Praja Deveena
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 2:47 pm Posted by : praja deveena

Minister komatireddy venkatreddy: బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ప్రజలకు తీ పికబురు, NH-565 అభివృద్ధికి ప చ్చజెండా 

Minister komatireddy venkatreddy : ప్రజా దీవెన, న ల్లగొండ: నల్లగొండ నగర ప్ర జలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబు రు అందించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నల్లగొం డ నగర ప్రజలకు శుభవార్త అందింది. నక్రేకల్–నాగార్జున సాగర్ జాతీయ రహదారి (NH-565) అభివృద్ధి పనులకు కేంద్రప్రభుత్వం రూ.14.45 కోట్ల నిధులను ఆమోదించింది. దీంతో 2025–26 వార్షిక ప్రణాళికలో భాగంగా ఈ ప్రాజెక్టు అమలుకానుంది.

నల్లగొండ జిల్లా కేంద్రంలో సూర్యాపేట మార్గంలోని పానగల్ అద్దంకి బైపాస్ రోడ్డులోని ఇందిరాగాంధీ వి గ్రహం నుంచి డీ ఈఓ కార్యాలయం వరకు సుమారు కిలోమీటర్ 20.3 00 నుంచి 23.730 వరకు రహదారి విస్తరణ మెరుగుదల చేప ట్టేందుకు రోడ్డు ఉపరితలాన్ని బ్లాక్ టాపింగ్ ద్వారా బలో పే తం చేయనున్నారు.

ఇందుకు సంబంధించి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి త్వ శాఖ అన్ని పరిపాలనా సాంకే తిక, ఆర్థిక అను మతులను ఇప్పటికే మంజూరు చేసింది. తెలంగాణ ఆర్& బీ శాఖ పంపిన ప్రతిపాదన కు ఎటువంటి మార్పులు లేకుం డా పూర్తి ఆమోదం లభించడం విశేషం.

ఇదిలా ఉంటే ఈ రహదారి విస్తర ణ ప్రయాణం సులభం కా దని గతానుభవాలు తెలియజేస్తున్నాయి. గతంలో రోడ్డు వి స్తరణకు ప్రయత్నాలు చేపట్టినప్పుడు, రహదారి పక్కన ఉ న్న షాపులు, గృహాలు ప్రభావితమవుతాయనే ఆందోళనతో వ్యాపారులు, స్థానికులు నిరసన లు చేపట్టిన విషయం తె లిసిందే. ఆ సమయంలోనే కొందరు కోర్టును ఆశ్రయించ డం తో పనులు నిలిచిపోయాయి కూడా.

తాజాగా రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో రహదారిని బైపాస్ మార్గంలో మార్చే నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంతో పలు మార్లు చర్చలు జరిపిన తర్వాతే ఈ ప్రాజెక్టుకు నిధులు మం జూరు కావడం జరుగగా ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు సందర్భాల్లో బహిరంగంగా వెల్లడించిన వి షయం విదితమే. కాగా ఈ సందర్భంగా న ల్లగొండ నగర మే యర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మంత్రి కోమటిరెడ్డికి కృతజ్ఞ తలు తెలిపారు.స్మార్ట్ సిటీ అభి వృద్ధి భాగంగా ఈ రహ దా రి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

అయితే ఇప్పటికే ఆలస్యమైన ఈ ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తి అ వుతుందా, నగర ట్రాఫిక్ సమస్య లకు ఎంతవరకు ఉపశమనం కలి గిస్తుందో వేచిచూడాల్సి ఉంది. ఏది ఏమై నా తాజా పరిణామాలతో ప్ర నల్లగొండ నగర నడిమధ్య గుం డా వెళ్ళే ప్రధాన రహదారి విస్తరణకు రంగం సిద్ధం కావడం తో నగర ప్రజల్లో కొత్త ఆశలు మళ్లీ చిగురించాయని చర్చ అ ప్పుడే జోరుగా సాగుతోంది.