Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: పుస్తకాల్లో ఉండే సైన్స్ పొలాల్లోకి రావాలి, రై తు ల కళ్లలో ఆనందం చూడాలని ‘సిట్రస్ సెమినార్ – 2026’ వే దికగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. చేసిన ప్ర సంగం ఇ ప్పుడు ఉద్యానవన శాఖల్లో సరికొత్త చర్చకు తెరలేపిం ది. నల్గొండ బత్తాయిని అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ఆయన ఇచ్చి న భరోసా రై తుల్లో కొత్త ఉత్సాహా న్ని నింపింది.రైతు సంక్షేమ కమిష న్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, శాస్త్ర వేత్తలు హాజరైన ఈ హైప్రొఫైల్ సద స్సులో మంత్రి కో మటిరెడ్డి మాట్లా డిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే …
నల్లగొండఅంటేనే బత్తాయి, బత్తాయిఅంటేనే నల్లగొండ
గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నో ప్రకృతి సవాళ్లు, మార్కెట్ హెచ్చు తగ్గులు ఎదురైనా నల్గొండ రైతులు వెనకడుగు వే యలేదు. వేలాది మంది రైతుల కష్టం, పట్టుదలే ఈ రోజు తె లంగాణలోనే నల్గొండను ‘సిట్రస్ హబ్’గా నిలబెట్టింది.నేనూ బత్తాయి రైతునే.. ఆబాధ నాకు తె లుసని మంత్రి కోమటి రెడ్డి తన ప్ర సంగంలో భావోద్వేగానికి గుర య్యారు. తానే స్వయంగా గతం లో బత్తాయి సాగు చేసిన రోజుల ను గుర్తుచేసుకున్నారు.
నేను రైతు బిడ్డను. మొక్క నాటిన ప్పటి నుంచి అది కాపు కొచ్చే వర కు పడే శ్రమ నాకు తెలుసు. పంట బాగా పండినా రేటు లేనప్పుడు రై తు గుండె ఎంత రగులుతుందో, మార్కె ట్‌కు వెళ్లేటప్పుడు పడే ఇ బ్బందులు ఏంటో నేను స్వయం గా అనుభవించాను.”గత ఏడాది వర కు బత్తాయి రైతులకు తమ వాయి స్ వినిపించడానికి ఒక సరైన వేది క లేదన్న లో టును మంత్రి గుర్తుచేశారు.
“సమస్యలను సమిష్టిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఏర్పడిన బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సం ఘం’ ఒక అద్భుత మై న ప్రయత్నం. వీరికి ప్రభుత్వ మద్ద తు ఎల్లప్పుడూ ఉంటుంది.ల్యాబ్స్ నుంచి ల్యాండ్స్ వరకు.. సైన్స్ అం డ్ అగ్రికల్చర్ కలవాలి ఈ ‘సిట్రస్ సెమినార్ – 202 6’ కేవలం ఒక స మావేశం కాదని, ఇదొక నాలెడ్జ్ హబ్ అని మంత్రి కొనియాడారు.
నాణ్యమైన నర్సరీ మొక్కలు, ఆ ధునిక సాగు పద్ధతులు, సైంటిఫిక్ సలహాలు, ఎగుమతి అవకాశాలపై శాస్త్రవేత్తలు, మార్కెటింగ్ నిపుణు లు, రైతులు ఒకే వేదికపైకి రావడం శుభపరిణామం. “శాస్త్రవేత్తల జ్ఞా నం, రైతుల అనుభవం, ప్రభుత్వ సహకారం.. ఈ మూడూ తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు.”
‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది’ తెలంగాణ ప్రభు త్వం కేవలం సాంప్రదాయ పంటలకే పరి మి తం కాకుండా, ఉద్యాన పంటల విస్తరణ, వాల్యూ యాడెడ్ (విలువ ఆధా రిత) ఉత్పత్తుల అభివృద్ధి, గ్లోబల్ మార్కెటింగ్ సదుపా యాల మెరుగుదలకు కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశా రు.రైతు బాగుం టేనే గ్రామం బాగుంటుందని, గ్రామం బా గుంటేనే రాష్ట్రం బాగుంటుంది. నల్గొండ సిట్రస్ సాగు దేశా నికే ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తూ మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.


