Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister komatireddy venkatreddy drinking water : తాగునీటి ఎద్దడి నివారణకు పగడ్బందీ చర్యలు

--సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలి --రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తాగునీటి ఎద్దడి నివారణకు పగడ్బందీ చర్యలు

–సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలి
–రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ప్రజా దీవెన/ నల్లగొండ: వేసవిలో నల్గొండ పట్టణముతో పాటు జిల్లా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు  పడకుండా ప్రణాళిక ప్రకారం అంద రికీ తాగునీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మి షన్ భగీరథ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నల్ల గొండ సమీపంలోని పానగల్ లో ఉన్న 19.6  ఎం ఎల్ డి నీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించి వాటర్ ట్రీట్మెంట్ పనులను,తాగు నీటి సరఫరా ను,పానగల్ నీటి శుద్ది కేంద్రం ద్వారా సరఫరా చేస్తున్న తాగునీటి కె పాసిటీ, గ్రామాలు, నల్లగొండ మున్సిపాలిటీ తో పాటు, ఇతర గ్రామా లకు నీటి సరఫరాను మిషన్ భగీరథ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, ప్రజారో గ్య శాఖ అధికారులతో అడిగి తెలుసుకున్నారు.

ఈ సంవత్సరం వేసవిలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవ కాశం ఉందని, అందువల్ల ఉన్న నీటితో ప్రజలందరికీ సక్రమంగా  తా గు నీటిని సరఫరా చేసేందుకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగాఉంటూ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. జి.ఎడవల్లి, తెలకంటి గూడెం నీటి శుద్ధి కేంద్రా లను పునరుద్ధరికరించి వాటి ద్వారా కూడా తాగునీటిని గ్రామాలతో పాటు, చండూరు మున్సిపాలిటీకి సరఫరా చేసే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర తాగునీటి సరఫరా ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డిని ఫోన్ ద్వారా ఆదేశించారు.

మం త్రి వెంట రెవిన్యూ అదనపు కలెక్టర్ జె  శ్రీనివాస్ ,ఆర్డిఓ రవికుమార్, మిషన్ భగీరథ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.


*ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం…* నల్లగొండ మున్సిపా లిటీని ఉత్తమ మున్సి పాలిటీగా తీర్చిదిద్దడంతో పాటు నల్గొండ ను అన్ని రకాలుగా అభి వృద్ధి చేసేందుకు కృషి చేస్తా మని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలోని నల్గొండ బైపాస్ రోడ్  వద్ద రూ.  55 కోట్ల వ్యయంతో  విలీన గ్రామాలలో నిర్మించనున్న సిసి రోడ్లు, మురుగు  కాల్వల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.

ఎన్జీ కాలేజీ వద్ద కోటి రూపాయల వ్యయంతో నిర్మించను న్న  హెల్త్ అండ్ హైజిన్ స్ట్రీట్ ఫుడ్ కోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. నల్ల గొండ జిల్లా అభివృద్ధికి అనేక పనులను చేపట్టినట్లు మంత్రి తెలిపా రు. మున్సిపాలిటీని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని స్ప ష్టం చేశారు. తాగునీరు, శానిటేష న్, గ్రీనరీపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నల్లగొండ పట్టణం తో పాటు చు ట్టు పక్కల 326 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నట్లు, నల్ల గొండ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

రూ. 600 కోట్లతో చేపట్టనున్న అవుటర్ రింగ్ రోడ్డు పనులకు వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నామని చెప్పారు. 6 లైన్ల  ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జ్ రహదారి పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని హోమి ఇచ్చారు. నల్లగొండ పట్టణ ప్రజలకు తాగునీరు, వినియోగించుకునే నీటికి ఇబ్బంది లేకుండా 10లక్షల లీటర్లు, 15 లక్షల లీటర్ల సామ ర్థ్యం కలిగిన 2 వాటర్ ట్యాంక్ లను చేపట్టామని, రూ. 20 కోట్లతో  నైపుణ్యాల అభివృద్ధి సంస్థను నిర్మిస్తున్నామన్నారు.

