
Minister Komatireddy VenkatReddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొం డలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక లు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖ మం త్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జాతీ య జెండాను ఆవిష్కరించి ప్ర సంగించారు. స్వాతం త్ర్య సమ రయోధుల త్యాగాలను స్మరించుకుంటూ నల్లగొం డ చరిత్ర, తె లంగాణ ఉద్యమం, జిల్లాలో జరుగుతున్న అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. స్వా తంత్ర్యం అనేది కేవ లం ఒకరోజు జరుపుకునే పండు గ కా దని మంత్రి అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహ నీయులను స్మరించుకోవడం, దే శాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయడం, సమాజం పట్ల బాధ్యతగా వ్య వహరించడ మే నిజమైన స్వాతంత్ర్య స్ఫూర్తి అని పేర్కొన్నా రు.మహాత్మా గాం ధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభా య్ పటేల్, నేతాజీ సుభా ష్ చంద్రబోస్, డాక్టర్ బీఆర్ అం బేద్కర్, భగత్‌సింగ్ తదితరుల త్యాగాల ఫలితంగానే దేశా నికి స్వాతంత్ర్యం లభించిందని గుర్తు చేశారు.
పోరాటాల గడ్డ.. నల్లగొండ
నల్లగొండకు స్వాతంత్ర్య ఉద్య మం, తెలంగాణ సాయుధ పోరా టంలో ప్రత్యేకమైన చరిత్ర ఉంద ని మంత్రి అన్నారు. చాకలి ఐల మ్మ, రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రా రెడ్డి, ఆరుట్ల కమ లాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం వంటి పోరా ట యోధుల త్యాగా లను స్మరించారు.నల్లగొండ అంటే పో రాటం.. నల్లగొండ అంటే త్యాగం.. నల్లగొండ అంటే తిరు గు బాటు.. నల్లగొండ అంటే ఆత్మ గౌరవం” అంటూ జిల్లాపై తన అనుబంధాన్ని చాటుకున్నారు.
నల్లగొండ నా ఊపిరి…
జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు తన శక్తి వంచన లేకుండా పనిచేస్తానని మంత్రి హా మీ ఇచ్చారు. నల్ల గొండ నీటి స మస్యలను పరిష్కరించడంతో పాటు జిల్లాను అభివృద్ధిలో అగ్ర భాగంలో నిలబెట్టడమే తన లక్ష్యమన్నా రు.తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రిపదవిని త్య జిం చి పోరాటంలోకి వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకు న్నారు.“అధికారం శాశ్వతం కాదు.. ప్రజల కోసం చేసిన పో రాటం, త్యాగమే చరిత్రలో శాశ్వతం” అని అన్నారు.
సంక్షేమానికి భారీ బలం
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు రుణమాఫీ, రైతు భరో సా, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇం డ్లు, గృహజ్యోతి, ఉచి త సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ వంటి ప థ కాల ద్వారా ప్రజల కు ప్రయోజనం కల్పిస్తున్నామని తెలిపారు.స్వాతంత్ర్య ది నోత్సవ కానుకగా రాష్ట్రవ్యాప్తంగా 2.25 లక్షల కొత్త పింఛ న్లు, 5 లక్షల కుటుంబాలకు గ్యాస్ సబ్సిడీ, సుమారు 4 లక్ష ల కుటుంబాలకు ఉచిత విద్యుత్, 1.06 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించే కార్యక్ర మానికి శ్రీకారం చు ట్టినట్లు తెలిపారు.
రైతులకు అండగా ప్రభుత్వం
2026-27 వానాకాలం సీజన్‌కు నల్లగొండ జిల్లాలో 5,35,2 53 మంది రైతులకు రైతుభరోసా కిం ద రూ.715 కోట్లు ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి తెలిపారు. రై తుబీమా కిం ద ఇప్పటి వరకు మ రణించిన 1,143 మంది రైతులకు టుంబాలకు రూ.57.15 కోట్లు అందించినట్లు చెప్పారు. వ ర్షా భావ పరిస్థితుల నేపథ్యంలో వరి సాగును తగ్గించి కంది, పెసర, మినుము, జొన్న, నువ్వులు, అలసంద, ఆయిల్‌పా మ్, కూర గాయలు తదితర ప్రత్యామ్నాయ పంటలను సు మారు 44,50 0 ఎకరాల్లో సాగు చేయించేలా ప్రణాళిక రూ పొందించినట్లు వివరించారు.

