Minister komatireddy venkatreddy : నల్లగొండ నవీకరణే నా లక్ష్యం
--ప్రతి పేదవాడికి అనుక్షణం అండగా ఉంటాను --నల్లగొండ పట్టణంలోని బీట్ మా ర్కెట్ వద్ద రూ. 3 కోట్లతో నిర్మించే 33/11కెవి సబ్ స్టేషన్ శంకుస్థాపన -రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ నవీకరణే నా లక్ష్యం
–ప్రతి పేదవాడికి అనుక్షణం అండగా ఉంటాను
–నల్లగొండ పట్టణంలోని బీట్ మా ర్కెట్ వద్ద రూ. 3 కోట్లతో నిర్మించే 33/11కెవి సబ్ స్టేషన్ శంకుస్థాపన
-రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రమైన నల్లగొండ ( na lgonda) పట్టణాన్ని పూర్తిస్థాయిలో నవీకరించడమే లక్ష్యంగా ముం దుకు సాగుతామని రాష్ట్ర రోడ్లు భవ నాలు సినిమాటో గ్రఫీ మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి( komatireddy venkatred dy) పునరుద్ధాటించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం త ర్వాత నల్లగొండ జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేం దుకు సాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సోమవారం నల్లగొండ పట్టణంలోని బీట్ మార్కెట్ వద్ద రూ. 3 కోట్ల తో నిర్మిం చే 33/11కెవి సబ్ స్టేషన్ నిర్మాణా నికి శంకుస్థాపన ( fo undstion stone) చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. నూతనంగా నిర్మిస్తు న్న సబ్ స్టేషన్ వల్ల 15 వేల కుటుం బాల వరకు లోవోల్టేజి సమస్యను అధి గమిoచి ఉపశమనం పొందుతాయని పేర్కొన్నారు.
రాబో యే రెండు మాసాల్లోనే సబ్ స్టేషన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని విద్యుత్ శాఖ ఇంజనీర్లు, కాంట్రాక్టర్ లను ఆదేశించారు. నాణ్యమైన కేబుల్ తో పాటు, ఫెన్సింగ్ వేయా లని, 24 గంటలు సెక్యూరిటీ గార్డ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. 2004లోనే నల్లగొండ జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంతో పాటు పూర్తిస్థాయిలో సిసి రోడ్లు (cc roads) వేయడం జరిగిందని గుర్తు చేశారు.
నుడాలో నూతనంగా కల్పిన గ్రామా లకు సాగునీటి వ్యవస్థ పునరు ద్ధర ణ కోసం రూ. 200 కోట్ల కేటాయిం చామని, రూ. 90 కోట్లతో నీలగిరి సాంస్కృతిక నిలయాన్ని నిర్మిస్తు న్నామని తెలిపారు. అవ సరానికి సరిపోయే భూమి ఇస్తే మరో సబ్ స్టేషన్ ( sub station s) చేపడతామని వెల్లడించారు. పట్టణంలో టి హబ్ తో పాటు కలెక్ట రేట్ వద్ద మరో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను కడుతున్నామని చె ప్పారు.
రాబోయే రోజుల్లో ఇబ్బందులు లేకుండా మరో మూడు సబ్ స్టేషన్ ల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యుత్ ( electricity) అధి కారులు ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఎక్కడైనా అవసరమైన ప్రాం తాల్లో అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమ ని ప్రక టించారు.
నల్గొండ పట్టణంలో తాగునీటి సమస్యను అధికమించేం దుకు 10 ఎం ఎల్ డి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి రూ. 30 కోట్ల మంజూరు చేశామని, అదేవిధంగా రూ. 700 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు (orr) నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ఔట ర్ రింగ్ రోడ్డు నిర్మా ణంలో ఎవరికీ నష్టం చేయబోమని,మార్కెట్ ధర కన్నా ఎక్కువ నష్ట పరిహారం ఇప్పి స్తామని స్పష్టం చేశారు.ఎస్ ఎల్ బి సి వద్ద అన్ని వసతులతో మల్టీ పర్పస్ హాస్టల్ (multi purpose hostel) ను నిర్మించబో తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని, ప్రభుత్వ స్థలంలో ( governm ent lands ) అక్రమంగా ఎ లాంటి నిర్మా ణాలు చేపట్టిన తీసి వేయాలని సంబంధిత అధికారు లకు ఆదేశాలు జారీ చేశారు. నల్ల గొండ పట్టణాన్ని మోడల్ గా తీర్చి దిద్దుతామని, సబ్ స్టేషన్ లు అ న్ని పూర్తి చేసి ఆరు నెలల్లో లో ఓల్టే జీ సమస్యను అధిగమించేం దుకు అధికారులు నిరంతరం పనిచే యాలని కోరారు.
ఎస్ ఎల్ బి సి సొరంగ మార్గం పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ముం దుకు సాగు తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్, ట్రాన్స్ కో ఎస్ ఈచంద్రమోహన్, ఆర్డిఓ రవి తదితరులు ఉన్నారు.
Minister komatireddy venkatreddy