Minister Komatireddy VenkatReddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకవ్యాఖ్య, రాబోయే రోజుల్లో ప్రతి నీటిబొట్టు బంగారంతో సమానం

Minister Komatireddy VenkatReddy : ప్రజా దీవెన, నల్లగొండ: వాతావ రణ మార్పులు, ఎల్ నినో (El Ni ño) సవాళ్లు రాబోయే రోజుల్లో తీవ్రరూపం దాల్చనున్నాయనే సంకేతాల నేపథ్యంలో నల్గొండ జిల్లా యంత్రాంగం భవిష్య త్తు నీ టి భద్రతపై యుద్ధప్రాతిపదికన సన్నాహాలు ప్రారంభిం చింది. భవి ష్యత్ జల సంక్షోభాన్ని ముందే ఊహించి, దాన్ని అధిగమించే ల క్ష్యంతో కలెక్టర్ కార్యాలయంలో నేడు ‘జిల్లా నీటి పారుదల సల హామండలి’ కీలక సమావేశం జరి గింది. ఈ సమావేశానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమా టోగ్రఫీ శాఖల మంత్రికోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథి గా హాజరై జిల్లాలో నీటి నిల్వలు, భూగర్భ జలాల పునరు ద్ధరణపై దిశానిర్దేశం చేశారు.
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత వర్షపా తం, భూగర్భ జల మట్టాల క్షీణ తను అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించా రు. కేవలం నివేదికలకే పరిమితం కాకుండా అధి కారులు స్వయం గా క్షేత్రస్థాయిలోకి వెళ్లి వర్షపాత పరిస్థితు లను ప్రత్యక్షంగా పరిశీ లించాలని మంత్రి ఆదేశించారు.

ఇంకుడుగుంత ఉంటేనే ఇంటిపర్మిషన్
జిల్లాలోని పట్టణాల్లో భూగర్భ జలాలు అట్టడుగుకు పడిపో కుండా మున్సిపాలిటీ పరిధిలో కొత్త గా కట్టే ప్రతి ఇంటికీ ‘ఇంకుడు గుంత’ (Rainwater Harvest ivng Pit) నిబంధ నను ఇకపై అ త్యంత కఠినంగా అమలు చేయనున్నారు. ఇంకుడు గుంత ఉంటేనే ఇంటిపర్మిషన్ జారీ అయ్యేలా చ ర్యలు తీసుకోవాలన్నారు.
భూగర్భ జల విప్లవం – ‘జలసిరి’
‘జలసిరి’ పథకం ద్వారా భూగ ర్భ జలాలను పునరుద్ధరిం చేందుకు అధికారులు సరికొత్త మా ర్గాలను అన్వేషించాలని పిలుపు నిచ్చారు.పడిన ప్రతి వాననీటి చుక్కనూ వడిసి ప ట్టేలా ప్రతి వ్య వసాయ క్షేత్రంలో ఫార్మ్ పాండ్స్ ఏర్పాటుపై ప్ర త్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
వాల్టా చట్టానికి పదును
చట్టవ్యతిరేకంగా భూగర్భ జలా లను తోడేయడం, ఇష్టారా జ్యం గా బోర్లు వేయడాన్ని నిరోధించేం దుకు WALTA (వా ల్టా) చట్టాన్ని మునుపెన్నడూ లేనంత పకడ్బం దీగా అమలు చేయాలని స్పష్టం చేశారు.రాబోయే రోజుల్లో ప్రతి నీటి బొ ట్టు బంగారంతో సమా న మని, పడిన ప్రతి వానచుక్కనూ ఒడిసిపట్టుకోవడమే మన ముం దున్న ఏకైక భవిష్యత్ మా ర్గమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. సమా వేశంలో జి ల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎంఎ ల్సీ శంకర్ నా యక్, నల్గొండ మే యర్ బుర్రి చైతన్య శ్రీనివాస రెడ్డి, డిప్యూ టీ మేయర్ ఆమీర్ అలీల తో పాటు పలువురు మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇరిగేష న్, రెవెన్యూ, వ్యవసాయ అను బంధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




