Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister komatireddy venkatreddy poor people : పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

--భద్రాధ్రి రామయ్య పాదాల సాక్షిగా రేపే ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం --ఎస్ఎల్బీసీ సొరంగo, డిండి ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి -- దేవరకొండ నియోజకవర్గ పర్యటనలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

–భద్రాధ్రి రామయ్య పాదాల సాక్షిగా రేపే ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం
–ఎస్ఎల్బీసీ సొరంగo, డిండి ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి
— దేవరకొండ నియోజకవర్గ పర్యటనలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ప్రజా దీవెన/ దేవరకొండ: పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యే యమని రాష్ట్ర రోడ్డు , భవనా లు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ( minister komatireddy venkat reddy) అన్నారు. ఆదివారం అయన నల్గొండ జిల్లా దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేశారు. ముందుగా మంత్రి దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి సాయిబాబా ఆలయానికి దర్శనానికి రాగా, ఆలయ చైర్మన్ మంచి కంటి ధనుంజయ్, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

మంత్రి సాయిబాబాను ( sai baba) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా ట్లాడుతూ భద్రాచలం రామయ్య పాదాల సాక్షిగా ఈనెల11న ఇంది రమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామన్నారు. పే దవారి కి ఆర్థిక సహా యం అందించడమే తమ ప్రభుత్వ ప్రధానధ్యే యమని, పేద వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి, మంత్రులందరూ 24 గంటలు కష్టప డి పని చేస్తున్నారని చెప్పారు.

ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం, డిండి ప్రాజెక్టులను 3 సంవత్సరాల్లో పూ ర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. దేవర కొండ ( Devarakonda) నియోజకవర్గంలో ఎక్కడ పంచాయతీ రోడ్డు ఉన్న దానిని రో డ్లు మరియు భవనాల రోడ్డుగా మార్చి ప్రతి తండాకు గ్రామానికి రోడ్లు వేయించే బాధ్యత తనదని అన్నారు.ఈ ప్రాంత అడవి బిడ్డలకు ఎం త చేసినా తక్కువేనని మంత్రి తెలిపారు.

చింతపల్లి మండల కేంద్రం లో 2 కిలోమీటర్ల మేర హైదరాబాద్ నాగా ర్జునసాగర్ రహదారిని నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో లైన్ నుండి ఫోర్ వే లైన్ గా వెడల్పు చేసి పటిష్టపరిచే పనులనిర్మాణానికి మంత్రి శంకుస్థాపన ( foundation stone) చేశారు. అనంతరం మంత్రి దేవరకొండ పట్టణం లో గుట్ట పైన వెలసిన నిర్మాణంలో ఉన్న శ్రీ గోదాదేవి సమేత వెంకటే శ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పనులను పరిశీలించారు.

ఆల య నిర్మాణ పనులు, జరుగుతున్న తీరును పరిశీలించారు. ప నుల నిర్మాణం, గుట్ట పైకి రహదారి, ఆలయ అభివృద్ధి కి సంబంధిం చిన విషయాలను ఆలయ కమిటీ మెంబర్లు మంత్రి దృష్టికి తీసుకు రాగా గుట్టపైకి రహదారి మంజూరుతో పాటు, ఆలయ అభివృద్ధికి నిధులు ఇస్తానని మంత్రి తెలిపారు.

ఆ తర్వాత మంత్రి డిండి క్రాస్ రోడ్ లో దేవరకొండ మండలం మైనం పల్లి నుండి డిండి క్రాస్ రోడ్ వరకు చేప ట్టనున్న రోడ్డు వెడల్పు మరి యు పటిష్టపరిచే 14 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశా రు. ఈ కార్యక్రమాలలో దేవ రకొండ శాస నసభ్యులు బాలునాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, రోడ్లు మరియు భవనాల శా ఖ ఎస్ ఈ రాజేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.