నీటి కోసం భారీ ప్రణాళిక
నల్లగొండ నీటి సమస్యకు శాశ్వ త పరిష్కారం దిశగా ప్రభు త్వం అడుగులు వేస్తోందని మంత్రి తెలిపారు.AMR-SLBC ప్రాజెక్టు ద్వారా 30 TMCల కృష్ణా జలాల ను వినియోగించి 3 లక్షల ఎకరా లకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ ప్ర భావిత గ్రా మాలకు తాగునీరు అందించే లక్ష్యంతో పనులు కొన సాగు తున్నాయని చెప్పారు.44 కిలోమీటర్ల టన్నెల్‌లో ఇప్పటికే 35 కిలోమీటర్ల పనులు పూర్త య్యాయని, మిగిలిన 9 కిలో మీటర్ల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. బ్రాహ్మ ణవెల్లంల లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణ 90 శా తం పూర్తయిం దని, డిండి లిఫ్ట్ ఇ రిగేషన్, వివిధ లిఫ్ట్ పథకాలు, కా లువల లైనింగ్ పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు.
ప్రతి పేద కుటుంబానికీ ఇల్లు
ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నల్లగొండ జిల్లాలో మొదటి విడ తలో 17,873 ఇళ్లు మంజూరు కాగా, 15,408 ఇళ్ల ని ర్మాణాలు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 4,360 ఇళ్లు పూర్తై గృహప్రవేశాలు జరిగాయని, లబ్ధి దారులకు దశలవా రీగా రూ.415 కోట్లు చెల్లించినట్లు వెల్ల డించారు.రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున మంజూరు చేయ డంతో పాటు గుడిసెల్లో నివ సిస్తున్న నిరుపేదలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు.
మహిళల కోసం కొత్త అవకాశాలు
మహిళలను ఆర్థికంగా బలోపే తం చేయడమే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలను విస్తరిస్తున్నట్లు మంత్రి తెలిపారు.నల్లగొండలో రూ.2.5 కోట్లతో నీలగిరి మహిళా మార్ట్” నిర్మా ణానికి శంకుస్థాపన చేయనున్న ట్లు చెప్పారు. గంధంవారిగూడెం లో రూ.3.5 కోట్లతో మహిళా శక్తి పెట్రోల్ పంపు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.మహిళా శక్తి ద్వారా పె ట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, వ్యాపార అవకాశాలను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్న ట్లు వెల్లడించారు.

విద్యకు కొత్త రెక్కలు
నల్లగొండ జిల్లాలో విద్యా రంగాని కి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తు న్నట్లు మంత్రి చెప్పారు.ప్రతి నియోజక వర్గంలో రూ.200 కో ట్ల చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పా ఠశాలలు నిర్మించేందుకు 25 ఎకరాల భూమి కేటాయించి న ట్లు తెలిపారు. నల్ల గొండ, నక్రేకల్, నాగార్జునసాగర్, దేవర కొండ, మిర్యాలగూడ ని యోజకవర్గాల్లో పనులు కొనసా గు తున్నాయని చెప్పారు.జిల్లా కేంద్రంలో రూ.20 కోట్లతో NAC స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అందుబాటులోకి తెచ్చామని, ని ర్వహించిన మెగా జాబ్ మేళాలో 125 కంపెనీలు పాల్గొని 3,500 మంది నిరుద్యోగ యువత హాజ రయ్యారని తెలిపా రు. సుమారు 600 మందికి ప్రాథమికంగా ఉద్యోగ అవకాశా లు లభించాయని చెప్పారు. మహాత్మాగాంధీ యూ నివర్సి టీలో బీఫార్మసీ, లా కోర్సు లతో పాటు ఈ విద్యా సంవత్స రం నుంచి M.Ed, M.P.Ed కో ర్సులు అందుబాటులోకి వస్తు న్నాయని మంత్రి వెల్లడించారు.
