Minister komatireddy venkatreddy : విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
--విద్యావ్యవస్థ బలోపేతానికి రూ. 22 వేల కోట్లు --మెరుగైన గుణాత్మక విద్యా బోధ న అందించాలి --రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రాఫి శాఖమాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
–విద్యావ్యవస్థ బలోపేతానికి రూ. 22 వేల కోట్లు
–మెరుగైన గుణాత్మక విద్యా బోధ న అందించాలి
–రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రాఫి శాఖమాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రజా దీవెన, సూర్యాపేట: ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్యా నందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkatreddy) అన్నారు. శనివారం నూ తనకల్ జెడ్పి హైస్కూల్ లో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామ ల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు (Revolutionary changes) తెచ్చింద ని, ప్రతి పాఠశాలలో విద్యార్థు లకు గుణాత్మక విద్యానందించనున్న ట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతా నికి రూ. 22 వేల కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నా రు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 6 వేల పాఠశాలలు మూసివేయ డం జరిగిందని అన్నారు. దశల వారిగా రూ. 600 కోట్లతో అన్ని పా ఠశాలను మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. రాష్ట్రంలో అభ య హస్తం లో ఉన్న అన్ని పథకాలు అర్హులందరికీ అందిస్తామ ని అలాగే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ (Farmer loan waiv er) ఆగస్టు 15 నాటికి చెల్లిస్తామని స్పష్టం చేశారు.
పేదల సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమని కార్పోరేట్ స్థాయిలో విద్యార్థు లకు నాణ్యమైన ఉచిత విద్య అందించి పిల్లలకు బంగారు భవిష్య త్ కల్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లను నియోజక వర్గా ల వారీగా పేదలైన అర్హుల కు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో పాత రోడ్లకు రూ. 75 కోట్లతో మరమ్మ తులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, అలా గే రెండు సంవత్స రాల్లో కొత్త రోడ్ల నిర్మాణం చెప్పట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
అదేవిదంగా ఈ ప్రాంతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లిఫ్టులు చేపట్టి వ్యవసాయ రంగానికి సాగునీరు అందించి ఈ ప్రాంత అభివృ ద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. నూతనకల్ పాఠశాల కు 10 కంప్యూ టర్లు అదేవిదంగా మరుగుదొడ్లు నిర్మాణానికి రూ. 10 లక్షలు అందించనున్నట్లు తెలిపారు.
భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ( mp chamala Kiran Kumar Reddy) మాట్లాడుతూ ఈ నియో జకవ ర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అలాగే విద్యకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వి ద్యార్థులకు ఇష్టత తో చదివేవి దంగా నాణ్యమైన విద్యానందించాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 536 అమ్మ ఆదర్శ పాఠశాలలో 336 గుర్తించిన పనులను పూర్తి చేయడం జరిగిందని అలాగే మిగిలిన పాఠశాలలో పనులు పురోగతిలో ఉన్నా యని అలాగే ప్రభుత్వ లక్ష్య దిశగా పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించామని అన్నారు.
బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకా లు ఈ సందర్బంగా అందచేశారు. ముందు గా విద్యార్థులు చేసిన నృత్యాలను ఎం.పి., జిల్లా కలెక్టర్ తో కలసి తిలకించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక, పి.డి. మధు సూదన రాజు, డి.ఈ. ఓ అశోక్, డి.పి.ఓ సురేష్ కుమార్, ఆర్ అండ్ బి ఈ ఈ భాస్కర్ రావు, dwo వెంకట రమణ, ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ కె. దామోదర్ రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.