Opinionజాతీయంతెలంగాణనల్గొండహైదరాబాద్

Minister Komatireddy VenkatReddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, అన్ని రంగాల్లో జిల్లా సమగ్రాభివృద్ధికి నిరంతరతపన 

Minister Komatireddy VenkatReddy : ప్రజా దీవెన, నల్లగొండ: నీటిపారు దల, రహదారు లు, వ్యవసాయం ఇలా అన్ని రంగాలలో నల్గొండ జిల్లా ను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమాటోగ్రఫీ శా ఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తె లిపారు. రైతు సంక్షే మం ప్రధాన ధ్యేయంగా తమ ప్రభుత్వం రైతుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. బుధ వారం ఆయన న ల్గొండ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాల యం ఇందిరా భవ న్ లో జిల్లా అధికారులతో సాగునీటి ప్రా జెక్టులు, రహ దారు లు, ధాన్యం సేకరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

నల్గొండ జిల్లా అంతటికి సాగునీరు అందించి జిల్లాను సస్య శ్యామలం చేయడమే ధ్యేయమని, అందుకే ఏ ఎం ఆర్ పి కాలువల లైనింగ్, బ్రాహ్మణ వెళ్లెముల ,ఎస్ఎల్బీసీ సొరంగం వంటివి చేపట్టినట్లు తెలి పారు. బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు కింద పెండింగ్లో ఉన్న మైనర్లు, సబ్ మైనర్ల పై ఇరిగేషన్ అధి కారులతో సమీక్ష నిర్వహించారు. కాగా నార్కెట్ పల్లి మం డలం కొండపాకోని గూ డెంలో ఒక రైతుకు సంబంధించిన పొలంలో 40 మీటర్ల మేర కాలువ పనులు ఆగిపోయిన వి షయం అధికారులు మంత్రికి దిష్టికి తీసుకు రాగా , జిల్లా కలె క్టర్ నిదుల నుండి రైతుకు నష్టపరిహారం మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి అక్కడికక్కడే కలె క్టర్ ను ఆదేశించారు.

కొండపాకోనిగూడెం చెరువు నిండితే దోమలపల్లి చెరువు నిండుతుందని, తద్వారా ఇతర చెరువులు నింపుకునేందు కు అవకాశం ఉందని, మండలంలోని అన్ని గ్రామాలకు సా గునీరు అందుతుందన్నారు.

ధాన్యం సేకరణలో నల్గొండ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానం లో నిల వడం పట్ల ఆయన జిల్లా కలెక్టర్ ను అభినందిం చా రు. నల్గొండ జి ల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ధాన్యం పం డిందని, అయితే ప్రతి సీజన్లో రై తు లు వరినే పండించకుండా ప్ర త్యామ్నాయ పంటల వైపు దృ ష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు.పంట మార్పి డిపై అధికారులతో పాటు, మహిళా సంఘాలు అందరూ అవగాహన కల్పించాలన్నారు.

ఆర్ అండ్ బి రహదారులపై సమీక్ష సందర్భంగా నార్కెట్ ప ల్లి వద్ద ఆర్ ఓబి పనులు చేపట్టేందుకు తక్షణ మే చర్యలు చేపట్టాలని, మిగిలిపో యిన భూసేకరణకు సంబంధించి చెల్లింపులు చేసి పిఎన్ జారీ చేసేం దుకు చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు ఆదేశా లు జారీచేస్తూ పనులు వేగవంతం చేసేందుకు కలెక్టర్ వద్ద ఉన్న నిధులను వినియోగించుకోవాలని చెప్పారు.

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, ఆ ర్ అండ్ బి ఎస్ ఈ శ్రీధర్ రెడ్డి, పం చాయతీరాజ్ ఈఈ గిరిధర్ రెడ్డి, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి చ్చయ్య, పౌర సరఫరా ల డిఎం రామ్ పతి నాయక్, ఇతర అధికారులు ఉన్నారు.

ముస్లిం మైనార్టీలకు నాణ్యమైన విద్యకు కృషి 

నల్లగొండ : ప్రజా  ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ తో పాటు, నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తు న్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం అయన న ల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్క లో 44 లక్షల రూపా యల వ్యయంతో నిర్మించనున్న ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.నూతనంగా నిర్మించనున్న ఉర్దూ మీడియం ప్రైమరీ పాఠశాల నిర్మాణ ప నులు రేపటినుండి ప్రారంభమవుతాయని, అవసరమైతే కో టి రూపాయల వరకు ఖర్చు చేసి మంచి భవనాన్ని నిర్మిస్తా మని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం విద్యకు, వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని అన్నారు.

గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉర్దూను రెండవ భాషగా చే యడం జరిగిందని, సచార్ కమిటీ సిఫారసుల మేరకు ము స్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. విద్య, ఉద్యోగాలలో ముస్లింలకు రిజర్వే షన్లు కల్పిస్తున్నామని, రిజర్వేషన్ తో పాటు, నాణ్యమైన విద్యను అందించేందుకు తాను కృషి చేస్తున్నట్టు తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కంప్యూటర్ విద్యతో పాటు, ఏఐ శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతున్నదని, ఈ అవకాశాన్ని ముస్లిం మైనార్టీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అలాగే బొట్టు గూడా పాఠశాలలో సైతం చిన్న తరగతుల నుండే విద్యార్థులకు ఏఐ లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఉ ర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ ను కూడా బొట్టుగూడ పాఠ శాలలా తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు.ముస్లిం మై నార్టీలకు 10 కోట్ల రూపాయలతో షాదీఖానా నిర్మించను న్నామని,పట్టణ ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే కార్పొరేట ర్ల దృష్టికి తీసుకురావాలని, లేదంటే తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. పేద ముస్లిం మైనార్టీ లకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని, అలాగే ఎక్కడైనా స్థలం ఉంటే ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి తెలిపారు.

నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యంత ప్రాధానతనిస్తు న్నదని అన్నారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్య, వైద్యం నినాదంతో ముందుకు వెళ్తున్న ఆర్& బి శాఖ మంత్రి ఆదేశాల మేరకు పేద వారందరికీ నాణ్యమైన విద్య ను ,వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని, ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణాన్ని సాధ్యమైనం త త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

 


జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు ఆఫీస్ ఖాన్, జిల్లా వి ద్యాశాఖ అధికారి సుశీందర్రావు, మౌలానా సిద్ధికి, బషీర్, అ క్బర్ ఖాన్, తదితరులు ఉన్నారు.అనంతరం మంత్రి కలెక్టర్ కార్యాలయం వెనకవైపున ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు.చిన్న చిన్న మరమ్మతులన్ని పూర్తి చేసి జులై లో గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదే శించారు.

 

Related Articles

Back to top button