Minister komatireddy venkatreddy : మూడు మాసాల్లో ముచ్చెమటలు
--బిడ్డా కెసిఆర్ కాసుకో నిన్ను, నీ పార్టీని బొంద పెడతాం --ముఖ్యమంత్రి రేవంత్ ను లిల్లీ ఫూట్ అంటావా --ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదoటావా --దోపిడీతో మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నావా --కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే నీ పునాదులు కదిలిస్తాం --విటమిన్ డీ తీసుకొని దొంగ దీక్షలు చేసిoది మర్చిపోయావా --మీడియా సమావేశంలో కెసిఆర్ పై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం
మూడు మాసాల్లో ముచ్చెమటలు
–బిడ్డా కెసిఆర్ కాసుకో నిన్ను, నీ పార్టీని బొంద పెడతాం
–ముఖ్యమంత్రి రేవంత్ ను లిల్లీ ఫూట్ అంటావా
–ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదoటావా
–దోపిడీతో మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నావా
–కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే నీ పునాదులు కదిలిస్తాం
–విటమిన్ డీ తీసుకొని దొంగ దీక్షలు చేసిoది మర్చిపోయావా
–మీడియా సమావేశంలో కెసిఆర్ పై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం
ప్రజా దీవెన, నల్లగొండ: మూడు మాసాల్లో ముచ్చెమటలు పట్టిస్తాం బిడ్డా కెసిఆర్ కాసుకో నిన్ను, నీ పార్టీని బొంద పెడతామంటూ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM RevanthReddy) లిల్లీ ఫూ ట్ అంటావా, ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదoటావా, పదే ళ్ళ దోపిడీతో మా ఎమ్మెల్యేలను( mla) కొనాలని చూస్తున్నావా, కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే నీ పునాదు లు కదిలి స్తామని అగ్రహోదగ్రుడు అయ్యాడు.
నల్లగొండలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. విటమిన్ డీ తీసుకొని దొం గ దీక్షలు చేసిoది మర్చిపో యావా కేసిఆర్ నువ్వా సీఎంను అడ్డగో లుగా మాట్లాడేది అని ప్రశ్నిం చారు. బీఆర్ఎస్ పార్టీ 30 మంది ఎమ్మెల్యే లు వస్తామంటున్నా మేం వద్దంటున్నామని, మేము తల చుకుంటే తొమ్మిది మంది ఎమ్మె ల్యేలు కూడా బీ ఆర్ ఎస్ పార్టీలో ఉండరని హెచ్చరించారు.
ప్రజల నుండి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి అని, దొంగ పాస్ పోర్ట్ లు చరిత్రతో మూట గట్టుకోలేదని గుర్తు చేస్తూ విటమిన్ డీ తీసు కొని కేసీఆర్ దొంగ దీక్షలు చేసి చావు నోట్లో తల పెట్టానని ఉద్యమం చేశానని చెప్పుకుంటు న్నావని ఆరోపించారు. కూతురు కవిత జైలు కు పోయినా బుద్ది మార లేదా, అవినీతి చేసిన కేసీఆర్ ప్రజ లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మిర్యాల గూడలో రైస్ మిల్లుల దగ్గరికి నేను వెళ్ళాక రైతుల ధాన్యం రూ. 2500 కొన్నారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ముఖం చూసే ధైర్యం లేకనే రెండు సార్లు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 13 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని, బీఆర్ఎస్ పా ర్టీకి ఒక్క సీటూ రాదని, కవిత జైలుకు పోయాక కేసీ ఆర్ కు మతిభ్రమిం చి రేవంత్ బీజేపీలోకి పోతున్నారని దుష్ప్ర చారం చేస్తున్నారని దుయ్య బట్టారు.
రెండేళ్లయినా కవితకు ( kavitha) బెయిల్ రాదని ఎద్దేవా చేశారు. ఇక నల్లగొండ జిల్లాకు సంబంధించి తింటానికి తిండి లేని జగదీశ్ రెడ్డి వేల కోట్లు ఎలా సంపాదించా డoటూ ప్రశ్నిస్తూ పదేళ్ళు పనికిరాని మంత్రిగా ఉండి మమ్మల్ని విమర్శిం చే స్థాయికి చేరాడని మండిపడ్డారు.
అసెంబ్లీ కి రావడానికి నీకు మొఖం రావట్లేదని, మీరు ఎన్ని కుట్రలు చేసిన పసిగట్టుతామని, మీ కుటుం బానికి సరిపోయే డబల్ బెడ్ రూమ్ ఇల్లు చర్లపల్లి జైల్లో కట్టిస్తామని తెలిపారు. 2 లక్షల రుణమా ఫీ కి కట్టుబడి ఉన్నామని, కేసీఆర్ కట్టె పట్టుకొని వేటాడుతాం అం టున్నారని, రేపటి నుండి మేమూ వెంటాడుతాం ఇక తట్టుకో చూస్తా మంటూ ద్వజమెత్తారు.
బిడ్డ కెసి ఆర్ నిన్ను నీ పార్టీని మూడు నెల ల్లో బొంద పెడతామని, కెసిఆర్ పై ( kcr ) మంత్రి కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ వీర సైనికులే నీ పార్టీని పునాదులు లేకుండా చేస్తారని గుర్తుపెట్టుకో బిడ్డ అంటూ కెసిఆర్ కు హెచ్చరిక జారీ చేశారు. గత కొద్ది రోజులుగా నీ కొడుకు కెటిఆర్ ఇలాంటి మాటలే మాట్లాడుతుంటే బచ్చాగాడు రాజకీయాలు తెలియవని, పోనీలే అని ఊరుకున్నాం, ఇప్పుడు ను వ్వు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని మాట్లాడడం మూర్ఖ త్వానికి అర్థం పడుతుందన్నారు.
ఓ పాస్పోర్ట్ దొంగవు నువ్వు సీఎం కాగా లేనిది, కష్టపడి సీఎం పదవి ని అలంకరించిన రేవంత్ రెడ్డికి నీకు పోలిక అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి మొఖం చూపించలేక రెండు సార్లు అసెంబ్లీ సమావేశా లు అయితే సమావేశలకు రాని దొంగ వు నువ్వుని, మీకు నీ కొడుకు నీ అల్లుడికి తీహార్ జై లు కు వెళ్లడం ఖాయమని, కెసిఆర్ ను చూస్తే జాలేస్తుందని, బుద్ధి రాకపాయ కనీసం బిడ్డకు బెయిలు తెచ్చుకుని ఎందుకన్నా ప్రయత్నం చెయ్ ఈ పనికిరాని మాటలు ఎందుకు మా ట్లాడుతున్నావని మంత్రి అన్నారు.
మేం తలచుకుంటే 30 మంది ఎమ్మె ల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడో చేరేవారని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటును కూడా మీ పార్టీకి రాదని ఆయన ఛాలెంజ్ విసురుతూ కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 14 ఎంపీ సీట్లు రావడం ఖాయమని స్పష్టం చేశారు. జూన్ 5 తారీకు నుంచి ప్రభుత్వ పాలనపై దృష్టి పెడతామని ఆయన అన్నా రు.
ఈ విలేకరుల సమావేశంలో జెడ్పి టిసి వంగూరు లక్ష్మయ్య, పట్ట ణ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అం తకు ముందు ఆయన నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ని ఆకస్మికంగా తనిఖీ చేసి అభివృద్ధి పనులకు సంబంధించిన పలు సూచనలు చేశారు.