Minister KomatiReddyVenkatreddy : ప్రజా దీవెన న ల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో 60 వేల కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రహ దారులను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలి పారు.బుధవారం ఆయన నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో పట్టణం లోని నాగార్జునసాగర్ ఎక్స్ రోడ్ నుండి దర్వేశిపురం ఎల్లమ్మ దేవా లయం వరకు మహబూబ్ నగర్ నుంచి నల్గొండ రహదారిని నాలు గులైన్ల రహదారి నిర్మాణం, సెంట్రల్ మీడియన్, సెంట్రల్ లైటింగ్ తో సహా నిర్మించేందుకు ఉద్దేశించి 50 కోట్ల రూపాయలతో చేపట్టిన ప నులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ వారంరోజుల్లో సాగర్ ఎక్స్ రోడ్ నుండి దర్వేషిపురం వరకు నిర్మించే నాలుగులైన్ల రహదారి పనుల ను ప్రారంభిస్తామని తెలిపారు. ధర్వేశిపురం వద్ద జరిగిన రోడ్డు ప్ర మాదాలను దృష్టిలో ఉంచుకొని దర్వేషిపురం వద్ద ఇదివరకే 12 కో ట్ల రూపాయలతో సీసీ రోడ్డుతో పాటు , సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ మీడియన్ కట్టించామని తెలిపారు. అలాగే కొత్త పల్లి ముషంపల్లి రహదారుల తో పాటు, జిల్లాలో అన్ని రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, అ న్ని గ్రామాలకు రోడ్లతో పాటు, మురుగు కాలువల ను నిర్మిస్తున్నామని, ఏఎంఆర్పి కాలువల లైనింగ్ కు 450 కోట్ల రూ పాయలు మంజూరు చేయించామని తెలిపారు.
నల్గొండ పట్టణంలో ప్రధాన రహదా రుల అభివృద్ధిలో భాగంగా సెం ట్రల్ మీడియన్,సెంట్రల్ లైటింగ్ ఏ ర్పాటు చేశామని, బైపాస్ రహ దారి చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఒ క్క రేషన్ కార్డు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత ఆరు గ్యారంటీల అమల్లో భాగం గా మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలే బస్సుల ను నిర్వహించుకునేలా బస్సులు ఏర్పాటు చేసామని, 5 లక్షల రూ పాయలతో ఒక్కొక్కరికి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని, రైతు భ రోసా, సన్నబియ్యం, సన్న ధాన్యం పండించిన రై తులకు 500 రూ పాయలు బోనస్ ఇస్తున్నా మని తెలిపారు. రాబోయే మూడేళ్ల లో ఇల్లు లేని పేదవారు ఉండకుండా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామ న్నా రు.
ప్రతి గ్రామంలో రేషన్ షాపు ఉండేలా చూసామని, తన నియోజకవ ర్గంలో 18 కొత్త రేషన్ షాపులు ఏ ర్పాటు చేశామన్నారు. పార్టీలకు అ తీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే మూడేళ్లలో గ్రామాల స్వరూపాలను మారుస్తా మని తెలిపారు. నల్గొండ పట్టణం లో దశలవారీగా ఇల్లు లేని వారంద రికీ ఇండ్లు కట్టిస్తామన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇవ్వడం జరిగిందని, నబిల్గొండ నియోజకవర్గంలో కనగల్, తిప్పర్తి, నల్గొండ మండలావి లలో మహిళల చేత రైస్ మిల్లుల నిర్వహణకు రైస్ మిల్లు కట్టించి ఇస్తామని, తద్వారా వారికి వచ్చే లాభాన్ని మహిళా సంఘాలు పం చుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు .ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో నల్గొండ పట్టణం లో నిర్మించిన బొట్టు గూడ ప్రభుత్వ పాఠ శాలను డిసెంబర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభి స్తామని మంత్రి వెల్లడించారు.
నీటిపారుదల అభివృద్ధిలో భాగంగా సొంత నిధులు వెచ్చించి ఏ ఎం ఆర్ పి కాలువల లైనింగ్, కంపచెట్లను తొలగించడం, బ్రాహ్మణ వెల్లెముల ద్వారా చెరువులను నింపడం వం టివి చేసామని ఆయ న వెల్లడించారు. ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇం జనీర్ శ్రీధర్ రెడ్డి ,మున్సిపల్ కమి షనర్ సయ్యద్ ముసాబ్ అహ్మ ద్ ,మాజీ మున్సి పల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య, ఇతర ప్ర జాప్రతినిధులు, అధికారులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజ రయ్యారు.

