Praja Deveena
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 9:37 am Posted by : praja deveena

Minister Komatireddy VenkatReddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికీలక వ్యాఖ్య, సోదరభావం, ఐక్యమ త్యమే కలకాలం వర్ధిల్లుతుంది

Minister Komatireddy VenkatReddy : ప్రజా దీవెన, నల్లగొండ: రంజాన్ జ రుపుకుంటున్న ముస్లిం సోదర సో ద రీమణులకు రాష్ట్ర రోడ్లు భవనా ల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.మత కలహా లు లేకుండా సోదర భావంతో, ఐక్యతతో రంజాన్ పం డుగ ను జరుపుకోవాలని సూచిం చారు. రంజాన్ పండుగను పు రస్కరించుకొని శనివారం ఆయన నల్గొండ పట్టణంలోని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

పవిత్ర రంజాన్ మాసం సందర్భం గా గత 30 రోజుల పాటు ముస్లిం లు కఠోర దీక్షలు, ప్రార్థనలు చేశారని ,క్రమశిక్షణ, దా తృత్వం, ధార్మిక చింతన కలయిక పవిత్ర రంజాన్ పర్వదినం అని అన్నారు. అల్లా వా రందరి జీవితాలలో వెలుగులు నిం పాలని మంత్రి ఆకాంక్షించారు.అల్లా ఆశీర్వాదంతో సుఖ సం తోషాలతో జీవించాలన్నారు.ముస్లిం సోదరులంతా రంజాన్ పండుగను కుటుంబ సభ్యులందరితో కలిసి భక్తిశ్రద్ధలతో ఆ నందోత్సవాల మధ్య జరుపుకోవాలని తెలిపారు.

నల్లగొండ పట్టణంలోగత 30 సంవత్సరాలుగా హిందు , ము స్లింలు ఎలాంటి మత కలహాలు లేకుండా పండుగలు శాం తియుతంగా జరుపుకుంటున్నారని మంత్రి ఈ సంద ర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి అనేక ప థ కాలు అమలు చేస్తున్న దని, ఇటీ వల ప్రవేశపెట్టిన రాష్ట్ర బ డ్జెట్‌లో ముస్లింల సంక్షేమానికి రూ.3,500 కోట్లను కేటాయిం చినట్లు మంత్రి తెలిపారు. గతంలో వైయస్ రాజశేఖ ర్ రెడ్డి హయాంలో ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాలలో 4 శాతం రి జర్వేషన్లు అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు.

రిజర్వేషన్ల వల్ల ముస్లింలు వివిధ రంగాల్లో అభివృద్ధి సాధి స్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జి ల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్, రెవి న్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థా నిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి ,ఏ ఎస్ పి రమేష్. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆఫీజ్ ఖాన్ ,తహ సిల్దార్ ప రుశురాములు, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, మున్సిపల్ కార్పొరేష న్ కమిషనర్ బి. శరత్ చంద్ర మా ర్కె ట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ , మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మామిడి కార్తీక్, సుభాష్, నవీన్ గౌడ్ అధికారు లు, మైనార్టీ నాయ కులు ,ముస్లిం సోదరులు పాల్గొన్నారు.