రోడ్లకు మహర్దశ
బాట బాగుంటే.. బతుకు బా గుంటుంది” అంటూ రహదా రుల అభివృద్ధిపై మంత్రి ప్రత్యకంగా మాట్లాడారు.HAM వి ధానంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.13, 006 కోట్లకుపైగా అంచ నా వ్యయంతో 441 రహదారుల అభి వృద్ధి చేపట్టినట్లు తెలిపారు.నల్లగొండ జిల్లాలో ఫేజ్-1లో 53 2 కిలోమీటర్లకు పైగా రహదారు ల విస్తరణకు రూ.1,457 కోట్లకు పైగా మం జూరు చేసి పనులు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మర్రి గూడ బైపాస్ ఫ్లైఓవర్‌ను ఇ ప్పటి కే ప్రారంభించామని, గ్రామీణ ప్రాంతాలను పట్టణాలు, పరిశ్రమలతో అనుసంధా నించేలా రహదారుల అభివృద్ధి కొనసా గుతుందని తెలిపారు.
నల్లగొండకు 24 గంటల తాగునీరు లక్ష్యం
కొత్తగా ఏర్పడిన నల్లగొండ ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌ లిక వసతులను మరింత బలో పేతం చేస్తున్నట్లు మం త్రి తెలిపారు.నల్లగొండ ప్రజలకు 24 గంట ల తాగునీరు అం దించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఇందు కోసం రూ.8 3 కోట్ల వాటర్ ప్లాం ట్‌కు శంకుస్థాపన చేసినట్లు, పట్టణ తా గునీటి అవసరాల కోసం మరో రూ.300 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. ము న్సిపల్ కార్పొరేషన్ హోదా తో కేం ద్రం నుంచి వచ్చే నిధులను సమర్థవంతంగా విని యోగించి నల్లగొండను మరింత అభివృద్ధి చే స్తామని హామీ ఇచ్చారు.
వైద్య రంగంలో ఆధునిక సదుపాయాలు
మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి లో అదనంగా 100 పడ కల సామర్థ్యంతో నిర్మించిన భవనం పూర్తయిందని తెలిపా రు.నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆధునిక లాప్రో స్కోపీ యూనిట్ అందుబాటులోకి తెచ్చామని చె ప్పారు. నక్రేకల్ సామాజిక వైద్య శాలను 100 పడకల ఏరియా ఆ సుపత్రిగా అభివృద్ధి చేశామని, హాలియాలో 30 పడకల CH C పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.
పరిశ్రమలు.. ఉపాధికి కొత్తబాట
TS-iPASS ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరంలో 41 పరి శ్రమలకు అనుమతులు ఇప్పించడం ద్వారా రూ.388.40 కోట్ల పెట్టు బడులు, 1,402 మందికి ఉపాధి అవకాశాలు ఏ ర్పడుతున్నాయని మంత్రి తెలిపారు.T-PRIDE, T-I DEA పథకాల ద్వారా 332 పరిశ్ర మలు, సేవా యూనిట్లకు రూ.1 6.62 కోట్ల పెట్టుబడి రాయితీలు మంజూరు చేసినట్లు చె ప్పారు.
విద్యుత్ ఉత్పత్తిలో కీలక ముందడుగు
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో నాలుగు యూనిట్ల నిర్మా ణం పూ ర్తై వాణిజ్య విద్యుత్ ఉత్పత్తి ప్రా రంభమైందని మంత్రి తెలిపారు.రోజుకు సుమారు 76.8 మిలి యన్ యూ నిట్ల విద్యుత్ ఉత్ప త్తి జరుగుతోందని, మిగిలిన ఒక యూని ట్ నిర్మాణాన్ని ఆగస్టు నె లాఖరులోగా పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
భవిష్యత్తు నల్లగొండపై ఫోకస్
స్వాతంత్ర్య పోరాట చరిత్రకు నిలయమైన నల్లగొండను ఇక పై అభివృద్ధికి కూడా ఆదర్శంగా నిలబెట్టాలని లక్ష్యంగా పె ట్టుకు న్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంక ట్‌రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, డ్రైన్లు నిర్మిం చడం కాదు.. పే దవాడి ఇంట్లో సంతోషం ఉండాలి. ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ పథకం అం దాలి. అదే నా లక్ష్యం” అని అ న్నారు. దేశానికి స్వాతంత్ర్యం అం దించిన మహనీయుల త్యాగాల ను స్ఫూర్తిగా తీసుకుని.. తెలం గాణను మరింత అభివృద్ధి చేయ డం, భవిష్యత్ తరాలకు బలమై న భారతదేశాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలు పునిచ్చారు.