కోటి రూపాయ ల వ్యయంతో చేపట్టనున్న హెల్త్ అండ్ హైజిన్ ఫుడ్ స్ట్రీట్ పనులకు ఎన్జీ కళాశాల వద్ద మంత్రి శంకుస్థాపన చేశారు.హరే రామ హరే కృష్ణ సహకారంతో అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా నార్కె ట్ పల్లి లో 25 వేల మంది కూలీలు, విద్యార్థు లు, పని చేసుకునే వా రికి రూ. 5 రూపాయలకె  2వేల మందికి భోజనo భోజనం అందించే ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

రోడ్లు, డ్రైన్ల  పనుల నాణ్యత విషయంలో ఇంజనీరింగ్ అధికారులు రాజీపడొద్దు మంత్రి ఆదేశించారు.మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఖాళీలను భర్తీ చేస్తామని,ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాకు 12 వేల మంది హాజరుకాగా, 6వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, మే, జాన్ నెలలో మరో జాబ్ మేళాలను నిర్వహిస్తున్నామని మంత్రి వెల్ల డించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, రెవె న్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివా సరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, ఆర్ అండ్ బి ఎస్ ఈ రాజే శ్వర్ రెడ్డి ,ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
*అధికారులు సమన్వయంతో పనిచేయాలి…* ప్రజలకు తాగునీ టికి ఇబ్బందులు రాకుండా  3 నెలల పాటు మున్సిపల్, మిషన్  భగీ రథ,ట్రాన్స్కో అధికారులు, కౌన్సి లర్లు బాధ్యతగా పనిచేయాలని రా ష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని బుధవారం ఆయన నల్లగొండ మున్సిపాలిటీలో తాగు నీటి సరఫరా, విద్యుత్ సరఫరాలపై కౌన్సిలర్లు, అధికారుల తో సమావేశమయ్యారు. వర్షాలు లేక ఈ సంవత్స రం బోర్లన్ని ఎండిపోయాయని, 3 నెలలపాటు ఉ న్న నీటిని జాగ్రత్తగా వాడుకో వాల్సిన అవసరం ఉందన్నారు.

కర్ణా టకలో సైతం తాగు నీటికి తీవ్ర సమస్య ఉందని, బెంగళూరు పట్ట ణంలో  తగు నీటి సమస్య ఉందని, కర్ణాటక నుండి  తెలంగా ణకు తాగునీటిని తీసుకువచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యం లో త్వరలోనే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవనున్నట్లు  ఆయన తెలిపారు. ఈ పరిస్థితులలో మున్సిపల్ అధికారులు తాగునీటితో పాటు ,శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.  25 సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదని, అందువల్ల నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని అందరూ బాధ్యతగా పనిచేయా లని కోరారు.

తాగునీటి సరఫరా విషయంలో నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఎన్ని ట్యాంకర్లు కావాలన్నా తెప్పిస్తామని, అదే సమయంలో తాగు నీటిని వృధా చేయవద్దని, జాగ్రత్తగా వాడాలని, అవసరమైతే ముడి నీటిని కూడా సరఫరా చేస్తామ న్నారు. వేసవిలో విద్యుత్  సమస్య రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలు ఉన్నచోట తక్షణమే పరిష్కరిం చాలన్నారు.

విద్యుత్ లైన్లు మార్చాల్సిన చోట, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర మెటీ రియల్ అవసరమైతే బడ్జెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంద ని, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆయన విద్యు త్ అధికారులను ఆదేశించారు. పలు వురు కౌన్సిలర్లు మాట్లా డుతూ కొన్ని వార్డులలో  తాగునీటికి ఇబ్బందిగా ఉందని, పట్టణంలో రోజు మార్చి రోజు 20 నుండి 30 నిమిషాలు తాగు నీరు వస్తున్నదని, కొన్నిచోట్ల లీకేజీలు అవుతున్నా యని, వాటిని అరికట్టాలని కోరారు.

జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన మాట్లాడుతూ తాగునీటికి సమ స్యలు ఉంటే అవసరమైతే అదనపు ట్యాంకర్లను పంపించి తాగునీ టిని సరఫరా చేస్తామని, అయితే తాగునీటిని జాగ్రత్తగా వినియో గించుకోవాలని, ప్రత్యేకించి తాగునీటిని వృధా చేయవద్దని, తోటల కు,గార్డెన్ కు, ఇల్లు శుభ్రం చేసుకునెందుకు, ఇతర పనులకు తాగు నీటిని వాడవద్దని,వీటికి ముడి నీటిని సరఫరా చేస్తామని తెలిపా రు.

అంతకుముందు మిషన్ భగీరథ ఎస్ ఈ వెంకటేశ్వర్లు జిల్లాలో ప్రస్తుతం తాగునీటి సరఫరా పై వివరించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డిఆర్ఓ డి. రాజ్యలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, ట్రాన్స్కో ఏస్ ఈ చంద్రమోహన్, ఆర్డిఓ రవికుమార్ ,మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, కౌన్సిలర్లు తదితరులు  పాల్గొన్నారు.
*మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం…* మున్సిపల్ మహిళా కార్మికుల సమస్యలన్నింటిని సానుకూలంగా పరిష్కరిస్తా మని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం నల్గొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ మహిళా కార్మికులు ,మెప్మా ఆర్ పి ల తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  మున్సిపల్ కార్మికులకు ఏప్రిల్ 1 నుండి ప్రావిడెంట్ ఫండ్ అమలు చేయను న్నట్లు తెలిపారు.

ప్రభుత్వ పరంగా మహిళా కార్మికుల సమస్యలు న్నటిని పరిష్కరిం చేం దుకు కృషి చేస్తానని, కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుం డా ఆదుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతున్నదని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు పరిమితిని పెంచడం జరిగిందని, ఇల్లు లేని నిరుపేదలకు సొంత స్థలం ఉంటే  5 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నామని, నల్గొండ నియోజక వర్గంలో పదివేల ఇండ్లు నిర్మిస్తున్న ట్లు మంత్రి వెల్లడించారు.

నల్గొండ పట్టణంలో తాగునీటి ఇబ్బంది రాకుండా పట్టణంలోని 15 కాలనీలకు నీటి సరఫరా జరిగే విధంగా 2 కోట్ల రూపాయలతో పెద్ద పెద్ద ట్యాంకులను నిర్మిస్తున్నామని,  6 నెలల్లో వీటిని పూర్తి చేస్తామని, నల్గొండ పట్టణంలోని ప్రతి గల్లీలో సిమెంట్ రోడ్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలన్న ఉద్దేశంతో రానున్న  5 ఏళ్లలో లక్ష కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు  ఇవ్వను న్నామని తెలిపారు.

మహిళలలో ఉన్న నైపుణ్యాలను  బయటకు తీసేందుకు నల్గొండలో 20 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని నిర్మిస్తున్నా మని తెలిపారు .120 మంది మహిళలకు ఉచితంగా తాను కుట్టుమిషన్లు ఇస్తున్నానని  చెప్పారు. నెలకు 200 లేదా 300 మందికి టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి నల్గొండ పట్టణంలో మొత్తం 5000 మందికి కుట్టు మిషన్లు ఇచ్చి ఆర్థికంగా బాగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

జల్లా కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడుతూ మహి ళా కార్మికులు కనిపించకుండా శ్రమ చేసే వారని ,మహిళా దినోత్స వం సందర్భంగా వారిని గుర్తించి సమ్మేళనం ఏర్పాటు చేయ డం సంతోషమని అన్నా రు. మహి ళా దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం కనిపించకుం డా  పనిచేసే వారికి గుర్తింపు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిం దని తెలిపా రు .రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి కింద ఉచిత బస్సు సౌకర్యంతో పాటు, ఎల్పీజీ సౌకర్యం వంటివి ప్రవేశపెట్టడం జరిగింద ని ,వాటిని  సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

అనం తరం మంత్రి మహిళా కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ డిఆర్ఓ డి రాజ్యలక్ష్మి, నల్గొండ ఆర్డీవో రవికుమార్ ,మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి , మునిసిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ ,ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు