minister komatireddy venkatreddy on Pm modi: కులమతాల్లో చిచ్చుకు మోదీ కుట్రలు
--లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేనే మాకు ఏకైక లక్ష్యం --మోడీ మూడోసారి గెలిస్తే దేశంలో ఎన్నిక ఊసే ఉండదు --మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కులమతాల్లో చిచ్చుకు
మోదీ కుట్రలు
–లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేనే మాకు ఏకైక లక్ష్యం
–మోడీ మూడోసారి గెలిస్తే దేశంలో ఎన్నిక ఊసే ఉండదు
–మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మో దీ కుల మతాల మధ్య చిచ్చుపెట్టేం దుకు కుట్రలు పన్నుతున్నాడని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటో గ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరె డ్డి ఆరోపించారు. సార్వత్రిక ఎన్నిక్లలో తమ పదేళ్ల పాలన వైఫల్యాల ను చర్చకు రాకుండా బీజేపీ దేవుళ్లను ముందుకు పెడుతున్నారని విమర్శించారు.
నరేంద్ర మోడీ మూడో సారి ప్రధానిగా గెలిస్తే ఈ దేశంలో ఎన్నికల ఊసే లేకుండా చేస్తారని దుయ్యబట్టారు. బుధవారం సోమా జిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ఎ న్నికల ఊసే లేకుండా చేయడం ద్వారా దేశం మొత్తం బీజేపీ నాయ కుల ఆధీనంలోకి తీసుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరో పించారు.
లోక్ సభ ఎన్నికల్లో మా లక్ష్యం ఎన్డీయే కూటమి మాత్రమే అని ఉద్ఘా టిం చారు. ఓట్ల కోసం దేశంలో మతాల మధ్య మోడీ ఎందుకుచిచ్చు పెడుతున్నారని విమర్శించారు.దేశంలో 25 కోట్ల జనాభా ఉన్న ము స్లింలలో అనేక మంది దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని, అనేక మంది ముస్లింలు ఆర్మీలో ఉండి దేశం కోసం ప్రాణాలు విడిచిన వా రు ఉన్నారన్నారని వివరించారు.
ఓట్ల కోసం, అధికారం కోసం ఎందుకు వారిని ఇబ్బంది పెడుతున్నా రని ప్రశ్నించారు. 25 కోట్ల మంది ప్రజలు రోడ్లమీదకు వస్తే ఏం జరు గుతో తెలుసా అని ప్రశ్నించారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిం చాలన్నారు.తెలంగాణలో తమ లక్ష్యం 15 సీట్లు సాధించడం అని కనీసం 14 స్థానాల్లో జయకేతనం ఎగురవేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ ను ఎంత పెద్ద శిక్ష విధించిన తప్పులేదన్నారు. కాళేశ్వరం నుంచి లిక్కర్ వరకు అన్నింటిలో కేసీఆర్ కుటుంబం అవినీతికి పా ల్పడ్డారని ఆరోపించా రు. సంతోష్ రావు బినామీల పేరు తో టానిక్ వైన్ షాప్ పెట్టి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.