Minister N. Uttam Kumar Reddy key comments : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన, మరమ్మతులు పూర్త య్యాకే కాళేశ్వరం బ్యారేజీల నిర్వ హణ
-NDSA, CWC అనుమతి వచ్చిన తర్వాతే నీటి నిల్వలు --ప్రజల ప్రాణ భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం --రూ.1.10 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత మాదే --భద్రాచలంతో పాటు దిగువన ఉన్న 40 గ్రామాల భద్రతకు ఎలాంటి రాజీ లేదు

Minister N. Uttam Kumar Reddy key comments: ప్రజా దీవెన, నా గార్జునసాగర్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మే డిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు పూర్తిగా పూర్తయి, జా తీయ డ్యామ్ భద్రతా సంస్థ (ND SA), కేంద్ర జల సంఘం (CWC) సాంకేతిక అనుమతులు ఇచ్చిన త ర్వాతే వాటిని తిరిగి నిర్వహిస్తా మని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశా రు. నాగార్జునసాగ ర్ విజయవిహార్‌లో సాగునీటి శాఖ ఉ న్నతాధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లా డారు.”ప్రజల ప్రాణ భద్రత విష యంలో ఎలాంటి రాజీ ఉండదు. రాజకీయాల కంటే ప్రజల భద్రత, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకే మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇ స్తోంది. అన్ని లోపాలను సరిదిద్ది న తర్వాత, NDSA, CWC పూ ర్తి స్థాయిలో పరిశీలించి అనుమతి ఇ చ్చిన తరువాతే బ్యారేజీలను నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.1.10 లక్ష ల కోట్లకు పైగా ప్రజా ధ నం ఖర్చయిందని, ఆ ఆస్తిని కాపాడటం ప్ర భుత్వ బాధ్యత అని మంత్రి అ న్నారు.మరమ్మతులు పూర్తికాక ముందే బ్యా రేజీలను నిర్వహించ డం ప్రమాదకరమని పేర్కొన్నారు.
అలాంటి పరిస్థితుల్లో భద్రాచలం పట్టణంతో పాటు దిగువన ఉన్న సుమారు 40 గ్రామాల ప్రజల భద్ర తకు ముప్పు ఏర్ప డే అవకాశం ఉందని చెప్పారు.బ్యారేజీల పునరుద్ధరణ ప నులను పూర్తిగా శాస్త్రీయ విధానంలో చేపడుతున్నా మ ని మంత్రి వివరించారు. భూగర్భ సాంకేతిక పరీక్షలు, నాన్-డి స్ట్రక్టివ్ టెస్టులు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వేలు, డ్రోన్ స ర్వేలు, వందకు పై గా బోర్ హోల్స్ ద్వారా నిర్మాణాల పరిస్థి తిని పరిశీలిస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం NDSA సూచనల మేరకు బ్యారేజీల అన్ని గేట్లను ఎత్తి ఉం చి, నీటి ఒత్తిడి లేకుండా నిర్వహి స్తున్నామని చె ప్పారు.కేంద్ర జల మరియు విద్యుత్ పరిశోధన సంస్థ (CW PRS), కేంద్ర జల సంఘం (C WC), అంతర్జాతీయ నిపుణు లు కలిసి పునరుద్ధరణ నమూనాలను పరిశీలిస్తున్నారని, భద్రతపై పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతే బ్యారేజీలను తి రి గి వినియోగంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. నాగార్జు నసాగర్ డ్యామ్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం నాగార్జునసా గర్ డ్యామ్ భద్రత, నిర్వహణ ప్రభుత్వం అత్యంత ప్రాధా న్యంగా తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలి పారు.
అవసరమైన అన్ని మరమ్మతుల అంచనాలను వెంటనే సిద్ధం చేసి పరిపాలనా అనుమతులకు పంపాలని అధికా రులను ఆదేశించారు.లైనింగ్ అవసరమైన కాలువలను గుర్తించి వెంటనే పనులు ప్రారం భించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల గుండా వెళ్లే ఓపెన్ కాలు వలను దశల వా రీగా కప్పివేసే ప్రతి పాదనలు సిద్ధం చేయాలని అధి కారుల కు ఆదేశించారు. దీనివల్ల చెత్త వేయడాన్ని అరికట్టడంతో పా టు పరిశుభ్రత మెరుగుపడుతుందని చెప్పారు.ప్రతి సా గునీటి పని లో నాణ్యత, వేగం అనే రెండు అంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వా లని మంత్రి స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోనే పనులు పూర్తి చేయా లని, నాణ్యత విషయం లో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులకు సూచించారు.
