఖలు మరింత వే గంగా మారే దిశగా అడుగులు పడు తున్నాయి.ఈ కార్యక్ర మంలో జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్, నల్గొండ మున్సిపల్ కార్పొ రేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీని వాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, 3వ డివిజన్ కా ర్పొ రేటర్ మల్లేశ్వరి, అధికారులు, ప్ర జాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

   నల్లగొండ సరికొత్త ప్రయాణం

నల్లగొండ: పానగల్ టు భాస్కర్ థియేటర్ రోడ్డు రూపురే ఖలు మారేలా శంకుస్థాపన జరిగింది.నల్గొండ పట్టణ ప్ర యాణానికి సరికొత్త రూపు తీసుకొస్తూ, ట్రాఫిక్ కష్టాలకు శా శ్వత పరిష్కారం చూపేందుకు కీలక ముందడుగు ప డింది. పానగల్ సావర్కర్ నగర్ నుంచి భాస్కర్ థియేటర్ వరకు స మగ్ర రోడ్డు విస్తరణ, పునరుద్ధ రణ పనుల కోసం కేటాయిం చిన నిధులు 14.5 కోట్లు (వన్ టైమ్ ఇంప్రూవ్‌మెంట్ కింద) కేటాయిం చారు. రోడ్లు, భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా భూమిపూజ చేశారు.

ఈ రహదారి నిర్మాణం పూర్తయి తే పట్టణంలో రాకపోకలు మరిం త వేగవంతం కావడంతో పాటు, ఆయా ప్రాంతాల ప్రజలకు సురక్షి తమైన మరియు సులువైన ప్రయాణ అను భవం లభించనుంది. నల్గొండ మౌలిక సదుపాయాల అభి వృద్ధిలో ఈ ప్రాజెక్ట్ ఒక మైలురాయిగా నిలవనుందని పరిశీ లకులు భావిస్తున్నారు.

Related Articles

Back to top button