Praja Deveena
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 12:17 pm Posted by : praja deveena

Minister Komatireddy : మంత్రి కోమటిరెడ్డి అప్పీల్, అవస రమైతే అదనపుతరగతులతో వి ద్యార్ధులను ఉన్నతులుగా తీర్చిది ద్దాలి

Minister Komatireddy : ప్రజా దీవెన, నల్లగొండ: విద్యా ర్థులను డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లుగా తీర్చిదిద్దాలని రా ష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంక ట్ రెడ్డి అధ్యాపకులకు సూచించారు. అవసరమైతే ప్రతి రో జూ అదనంగా రెండు గంటలు అదనపు తరగతులు తీ సు కుని విద్యార్థులను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లండనని అప్పీ ల్ చేశారు. బుధవారం నల్లగొండ కేంద్రంలో ప్రభుత్వ బాలిక ల జూనియర్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్యసాధనకు ఆలోచించాలన్నారు. ఇం టర్మీడియట్ జీవితంలో టర్నింగ్ పాయింటని,ఈ దశలోనే భవిష్యత్ నిర్ణయమవుతుందని చెప్పారు.

విద్యార్థినులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి పుస్తకాలపై దృ ష్టి పెట్టాలని సూచించారు.లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించు కుని కష్టపడి చదివితే తప్పకుండా విజయం సాధించగల రన్నారు. భవిష్యత్ లో AI (కృత్రి మ మేధస్సు)రంగంలో కూ డా అవకాశాలు విస్తృతంగా ఉంటాయని, ఆదిశగా ఆలో చించాలని చెప్పారు.బాగా చదివి తల్లిదండ్రులకు, గురువు లకు, స్వంత ఊరికి మంచి పేరు తీసుకురావాలని పిలుపు నిచ్చారు.ఎంత మంది విద్యార్థినులు డాక్టర్లు కావాలని ల క్ష్యంగా పెట్టుకుంటారో, అంతమందిని చదివించేందుకు తా ను సహకరిస్తానని హామీ ఇచ్చారు.

ఐఏఎస్, డాక్టర్, ఇంజనీర్ కావాలనే లక్ష్యాల కోసం నాపూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థినులందరికీ ఎంసెట్ కోచింగ్ మెటీ రియల్ సదుపాయం ఇస్తామని తెలి పారు.ప్రతిరోజు రెండు గంట లు అదనపు తరగతులు నిర్వ హించాలని అధ్యాపకులను ఆదే శించారు.విద్యార్థులు ప్రతి రోజు 10గంటలు కష్టపడి చదువుకోవాలని విద్యార్థులు ల క్ష్య సాధన కోసం క్రమశిక్షణతో చదవాలన్నారు. కళాశాలకు నూతన భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామ ని హామీనిచ్చారు.

ఆదివారం లోపు పాత బిల్డింగ్ ను కూల్చి నూతన బిల్డింగు లకు కట్టడానికి ప్లాన్ సిద్ధం చేయండని కమిషనర్ కు చెప్పా రు.తిప్పర్తి ,కనగల్లు మండలంలో ఇప్పటికే జూనియర్ కళా శాల ఏర్పాటు చేశామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ప్ర భుత్వ విప్ బీ ర్ల ఐలయ్య, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీని వాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవర్ లు మాట్లాడారు. ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అశ్రప్ అమిర్ అలీ, కళాశాల ప్రిన్సిపల్ ఎం పద్మ పా ల్గొన్నారు.