Minister Komatireddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొం డ జిల్లాలో భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో హెల్త్ ఎటిఎంల ను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య భద్రత కు ప్రభుత్వం కట్టు బడి ఉంటుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి హామీ ఇ చ్చారు.మంగళవారం జిల్లా ప్రభు త్వ కేంద్ర ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ వి భాగంలో అత్యాధునిక మిషన్స్ ను ప్రారంభించారు. రూ.30 లక్షల వ్యయంతో హెల్త్ ఎటిఎం, ప్రైమ్ టేర్ మిషన్, ఈసీజీ మిషన్ లను ప్రారంబిం చారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను సులభంగా, వేగంగా అం దిం చాలనే లక్ష్యంతో రూ.30 లక్షల వ్యయంతో ఏర్పా టు చేసిన హెల్త్ ఎటిఎం – ప్రైమ్ టేర్ మిషన్, ఈ సీజీ మి షన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ గ్రామ స్థాయి నుంచే ఆధునిక నిర్ధారణ సౌకర్యా లు అందుబాటులోకి రావడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజ లు ఖరీదైన ఆసుపత్రులకు వెళ్లకుండానే ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం కలుగుతుందన్నారు.
ఈ హెల్త్ ఎటిఎంలో ఈసీజీ, బీపీ, బ్లడ్ షుగర్, పల్స్, బాడీ టెంపరే చ ర్, ఆక్సిజన్ సాచ్యురేషన్ వంటి పరీక్షలు తక్కువ సమయంలో నిర్వ హించవచ్చని తెలిపారు. పరీక్షల ఫలి తాలు డిజిటల్ రూపంలో వెంటనే లభించడం వల్ల వైద్యులు సరైన చికిత్స సూచించేందుకు సౌలభ్యం కలుగుతుందని పే ర్కొన్నారు. గ్లూకోమియా కంటి పరీక్ష ఈ కంటి పరీక్షలు చే స్తారు కంటి విభాగంలో వచ్చే సమస్యలను రెట్టిన దెబ్బతిం దా లేదా తెలుసుకోవడానికి ఉప యోగిస్తారు.ప్రైమ్ టేర్ మి షన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సదు పాయాలు ప్రివెం టివ్ హెల్త్ కేర్ ను బలోపేతం చేస్తాయని, హృదయ సంబం ధిత వ్యాధులను ప్రా రంభ దశలోనే గుర్తించడంలో ఈసీ జీ మి షన్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి వివరించారు.
జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, రెవిన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీ నివాస్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప వర్, స్థానిక సం స్థల ఇంచార్జ్ కలెక్టర్ వై అశోక్ రెడ్డి, సూప రి డెంట్ నరసింహారావు, ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు, స్థానిక అధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
