
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ : నల్లగొం డ నియోజకవర్గం కనగల్ ఎక్స్ రోడ్డు వద్ద డాక్టర్ బీఆర్ అంబే ద్కర్ విగ్రహాన్ని జేసీబీతో తొల గిం చి ధ్వంసం చేసిన ఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే సింది. ఘటనకు నిరసనగా బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షు డు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో మౌన మానవహా రం నిర్వహిం చారు. జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి భా స్కర్ టాకీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు నా య కులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహా న్ని ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన, క్షమిం చరాని చర్య అని మండిపడ్డారు. ఇది అంబే ద్కర్‌ను మాత్ర మే కాకుండా భార త రాజ్యాంగాన్ని, దళిత సమాజాన్ని అ వమానించడమేనని అన్నారు.
వైఎస్సార్ విగ్రహానికి ఒక న్యా యం.. అంబేద్కర్ విగ్రహానికి మరో న్యాయమా?”** అని ప్రభు త్వాన్ని ప్రశ్నించారు. మం త్రి కో మటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయ గురువు, మాజీ సీఎం వైఎస్ రా జశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఎలాంటి నష్టం లేకుండా తొ లగించి పోలీ స్‌స్టేషన్‌లో భద్రపరిచారని, అదే సమయంలో అంబేద్కర్ విగ్రహాన్ని జేసీబీతో ధ్వంసం చేయడం ఏమిటని నిలదీశారు.
ఈ ఘటనపై బీజేపీ తరఫున జాతీయ ఎస్సీ కమిషన్‌కు లేఖ రాయగా.. నల్లగొండ జిల్లా కలెక్టర్ నుంచి కమిషన్ వివbరణ కోరిందని తెలిపారు. 40 రోజులు దాటినా నివేదిక సమర్పించకపో వ డం దురదృష్టకరమని ఆరోపించారు. కలె క్టర్ వెంటనే స్పందించి జాతీయ ఎస్సీ కమిషన్‌కు సమగ్ర ని వేదిక అందించాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ విగ్రహ ధ్వంసానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నై తిక బాధ్యత వహించాలని నా గం వర్షిత్ రెడ్డి డి మాండ్ చేశారు. దళిత సమాజానికి బహిరంగ క్ష మాపణ చెప్పడంతో పాటు మం త్రి పదవికి వెంటనే రాజీనామా చే యాలని కోరారు. ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై తక్ష ణమే స్పందించి బాధ్యులపై కఠి న చర్యలు తీసుకో వాలని అన్నారు.
విగ్రహాన్ని తొలగించే ముందు స్థా నిక ప్రజలు, ప్రజాప్రతినిధు లు, అంబేద్కర్ సంఘాల నాయకులతో సంప్రదింపులు జర పకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించా రు. విగ్రహ ధ్వంసానికి కారణమైన కాంట్రా క్టర్‌తో పాటు బా ధ్యులైన అధి కా రులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పా టు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అదే ప్రాంతంలో ప్రభుత్వం తన సొంత ఖర్చులతో కొత్త కాం స్య అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చే యాలని, పునఃప్ర తిష్ఠకు స్పష్టమై న గడువు ప్రకటించాలని కోరారు. ప్రభు త్వం స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆం దో ళనలు చేపడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గౌడ్, విగ్రహ నిర్మాణ ప్రతిష్ఠ కమిటీ అ ధ్యక్షులు చింత ము త్యాలరావు , ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకి నర సిం హ, గోలి మధుసూ దన్ రెడ్డి, పోతెపాక లింగస్వామి, దూ దల భిక్షంగౌడ్, పకీరి మోహ న్ రెడ్డి, పెరిక మునికుమార్, పట్టణ అధ్యక్షులు పెరిక నరసిం హ, మిర్యాల వెంకటేశం, దాసరి వెంకన్న, పిండి పాపిరెడ్డి, పరన బోయిన భిక్షo, బొగరి అనిల్ కు మార్, వంగూరి రవి, రావిరాల కాసమ్మ, సీహెచ్ వెంకటేశ్వర్లు , కొత్తపల్లి ప్రమోద్ గారు, దాసరి ఈశ్వర్, సీహె చ్ జానీ, గడ్డం వెంకట్ రెడ్డితోపాటు బీజేపీ నా యకులు, కార్యకర్తలు, అంబేద్క ర్ అభిమానులు పాల్గొన్నారు.