అంతకుముందు మిర్యాలగూడలో ఎగుమతులకు అనువై న ఆధునిక రైస్ మిల్లును మంత్రి ప్రారంభించారు. అనంత రం గుల్లపోతులగండి, కేశవాపూర్, నెల్లికల్లు ఎత్తిపోతల ప థకాల పనులను పరిశీలించి, వా టిని వేగంగా పూర్తి చేయా లని అధికారులను ఆదేశించారు.గత ప్రభుత్వంలో ప్రకటిం చిన అనేక సాగునీ టి పథకాలు కాగితాలకే పరిమిత మ య్యయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని భూమిపై అ మలు చేస్తూ రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీ సుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఈ సమీక్ష సమావేశంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, సాగునీటి శా ఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దున్నపోతులగండి ఎత్తిపోతలపథకం వేగవంతం
దున్నపోతుల గండి ఎత్తిపోతల ప థకం పనులను వేగవం తం చేసి ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తం కు మార్ రెడ్డి తెలిపారు.శనివారం నల్గొండ జిల్లా, అడవిదేవు లపల్లి మండలం చిట్యాల గ్రామ సమీపంలో దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం పనులపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్ర భుత్వం ఈ పథకానికి రూ. 219 కోట్లతో పరిపాలనా అనుమ తులు మంజూరు చేసినప్ప టి కీ, ఆ నిధులు సరిపోవని గుర్తించి తమ ప్రభుత్వం అదనం గా నిధులు కేటాయించి మొత్తం రూ.287 కోట్లతో పథకాన్ని మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఈ పథకంలో గ్రావి టీ పైప్‌లైన్, మోటార్లు, పంప్ హౌస్‌తో పాటు, అవసరమైన ఇత ర మౌలిక వసతుల పనులకు అనుమతులు ఇచ్చా మ ని తెలిపారు. ప్రస్తుతం అప్రోచ్ కాలువ కాం క్రీట్ పనులు, పైప్‌లైన్ పనులు, గ్రౌం డ్ లెవెల్ పనులు కొనసాగుతున్నా యని చెప్పారు. పథకానికి అవస రమైన భూసేకరణ కూడా పూర్త యిందని, భూసేకరణకు సంబంధించిన నిధులు జిల్లా కలెక్టర్ పిడి ఖాతాలో జమ అయ్యాయని వెల్లడించారు.ఈ ప్రాంతానికి దున్నపో తుల గండి ఎత్తిపోతల పథకం ఎంతో ప్రయోజనకరమైందని మం త్రి అన్నారు. పథకానికి అవసర మై న నీటి లభ్యత పుష్కలంగా ఉంద ని, పనులు పూర్తయి తే రైతులకు సాగునీరు అందడంతో వ్యవసా యం అభివృద్ధి చెందుతుందని తె లిపారు. కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికా రులు సమన్వయంతో పని చేసి నిర్దేశిత గడువులోగా పను లు పూర్తి చేయాలని ఆదేశించారు. పథకం పూర్తికి ప్రభు త్వం అన్ని రకా ల సహాయ సహకారాలు అంది స్తుందని స్పష్టం చేశారు.
దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం ద్వా రా హుస్సేన్‌పా లెం గ్రామంలో 2,400 ఎకరాలు, మొల్కచర్ల లో 1,400 ఎక రాలు, బాల్కపల్లిలో 2,400 ఎకరాలు, శ్యామ లపల్లిలో 2,400 ఎకరాలు, ముత్తిరెడ్డికుం టలో 1,400 ఎక రాలు, అడవిదేవు లపల్లిలో 1,350 ఎకరాలు, చిట్యా లలో 3,000 ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. మొ త్తం 12 వేల,230 ఎకరాల ఆయకట్టు కు ఈ పథకం ద్వారా ప్రయో జనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు.డిసెంబర్ నాటికి పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే లక్ష్యం తో అధికారులు, కాంట్రాక్టర్లు పనిచేయాలని మంత్రి ఆదేశిం చా రు.ఈ సమావేశంలో మిర్యాలగూ డ ఎ మ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎ మ్మెల్సీ శంకర్ నాయ క్,రెవి న్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీ నివాస్, సీ ఈ గగనం శ్రీనివాస రెడ్డి, ఇంజనీ ర్లు ,ప్రజలు పాల్గొన్నారు.






