Praja Deveena
Newspaper Banner
Date of Publish : 25 December 2025, 3:10 pm Posted by : praja deveena

Minister Komatireddy Venkatreddy : గ్రామీణప్రాంతాల్లో ప్రథమచికిత్స అందించడంలో ఆర్ఎంపీల పాత్ర కీలకo

 

Minister Komatireddy Venkatreddy: ప్రజా దీవెన, నల్లగొండ : గ్రామీణ స్థాయిలో ప్రథమ చికిత్స అందించడంలో ఆ ర్ఎంపీల పాత్ర కీలకమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో శుశ్రుత గ్రామీణ వైద్య సంఘం భవన వద్ద రాష్ట్ర, జిల్లా గౌరవ అధ్యక్షుడు పో నుగంటి హనుమంతరావు అధ్యక్ష తన నిర్వహించిన19వ వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

గ్రామీణ స్థాయిలో ఆర్ఎంపీలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నా ర ని వారికి ప్రభుత్వపరంగా ఆదుకుం టామన్నారు. ప్రధమ చికిత్స చేయ డంలో ఆర్ఎంపి వైద్యుల సేవలు చాలా అభినందనీయమని తెలిపా రు. గ్రామస్థాయిలో రోగులకు ప్రధమ చికిత్స చేయడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవల గురించి వారికి అవగా హ న కల్పించి వైద్య సేవలు వినియోగించుకునే విధంగా వారికి అవ గాహన కల్పించాలన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో ఎన్నో అభివృద్ధి కా ర్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల ఉన్న త చదువుల కోసం పేద విద్యా ర్థులకు ఆర్థిక సాయం అంది స్తూ ప్రోత్సహిస్తున్నానని తెలిపారు.

మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఆర్ఎంపీలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నా రని ప్ర భుత్వం వారిని గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి,సుశ్రుత గ్రామీణ వై ద్యుల సంఘం జిల్లా అధ్యక్షులు, వ్యవస్థాపకులు బొల్లెపల్లి శ్రీనివాస రాజు, రాష్ట్ర అధ్య క్షులు నేతి రాజేశ్వరరావు, విజ్ఞానదర్శిని వ్యవస్థా పకులు రమేష్, సిపిఎం రైతు సం గం నాయకులు భాస్కర్ రెడ్డి,స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ కెమిస్ట్రీ, డ్ర గ్జిస్ట్ అసోసియేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు పరమాత్మ, గోవర్ధన్ అ శోక్ సత్యనారాయణ చారి, కందికట్ల లక్ష్మ య్య గౌడ్, వివిధ ప్రాంతాల ఆర్ఎంపీలు తదితరులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మంత్రితో పాటు పలువురిని సాల్వలతో సన్మానిం చారు.