Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister komatireddy venkatreddy : బిఆర్ఎస్ డిపాజిట్ల గల్లంతు

--కెసిఆర్ బస్సు కాదు మోకాళ్ళ యాత్ర కైనా దక్కేదే లేదు --భువనగిరి, నల్లగొండలలో ఆ పార్టీ ఉనికి కోసం ఆరాటమే --లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిలే దొరకదు --త్వరలో తండ్రీకొడుకులు కూడా జైలుకెళ్లడం ఖాయం --రాష్ట్రంలో బిజెపి,బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లింది --పదేళ్లు అధికారంలో ఉండి అభి వృద్ధి చేయలేనోళ్ళు ఇప్పుడేం చేస్తా రు --పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 15 స్థానాలలో గెలుపొందుతోంది --పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రా న్ని భ్రస్టుపట్టించిన బిఆర్ఎస్ --ఉమ్మడి నల్లగొండ జిల్లాను భ్రస్టు పట్టించిన సంస్కారహీనుడు జగదీ ష్ రెడ్డి --పార్లమెంట్ ఎన్నికల తర్వాత నల్లగొండలో అభివృద్ధి వేగవంతం -- నల్లగొండ మీడియా సమావేశం లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

బిఆర్ఎస్ డిపాజిట్ల గల్లంతు

–కెసిఆర్ బస్సు కాదు మోకాళ్ళ యాత్ర కైనా దక్కేదే లేదు
–భువనగిరి, నల్లగొండలలో ఆ పార్టీ ఉనికి కోసం ఆరాటమే
–లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిలే దొరకదు
–త్వరలో తండ్రీకొడుకులు కూడా జైలుకెళ్లడం ఖాయం
–రాష్ట్రంలో బిజెపి,బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లింది
–పదేళ్లు అధికారంలో ఉండి అభి వృద్ధి చేయలేనోళ్ళు ఇప్పుడేం చేస్తా రు
–పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 15 స్థానాలలో గెలుపొందుతోంది
–పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రా న్ని భ్రస్టుపట్టించిన బిఆర్ఎస్
–ఉమ్మడి నల్లగొండ జిల్లాను భ్రస్టు పట్టించిన సంస్కారహీనుడు జగదీ ష్ రెడ్డి
–పార్లమెంట్ ఎన్నికల తర్వాత నల్లగొండలో అభివృద్ధి వేగవంతం
— నల్లగొండ మీడియా సమావేశం లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర వ్యా ప్తంగా అసెంబ్లీ ఎన్నికలలో నన్ను గెలిపించిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీతో ర ఘువీర్ రెడ్డిని గెలిపించాలని రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. బిఆర్ఎస్ డిపాజిట్ల గల్లంతు కావడం ఖాయమని, కెసిఆర్ బస్సు కాదు కదా మోకాళ్ళ యాత్ర కైనా డిపాజిట్ లు దక్కేదే లేదని స్పష్టం చేశారు.

భువనగిరి, నల్లగొండల లో ఆ పార్టీ ఉనికి కోసం ఆరాటమే పడుతుం దని అన్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత కు బెయిలే దొరక దని త్వరలో తండ్రీకొడుకులు కూడా జైలుకెళ్లడం ఖాయమని జో స్యం చెప్పారు. మం గళవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు.

రాష్ట్రంలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీల కు కాలం చెల్లిందని, పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేనోళ్ళు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 15 స్థానాలలో గెలుపొం దుతోం దన్నా రు.సీఎం రేవంత్ రెడ్డితో తామంతా రాష్ట్ర అభివృద్ధి కోసం టీం వర్క్ గా పని చేస్తున్నామని తెలిపారు.

ఇటీవల నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రి ని సందర్శించి గర్భిణీలు, చిన్నపిల్ల లు ఉండే వార్డుకు ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా 32 ఏసీలు పెట్టించామని, ఎండ వేడితో వారంతా ఇబ్బందులు పడుతుoటే తట్టుకోలేకపోయానని గుర్తు చేశారు. త్వరలో సూర్యాపేట, ఖమ్మం ఆస్పత్రులను సందర్శించి అక్కడ కూడా ఎయిర్ కండిషన్లను ఏర్పా టు చేయిస్తానని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అన్ని ఐటిఐ లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పా టు చేస్తామని వివరించారు. బుధవారం జరిగే నల్లగొండ కాంగ్రెస్ అ భ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలో ని పార్టీ శ్రేణులు అంత పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శంకర్ నాయక్, మార్కెట్ ఛైర్మన్ జుకూరి రమేశ్, నల్లగొండ, తిప్పర్తి జడ్పిటిసి లు వంగూరి లక్ష్మయ్య, పాశం రాంరెడ్డి, నల్ల గొండ కాంగ్రెస్ పట్టణ అధ్య క్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,  మాజీ కనగల్ జడ్పీటీసీ  శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.