Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: గ్రామాల అభివృద్ధికి గ్రామస్తులందరూ కలి సికట్టు గా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయ న నల్గొండ జిల్లా నల్గొండ, తిప్పర్తి మండలాలలో వివి ధ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముం దుగా నల్గొండ మం డలం, చిన్న సూరారం గ్రామ హమ్లెట్ గ్రా మమైన పావురాలగూడెంలో కోటి 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పిడ బ్ల్యుడి రోడ్డును మంత్రి ప్రారంభిం చారు. చిన్న సూరారం, పెద్ద సూ రారం, చందనపల్లి గ్రామా లలో ఏర్పా టుచేసి న సమావేశాలలో గ్రామస్తులతో మాట్లా డారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ఆర్థి కంగా వారి కాళ్లపై వారు నిలబడి సాధికారత సాధించేలా ప్ర భుకత్వం తరఫున మహి ళా సంఘాలతో రైస్ మిల్లులు, గో దాములు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని, మహి ళలు చిన్న చిన్న వ్యాపారాలతో పాటు, రైస్ మిల్లులు నిర్వ హించాలని కో రారు. ఆగస్టు 15న చిన్న సూరారం గ్రామ మ హిళా సంఘాలకు 3 కోట్ల రూపాయలు, పెద్ద సూరారం గ్రా మ సంఘాలకు రెండున్నర కోట్లు, చందనపల్లి గ్రామ మహి ళా సంఘాలకు కోటి 50 లక్షల రూ పాయల రుణాల చెక్కు లను అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
చిన్న సూరారం, పెద్ద సూరారం గ్రామాల మధ్య వెర్ హోసిం గ్ గోదాం లేదా రైస్ మిల్ ఏర్పాటు చే సేందుకు 5 నుండి 10 ఎకరాల స్థలాన్ని చూడాలని అధికారులను మంత్రి ఆదేశిం చారు. పావు రాల గూడెంలో చౌకధర దుకాణాన్ని మంజూ రు చేయడమే కా కుండా, వెంటనే డీలర్ ను నియ మించా లని ఆదేశించారు. ఆయా గ్రామాలలో నిర్మాణంలో ఉన్న గ్రా మ సంఘాల భవనాలను నిర్మా ణాన్ని సాధ్యమైనంత త్వ రగా పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాలకు గరిష్టంగా బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలని డిఆర్ డిఓ ను ఆదేశించారు.మహిళలు తీసుకున్న రుణాలను సకా లం లో తిరిగి చెల్లించాలని కోరారు. మహిళలు రుణాలను సద్వి నియోగం చేసుకోవాలని తద్వారా కుటుంబాల అభి వృద్ధి చెందుతాయన్నారు. నల్గొండ, కనగల్, తిప్పర్తి మండ లా లలో మహిళా సంఘాల చేత రైస్ మిల్లులను ఏర్పాటు చే సేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు
రాష్ట్ర ప్రభుత్వం గుడిసెల్లో ఎవరు ఉండరాదన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మి స్తున్నదని, మొదటి విడత రాష్ట్రవ్యాప్తంగా ఇండ్లు ఇవ్వడం జరిగిందని, రెం డవ విడత గుడిసెలలో నివసిం చేవారికి ప్రా ధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్లాట్లు ఉన్న వారికి కూడా ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. అందరికీ రేషన్ కార్డు లతో పాటు, సన్న బియ్యం ఇస్తు న్నామని,రాష్ట్ర వ్యాప్తంగా మూ డు కోట్ల 25 లక్షల మందికి సన్న బియ్యం ఇస్తున్నా మ ని చెప్పారు. రాష్ట్రంలో 20000 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రహదారులు నిర్మిస్తున్నామన్నారు.
ఇకపై తాను గ్రామాలలో నిరంతరం పర్యటిస్తానని, వారానికి ఒక రోజు గ్రామాలు తిరుగుతానని, ఆదివారం నల్గొండ ము న్సిపల్ కార్పొరేషన్ లో పర్యటిస్తానని, అభివృద్ధి కార్యక్ర మాలకు ఎలాం టి నిధుల కొరత లేదని చెప్పారు. చందన పల్లి గ్రామ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, గ్రామ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ లో చెత్తను ఖాళీ చేయిస్తున్నా మని, ప్రజలు లేని చో ట డంపింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇ దివరకే జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్లు చెప్పారు.
ప్రతి గ్రామంలో ఒక సబ్ స్టేషన్ ఏ ర్పాటుకు ప్రభుత్వం చర్య లు తీసుకుంటున్నదని ,70% గ్రామాల లో సబ్స్టేషన్లు ఉ న్నాయని మంత్రి తెలిపారు. అలాగే గ్రామంలోని పాఠశా ల లో కంప్యూటర్లు ఏర్పా టు చేసి విద్యార్థులకు కంప్యూ టర్ విద్య అందించేందుకు చర్య లు తీసుకుంటామని తెలి పా రు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అ దనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, ఆర్ అం డ్ బిఎస్ ఈ మోహన్, పంచాయతి రాజ్ ఈఈ గిరిధర్, ఆ ర్ అండ్ బి ఈఈ శ్రీధర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య, వి జిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, మాజీ జె డ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, త హసిల్దార్ పరశురాం ,ఎంపీడీవో యాకూబ్, అధికారులు, ఆ యా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు మంత్రి వెంట ఉన్నారు.


