Minister komatireddy venkatreddy high way roads : అధికారులూ అప్రమత్తత అవసరం
--భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల వల్ల ప్రజలకు ఇబ్బందులుపడొద్దు --రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
అధికారులూ
అప్రమత్తత అవసరం
–భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల వల్ల ప్రజలకు ఇబ్బందులుపడొద్దు
–రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్న దృ ష్ట్యా రాష్ట్ర రహదారుల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( minister komatireddy venkatreddy) అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివా లయం లో వర్షాలవల్ల దెబ్బతింటున్న రహదారుల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అత్యవసర సమావేశం నిర్వహించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.
టీఆర్ అండ్ బి సెక్రెటరీ విజయేందిరబోయి, ఈఎన్సీఐ గణపతిరెడ్డి, రీజినల్ ఆఫీసర్, ఎన్ ఐ హెచ్ ఎ ( Natio nal Highways au thority of India) రీజినల్ ఆఫీసర్ రజాక్ ఇతర ఉన్నతాధికారు లు పాల్గొన్న ఈ సమావేశంలో వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడ కుండా ముందస్తుగా తీసుకోవాల్సి న అత్యవసర చర్యపై చర్చించారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారు లపై నిత్యం జరుగు తున్న ప్రమాదాల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నందు న తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ రహదారిపై 17 బ్లాక్ స్పాట్స్ లను గుర్తించినందున వాటివద్ద తగు చర్యలు చేపట్టి ప్రమాదాలు అరికట్టాలని ఆధికారులకు మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.
అదేవిధంగా రాష్ట్రం లో ఉన్న ఇతర జాతీయ రహదారు ల నిర్మాణ పనుల స్థితిగతులపై NHAI (National Highways auth ority of India), రాష్ట్ర రాహదారుల శాఖ అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతిష్టా త్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు కు సంబంధించిన పనులను వేగవం తం చేయాలని అధికారుల ను కోరారు.
రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు ను కేంద్ర ప్రభుత్వం 2021 లో మంజూరీ చేసినప్పటికీ ఇప్పటికీ నిర్మాణం మొదలుకాకపోవడం వల్ల రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేక పో యిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో సగ భాగం ఆవరించి ఉండే రీజినల్ రింగ్ రోడ్డు లాంటి ప్రతిష్టాత్మకమైన నిర్మాణాల్లో ఎలాంటి అలసత్వం లేకుండా పని చేస్తే రాష్ట్రం అభివృద్ధి బాటపడు తుందని అన్నారు.
యుటిలిటీ ఛార్జీ లు చెల్లించమని గతప్రభుత్వం లేఖ రాసినందువల్ల ప్రాజెక్టు ఆగిపోయే ప్రమాదం ఏర్పడితే తాను, గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా 363.43 కోట్ల రూపాయల యు టిలిటీ ఛార్జీలను చెల్లిస్తా మని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితి న్ గడ్కరీ, ప్రధాని నరేంద్ర మోదీ కలిసి లేఖ ఇవ్వడంతో పాటు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివ రిస్తే, తామే ఛార్జీలను చెల్లిస్తామని గడ్కరీ ఆమోదం తెలిపారని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు.
రీజినల్ రింగ్ రోడ్డును NHAI (National Highways autho rity of India) ఉత్తర భాగానికి 161 కిలోమీటర్లు, దక్షిణ భాగా నికి 190 కిలోమీటర్లు మొత్తం గా 351 కిలోమీటర్లుగా మంజూరీ చేసింది. ప్రస్తుతం పనులు జరుగు తున్న ఉత్తర భాగం సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ గ్రామం (తిమ్మాపూర్) నుంచి ప్రారంభమయ్యి.. చౌటుప్పల్ వద్ద దక్షిణ భాగానికి కలుస్తుంది.
ఈ ఉత్తర భాగం నిర్మాణం కొరకు (6) ప్యాకెజీలుగా విభజించి భూసేకరణ చేస్తున్న ఈ ప్రక్రియలో ఇప్పటికే దాదాపు 70 శాతం భూసేకరణ పూర్తయ్యిందని, మిగితా 30 శాతం పురోగతిలో ఉందని మంత్రికి అధికారులు వివరించారు.
మిగిలిన ఈ 30 శాతంలో నర్సా పూర్ పరిధి లో అటవీశాఖకు సం బంధించిన అంశాలతో పాటు ఇత ర ప్రాంతాల్లో కొన్నిచోట్ల కోర్టు కేసు వివాదాలతో ఉన్న భూవివాదం కారణంగా భూసే కరణ ఆలస్యం జరి గిందని మంత్రికి వివరించారు.
హైదరాబాద్, విజ యవాడ(ఎన్.హెచ్ 65) జాతీయ రహదారిపై ఉన్న 17 బ్లాక్ స్పాట్స్ కారణంగా రోజు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. రోడ్లపై ఉన్న బ్లాక్ స్పా టను రిపేర్లు చేయాలంటే ప్రత్యా మ్నాయ రోడ్డు సదుపాయం కల్పిం చి ప్రయాణికులకు ఏలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేసి పను లు చేయాలని అధికారులను మం త్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదే శించారు.
బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో ఏదై నా పని చేసే విషయంలో లోటు పాట్లు ఉంటే స్పెషల్ సెక్రటరీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఒకవైపు మనుషుల ప్రాణాలు పోతుంటే అధికారిక అను మతుల పేరిట ఆలస్యం చేస్తే మరింత మంది ప్రాణాలు పోతా యని అన్నారు.
అంతేకాదు బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో ప్రమాద సూచీకల ఏర్పాటు, అతి వేగం కట్టడికి తీసుకోవ ల్సిన చర్యలు, అవసరం ఉన్నచోట ఆరులే న్లుగా రోడ్డు విస్తరణ, జంక్షన్ ల అభివృద్ధి, వెహికిల్ అండర్ పాస్ ల నిర్మాణం, రెండు వైపుల సర్వీస్ రోడ్ల ఏర్పాటు వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకుంటా మని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సమావేశంలో స్పెషల్ సెక్రెటరీ, టీఆర్&బి విజయేందిరబోయి, ఈఎన్సీ ఐ. గణపతిరెడ్డి, NHAI RO (రీజినల్ ఆఫీసర్) రజాక్, సూపరింటెండెంట్ ఇంజనీర్ ధర్మా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఈ.ఈ. పురు షోత్తం, ప్రాజెక్ట్ డైరెక్టర్, హైదరా బాద్, గజ్వేల్, మహబూబ్ నగర్, ఇతర ప్రాజెక్ట్ డైరెక్టర్లు పాల్గొన్నారు.