Minister Komatireddy venkatreddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికీలక వ్యాఖ్య, బిజెపి నాయకులు బస్సు యాత్ర కాదు,ఢిల్లీకి పాదయాత్ర చే యాలి
-- నేను ఎట్ల తిరిగినా అది నల్లగొండ అభివృద్ధి కోసమే --రూ.13,600 కోట్లతో హైబ్రిడ్ హాన్వివీటి మోడల్ రోడ్డు --ఎస్ఎల్ బిసి సొరంగం పూర్తయితేనే రెండు పంటలకు నీళ్లు --రూ.450 కోట్లతో ఎస్ ఎల్ బిసి కాలువల లైనింగ్ పనులు --బిఆర్ఎస్ హయాంలో ఎంజీ యూ, ఎస్ఎల్ బిసిని పూర్తిగా విస్మరించారు -- రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Minister Komatireddy venkatreddy: ప్రజా దీవెన, న ల్లగొండ: చదువుతోనే అభివృద్ధి సా ధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శా ఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. కనగల్ మండల కేంద్రం లోని రూ.6 కోట్ల వ్య యంతో నూత నంగా నిర్మిస్తున్న ప్రభు త్వ జూనియర్ కళా శాల నిర్మాణ పనులను మంత్రి కోమ టి రెడ్డి ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.ఈ సంద ర్భం గా నిర్మాణ పనుల పు రోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల ను నాణ్యత ప్రమాణాలకు అనుగుణం గా వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు అందు బాటులోకి తీసుకురావాల ని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ ప్రభుత్వ విద్యను బ లోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా సౌ కర్యాలు కల్పించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్య మౌలిక వ సతుల అభివృద్ధికి ప్రాధాన్యతని స్తుందని పేర్కొన్నారు. చదువును పేదవారికి దగ్గరగా తీసు కురావాల నే ఉద్దేశంతో తిప్పర్తి, కనగల్ మండల కేంద్రాలలో ప్రభుత్వ జూని యర్ కళాశాలలను ఏర్పాటు చేయడం జరి గిందని తెలిపారు.
కళాశాల నిర్మాణ పనులు వేగవం తంగా జరుగుతున్నాయ న్నారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న BRS ప్రభుత్వం వి ద్యను పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎన్నడూ కూడా ఎంజియూ నివ ర్సిటీలో కాలు కూడా పెట్ట లేద ని విమర్శించారు. నేను హెలి కాప్టర్ లో తిరిగినా కార్లో తిరిగినా బండిమీద తిరిగిన జిల్లా అభివృద్ధి కో సమేనని స్పష్టం చేశారు. వైయస్ రాజశేఖర్ రె డ్డి హయాంలో 300 ఎకరాలలో ఎంజి యూనివర్సిటీని ఏ ర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఎంజీ యూనివర్సిటీ రాష్ట్రంలోనే బెస్ట్ యూనివర్సిటీగా ఉందని పేర్కొన్నారు.
ఎంజీ యూనివర్సిటీలో ఫార్మసీ, డి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, బీ. ఫా ర్మ సీ,ఎల్ఎల్బి కోర్సులు ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటు లోకి వస్తాయన్నారు. 80 శాతం వరకు ఎస్ఎ ల్బీసీ సొరంగ పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. సొ రం గం పనులు పూర్తయితేనే రెం డు పంటలకు నీళ్లు అందుతా యని తెలిపారు. గత బి ఆర్ ఎస్ ప్రభు త్వం ఎస్ఎల్బీసీని పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు చేపట్టగా దురదృష్టవశాత్తు సోరంగం కూలి ఎనిమిది మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.నూతన టె క్నాలజీ తో కిలోమీటర్ వరకు సొ రంగం పనులను పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులను కచ్చి తంగా పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. రూ 13,600 కోట్లతో ధర్వే శిపురం నుంచి కనగల్ -గుర్రంపొడు దేవరకొం డ మీదుగా దిండి వర కు హైబ్రిడ్ హన్వినిటీ మోడల్ తో రో డ్డు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఆర్ అండ్ బి శాఖ ఆ ధ్వర్యంలో ఇప్పటికే టెండర్లు పూ ర్తయ్యా అని తెలి పారు. వచ్చే నెల 13 లేదా 14 తేదీలలో కనగల్ -గు ర్రంపో డు మధ్య 100 ఎకరాల స్థ లంలో బహిరంగ సభ ఏర్పాటు చే సుకొని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పనులను ప్రా రంభించే దిశగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.
చివరిదశకు ధాన్యం కొనుగోళ్ళు
ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావచ్చా యని మంత్రి కోమటిరెడ్డి వెంకటరె డ్డి పేర్కొన్నారు.ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యే సమయంలో బిజెపి బస్సు యాత్ర చేయడం కాదు, ఢిల్లీకి పాదయాత్ర చేయాలని సూ చించారు.ఇప్పటికే కోట్లాది రూ పాయలతో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయ ని పేర్కొన్నారు. రూ. 450 కోట్లతో ఎస్ఎల్బీసీ కాలువ లైనిం గ్ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. మంత్రి వెం ట మాజీ జెడ్పిటిసిలు నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, చిట్ల వెంక టే శంగౌడ్, ఆర్టిఏ డైరెక్టర్ కుసుకుంట్ల రాజి రెడ్డి, మాజీ మా ర్కె ట్ కమిటీ చైర్మన్ బిక్షం యాదవ్, ధర్వేశిపురం రేణుక ఎ ల్ల మ్మ దేవాలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, స్థానిక సర్పంచ్ నర్సింగ్ మురళీధర్, గోలి నర్సిరెడ్డి, సర్పంచులు,స్థానిక నా యకులు కృష్ణయ్య, అందుగుల వెంకటే ష్, పెంటయ్య, చం ద్రయ్య, ఆఫీ జుద్దీన్, సింగం పెద్దలు, ఎడ్ల గణేష్, వంపు జాన య్య, రాములు, పోచమల్ల సురేష్ , తదితర కాంగ్రెస్ తదిత రులు పాల్గొన్నారు.





