Minister komatireddy venkatreddy SlBC: ప్రజా దీ వెన నల్లగొండ: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ (SlBC) సొరంగ మార్గాన్ని 2028 జూన్ నాటికి పూ ర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరె డ్డి పునరుద్ఘాటించారు. ఆదివారం ఆయన నల్లగొండ మండ లంలోని రాములబండ గ్రామంలో శ్రీ సీతారామ చంద్ర స్వా మి రథోత్సవం, చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల ఆవిష్క రణ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీశైలం సొ రంగాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ప్రారంభించగా దుర దృష్టవశాత్తు టన్నెల్ కూలి 8 మంది మృతి చెందారని గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం రేవంత్ రెడ్డి చొరవతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి సహకా రంతో మళ్ళీ పనులు మొదలు పెట్టగా 18 మీటర్లు పూర్తైం దని వివరించారు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పూర్తి అయితేనే జిల్లాలో 4 లక్షల ఎక రాలకు సాగునీరు, ఫ్లోరైడ్ స మ స్యకు శాశ్వత పరిష్కా రం లభిస్తుందన్నారు. 2028 జూన్ నాటికి తప్పకుండా ఎ స్ఎల్బీసీని పూర్తి చేసి నల్గొండ జిల్లాను పూర్తిగా సస్య శ్యా మలం చేస్తానని స్పష్టం చేశా రు. ఆయన వెంట మాజీ ము న్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
