Minister Komatireddy venkatreddy:12వ బెటాలియన్ సమస్యలను పరిష్కరిస్తా
--గణతంత్ర వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి --మంత్రి నివాసంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
12వ బెటాలియన్ సమస్యలను పరిష్కరిస్తా
–గణతంత్ర వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
–మంత్రి నివాసంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ప్రజా దీవెన/ నల్లగొండ: నల్లగొండ జిల్లా అన్నెపర్తి వద్ద గల 12 బెటా లియన్ అధికారులు, సిబ్బందికి ఒక మంత్రిగా కాకుండా ఒక స్నేహి తునిగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.12 బెటాలియన్ లో జరిగిన గణ తంత్ర వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భం గా బెటాలియన్ పోలీస్ అధికారులు గౌరవవందనం చేసి మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఉత్తమ పనితీరు కనబరి చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఉత్కృష్ట సేవా, కఠిన సేవ, ఉత్త మ సేవ పథకాలతో పాటు ప్రశంసపత్రాలను అందించారు. అనంత రం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మట్లాడుతూ అలుపు సలుపు లేకుండా, సెలవులు లేకుండా ప్రజలకోసం పోలీసులు నిరం తరం రక్షణగా ఉంటారని గుర్తు చేశారు.
ప్రజల రక్షణ కోసం పాటు పడే పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలు బావుండాలని ఆకాక్షించా రు. బెటాలియ న్ పరిధిలో ఉన్న రోడ్డు సమస్యల గురించి అధికారు లు మంత్రిగారి దృష్టికి తీసుకురాగా తక్షణం రూ. 70 లక్షల అంచనా కలిగిన పనుల ను అప్పటికి అప్పుడే మంజూరీ చేస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాబోయే నెల రోజుల్లో రోడ్డు పనులను పూర్తి చేసి తానే స్వ యంగా ప్రారంభిస్తానని ప్రకటించారు. మంత్రిగారి తక్షణ స్పందన పట్ల పోలీసు అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో రోజులుగా అనేకమంది నాయకులకు విన్నవించినా తీరని సమస్య ను 10 నిమిషాల్లో పరిష్కారించారని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కామాండెంట్ ఎన్.వి. సత్యశ్రీనివాస్, అడిషనల్ కా మాండెంట్ తిరుపతి, చంద్రశేఖర్, ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి నివాసంలో…నల్లగొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి శుభాకంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షు రాలు గోపగాని మాధవి, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.