Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister komatireddy venkatreddy formers : అకాల వర్షాల బాధిత అన్నదాతలను ఆదుకుంటాం

--సన్న రకం ధాన్యం అధిక ధరకు కొనుగోళ్ల కు సత్వర చర్యలు --రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొంటాం --రైతు బందు వేసేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది --బిఆరెస్, బీజేపీలు ఓటమి భయం తోనే రైతు బంధును ఆపించాయి --రెండు లక్షలు రుణమాపి పంద్రా గస్టులోపు పూర్తి చేస్తాం --మూడు రోజులు మాత్రమే ప్రచార సమయం ఉన్నందున కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి --మీడియా సమావేశంలో రోడ్లు భవనాలు సినిమా మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి

అకాల వర్షాల బాధిత
అన్నదాతలను ఆదుకుంటాం

–సన్న రకం ధాన్యం అధిక ధరకు కొనుగోళ్ల కు సత్వర చర్యలు
–రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొంటాం
–రైతు బందు వేసేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది
–బిఆరెస్, బీజేపీలు ఓటమి భయం తోనే రైతు బంధును ఆపించాయి
–రెండు లక్షలు రుణమాపి పంద్రా గస్టులోపు పూర్తి చేస్తాం
–మూడు రోజులు మాత్రమే ప్రచార సమయం ఉన్నందున కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి
–మీడియా సమావేశంలో రోడ్లు భవనాలు సినిమా మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి

ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో అతలాకుతలమైన రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (ko matireddy venkatreddy)  హామీ ఇచ్చారు. ప్రధానంగా ఉ మ్మడి నల్లగొండ జిల్లాలో అకాల వర్షాల బాధిత అన్నదాతలను (for mers) ఆదు కుంటామని, సన్న రకం ధాన్యం అధిక ధరకు కొనుగో ళ్లకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యంను మద్దతు ధర కు కొంటామని ఉద్ఘాటించారు. నల్లగొండలో బుధవారం సాయంత్రం ఆయన ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతు బందు వేసేం దుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని, బిఆరెస్, బీజేపీలు ఓట మి భయం తోనే పక్కా ప్రణాళికతో రైతు బంధును ఆపించాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ( CM RevanthReddy )  నే తృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రెండు లక్షలు రుణమాఫీ పంద్రాగస్టులోపు పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు.

లోక్ సభ ఎన్నికలకు మూడు రోజులు మాత్ర మే ప్రచార సమయం మిగిలి ఉన్నందున కార్య కర్తలు కష్టపడి పనిచే యాలని సూచించా రు.నల్లగొండ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్ని కల్లో అత్యధిక మెజా ర్టీ వస్తుందని, జూన్ 5వ తేదీ నుండి అవినీతికి తావు లేకుండా అభి వృద్ధి జరుగు తుందని, కాంగ్రెస్ పాలనలో పోలీసు కేసులు, వేధింపు లు ఉండవని స్పష్టం చేశారు.

పంచాయితీ రాజ్ సమన్వయంతో రూ. 450 కోట్లతో నియోజక వర్గ అభివృద్ధి జరుగు తుందని, నల్లగొండ నడిబొడ్డున సకల హంగులతో హైదరాబాద్ శిల్పకాల వేదిక మాదిరి నిలగిరి నిలయం నిర్మిస్తానని హామీ ఇచ్చిన విధంగా త్వరలో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నా రు.

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలో 50 ఎక రాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కడుతున్నామని, మీడియా కొరకు ప్రత్యేకంగా ప్లాట్ లు, డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తామని పునరు ద్ఘాటించారు.డిసెంబర్ వరకు అన్ని చెరువులు నింపేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉందని, పెండింగ్ లో ఉన్నా మూసి, బ్రాహ్మణ వెళ్లెంల ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు.

ముస్లిం మైనార్టీల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని స్పష్టం చే శారు.మహాత్మా గాం ధీ యూనివర్సిటీ ని అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీ లతో అనుసం ధానం చేయడం ద్వారా జిల్లా ప్రజల కి పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. స్కిల్ డవ లప్ కోసం రూ. 20 కోట్లు కేటాయించామని చెప్పారు.
*ఓపికుంటే వచ్చేసారి పోటీ….* తనకు జీవితంలో రాబోయే రోజు ల్లో ఓపికంటూ ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని లేదంటే సమ ర్థవంతమైన మా నాయకులు ఎవరైనా పోటీలో ఉంటారని కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల గురించి ఎలా ఉన్నా ప్రతీక్ రెడ్డి పౌండేషన్ ఆధ్వర్యంలో విస్తృత సేవలు అందిస్తామని ప్రకటించారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అఖిలభారత కాంగ్రెస్ అధ్య క్షులు మల్లికార్జున ఖ ర్గే పర్యటన నకిరేకల్ నియోజక వర్గంలో ఉండే అవకాశం ఉందని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ 2013 లోచెప్పిన మాటలు ఒక్కటి కూడా అమలు కాలేదని, మళ్లీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.

జనధన్ ఖాతాల్లో రూ. 15 లక్షలు, రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యో గాలు ఇస్తామన్నా రని,జి ఎస్ టి పేరుతో దోచుకున్నారని, యువకు లకు మహిళలకు రూ. 8500 నెలకు ఇస్తామని చెప్పారు కదా ఏమైందని అడిగారు. బి ఆర్ ఎస్ పార్టీ అంటే బంద్ అయిన రాష్ట్ర సమితి పార్టీ అని, కెసిఆర్ గురించి వారి కుటుంబం గురించి తక్కు వ మాట్లాడితే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని పునరుద్ఘాటిం చారు. మీడియా సమావేశంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మో హన్ రెడ్డి తదితరులు పాల్గొ న్నారు.