Minister Komatireddy Venkat Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకవ్యాఖ్య, 2028 లో ఎస్‌ఎల్‌బీసీ సొరంగంపూర్తి జీవితలక్ష్యం

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చి దిద్దడమే తన జీవిత లక్ష్య మని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సి నిమాటోగ్రఫీ శాఖల మంత్రి కో మటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశా రు. పట్టణంతో పాటు నల్లగొండ నియోజకవర్గాన్ని అ న్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగై న మౌలిక వస తులు కల్పించడ మే తన ప్రధాన ధ్యేయమని తెలి పారు. ఆదివారం నల్లగొండ పట్ట ణంలోని నల్లగొండ క్లబ్‌లో రూ.2 కోట్లతో నిర్మించిన అదనపు గదులు, కాన్ఫరెన్స్ హాల్‌ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నల్లగొండ క్లబ్ పట్టణ ప్రజలకు ఎంతో ఉప యోగక రంగా ఉందని, దాని అ భివృద్ధికి తన సహకారం ఎల్ల ప్పు డూ ఉంటుందని చెప్పారు.నల్లగొండ పట్టణ ప్రజలకు 24 గం టల తాగునీరు అందించేందుకు రూ.125 కోట్లతో పను లు చేపట్టామని మంత్రి తెలిపారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి ప్రజల కు నిరంతర తాగునీరు అందిం చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగమే ప్రధాన లక్ష్యం
నల్లగొండ అభివృద్ధితో పాటు ఎ స్‌ఎల్‌బీసీ సొరంగ మార్గా న్ని పూర్తి చేయడం తన ప్రధాన లక్ష్యాల్లో ఒకటని కోమటిరె డ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేర కు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో నిధులు సమ కూర్చుకుని పనులను వేగం గా ముందుకు తీసుకెళ్తున్నా మని చెప్పారు.2028 ఆగస్టు నాటికి ఎస్‌ఎల్‌బీసీ సొరంగ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టు కున్నామని తెలి పారు. గతంలో రూ.2 వేల కోట్లుగా ఉన్న ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం రూ. 5 వేల కోట్లకు చేరిందని, ఇప్పటి కే సొరంగ పనుల్లో గణనీయమైన పురోగతి సాధించామని వివరించారు.
రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు
నల్లగొండ పట్టణ రూపురేఖలను మార్చేలా భారీ అభివృద్ధి పను లు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. రూ.900 కోట్లతో ఔ టర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని, దీని ద్వారా పట్ట ణంలో ట్రాఫిక్ స మస్యలు, ప్రమాదాలు తగ్గడంతో పాటు నగరానికి కొత్త రూపు వ స్తుందని చెప్పారు.ప్రస్తుతం నల్ల గొండలో సుమారు రూ.1,400 కోట్ల విలువైన అభివృద్ధి ప నులు కొనసాగుతున్నాయని తెలిపా రు. రూ.300 కోట్లతో అండర్‌గ్రౌం డ్ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పా టు ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డబుల్ రోడ్లు నిర్మిస్తా మని వెల్ల డించారు.అలాగే నేష నల్ ఫండ్ నుంచి రూ.15 కోట్లతో ప ట్టణంలోని రోడ్లను అభివృద్ధి చేసి, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు భారీగా రోడ్లపనులు
రాష్ట్రవ్యాప్తంగా రూ.1,300 కోట్ల తో హ్యామ్ రోడ్ల పనులు చేపడు తున్నామని మంత్రి తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ. 2,500 కోట్లతో రోడ్ల నిర్మాణానికి చర్యలు తీ సుకుంటున్నామని వెల్లడించారు.నేను ఎక్కడ ఉన్నా నల్ల గొండకు అత్యంత ప్రాధా న్యం ఇస్తాను. నల్లగొండ పట్టణం, నియోజకవర్గ అభివృద్ధికి అవస రమైన ప్రతి పనిని ప్రాధా న్యతతో పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
నల్లగొండ క్లబ్‌కు మరింత విస్తరణ
నల్లగొండ క్లబ్ అభివృద్ధికి పక్కనే ఉన్న ఎకరం స్థలాన్ని కూ డా సమకూర్చేందుకు చర్యలు తీసుకుం టానని మంత్రి హా మీ ఇచ్చారు. కలెక్టర్‌తో మాట్లాడి క్లబ్‌కు భూమి కేటాయిం చేలా కృషి చేస్తానని చె ప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని క్లబ్ తరహాలో నల్లగొండ క్ల బ్‌ను మరింత అభివృద్ధి చేసేందు కు సహకరిస్తానని తెలిపారు.
విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం
విద్యార్థుల భవిష్యత్తును దృష్టి లో పెట్టుకుని నల్లగొండలో విద్యా మౌలిక వసతులను కూడా విస్తరి స్తున్నామని మంత్రి తెలిపారు. బొట్టుగూడ పాఠశాల నిర్మాణాని కి రూ.12 కోట్లు కేటాయించి అభి వృద్ధి చేశామని చెప్పారు.పాత టౌన్‌లో త్వరలో రూ.10 కోట్లతో ఆధునిక లైబ్రరీ నిర్మించడంతో పా టు విద్యార్థులకు కోచింగ్, ఫౌం డేషన్ సౌకర్యాలు కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.“ప్రతి ఎక రాకు సా గునీరు.. ప్రతి వార్డుకు మెరుగైన మౌలిక వసతు లు.. నల్లగొండకు సూపర్ స్మార్ట్ సిటీ రూపం” అనే లక్ష్యంతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ మే యర్ బుర్రి చైతన్య శ్రీనివా స్‌రెడ్డి, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదన పు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీ వో వై. అశోక్‌రెడ్డి, క్లబ్ అధ్యక్షుడు గోలి అమరేందర్ రెడ్డి, మాజీ ము న్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఏదుల శ్రీధర్‌రెడ్డి, గుమ్మల జానకిరెడ్డి, క్ల బ్ సెక్రటరీ చల్ల వెంకటర మణ, కాసర్ల వెంకటరెడ్డి, క్లబ్ సభ్యులు డాక్టర్ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.






